AP మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం | AP Latest jobs Notifications 2025 | Latest jobs Notifications in Andhrapradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ మహిళ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ క్రింది విధంగా ఉన్నాయి. పూర్తి వివరాలు తెలుసుకొని మీరు ఈ ఉద్యోగాలకు అర్హత ఉంటే త్వరగా అప్లై చేయండి. ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. ఎంపికైన వారు సొంత జిల్లాలో పనిచేసుకునే అవకాశాన్ని పొందవచ్చు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ జనవరి 25.

జిల్లా హాస్పిటల్స్ లో ఖాళీలు భర్తీ – Click here 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : 

  • మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం, అనకాపల్లి జిల్లా నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.

🔥 మొత్తం ఉద్యోగాలు : 

  • మొత్తం 16 ఉద్యోగాలను మిషన్ వాత్సల్య పథకం ద్వారా నిర్వహించే స్పెషల్ అడాప్షన్ ఏజెన్సీ మరియు చిల్డ్రన్ హోమ్స్ లో ఉండే ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

🔥 భర్తీ చేసే ఉద్యోగాలు : 

  • మేనేజర్ , డాక్టర్ , ఆయా, చౌకీదార్ , కుక్ , మ్యూజిక్ , హెల్పర్ కం నైట్ వాచ్ మెన్ , హౌస్ కీపర్ , టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥 జీతము : 

  • మేనేజర్ – 23,170/-
  • డాక్టర్ (పార్ట్ టైం) – 9,930/-
  • ఆయా – 7,944/-
  • చౌకిదార్ – 7,944/-
  • కుక్ – 9,930/-
  • హెల్పర్ కం నైట్ వాచ్ మెన్ – 7,944/-
  • హౌస్ కీపర్ – 7,944/-
  • మ్యూజిక్ టీచర్ – 5,000/-

🏹 అప్లికేషన్ ప్రారంభ తేది : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే వారు 06-01-2025 తేది నుండి అప్లై చేయాలి.

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 

  • 25-01-2025 తేది లోపు అప్లై చేయాలి.

🏹 విద్యార్హతలు : 

  • ఈ ఉద్యోగాలకు 7వ తరగతి, 10వ తరగతి పాస్ లేదా ఫెయిల్, మరియు పోస్టులను అనుసరించి డిగ్రీ, PG, MBBS వంటి విద్యార్హతలు ఉన్నవారు అర్హులు. 

🔥 కనీస వయస్సు : 

  • కనీసం 25 సంవత్సరాలు వయస్సు ఉండాలి.

🔥 గరిష్ట వయస్సు : 

  • గరిష్ట వయస్సు 42 సంవత్సరాలలోపు ఉండాలి.

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : 

  • అప్లై చేసిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకు పిలిచి ఎంపిక చేస్తారు.

🔥 పరీక్ష విధానం : 

  • ఈ ఉద్యోగాల ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష లేదు.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు.

🏹 అప్లై విధానము : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వారు స్వయంగా వెళ్లి లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా అప్లికేషన్ పంపడం ద్వారా అప్లై చేసుకోవచ్చు.
  • అప్లై చేసే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివిన తర్వాత అప్లికేషన్ నింపి, అవసరమైన అన్ని విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీల పైన అటేస్టేషన్ చేయించి అప్లికేషన్ కి జతపరిచి అప్లై చేయాలి 

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : 

  • జిల్లా స్త్రీ & శిశు సంక్షేమం & ఎంపవర్‌మెంట్ ఆఫీసర్, ప్లాట్ నెం:03, నూకాంబిక టెంపుల్ దగ్గర, ఫ్రెండ్స్ క్లబ్ a/c ఫంక్షన్ హాల్ ఎదురుగా , అనకాపల్లి – 531001

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. లింక్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉన్న ఉద్యోగాలకు అప్లై చేయండి. 

🏹 Download Full Notification – Click here 

🏹 Official Website – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!