తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైల్వే, SSC, బ్యాంక్ వంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు 100 రోజులు పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వబోతున్నారు. ఆసక్తిగల తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నిరుద్యోగులు జనవరి 20వ తేదీ నుండి ఫిబ్రవరి 9వ తేదీ వరకు అప్లై చేయవచ్చు. ఫిబ్రవరి 15వ తేదీ కోచింగ్ ప్రారంభం అవుతుంది.
ఈ ఉచిత కోచింగ్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
🏹 HPCL లో ఉద్యోగాలు – Click here
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 ఎవరు అర్హులు ? :
- తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్, డిగ్రీ వంటి ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారు ఈ ఉచిత కోచింగ్ కు అప్లై చేయవచ్చు.
🔥 అప్లికేషన్ ఫీజు :
- ఈ ఉచిత కోచింగ్ కు అప్లై చేయడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు.
🔥 ఎన్ని రోజులు శిక్షణ ఇస్తారు :
- వంద రోజులు పాటు ఉచితంగా శిక్షని ఇస్తారు.
🔥 ఏ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ ఇస్తారు ? :
- రైల్వే, బ్యాంక్, SSC ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి ఈ ఉచిత శిక్షణ ఇస్తారు.
🔥 ఎలా అప్లై చేయాలి ?
- ఈ ఉచిత శిక్షణకు తెలంగాణ రాష్ట్ర బీసీ స్టడీ సర్కిల్స్ అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు.
🔥 అప్లికేషన్ తేదీలు :
- ఉచిత శిక్షణకు అప్లై చేయాలి అనుకునే నిరుద్యోగులు ఆన్లైన్ లో జనవరి 20వ తేదీ నుండి ఫిబ్రవరి 9వ తేదీ లోపు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
🔥 సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలు :
- అర్హత గల వారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫిబ్రవరి 12వ తేదీ నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు నిర్వహిస్తారు.
🔥 ఉచిత శిక్షణ ఎక్కడ ? ఎప్పటినుండి ?
- ఈ ఉచిత శిక్షణ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని బీసీ స్టడీ సర్కిల్స్ లో ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది.