యూకో బ్యాంక్ నుండి 250 పోస్టులతో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ అనే ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూడా భర్తీ చేస్తున్నారు.
నోటిఫికేషన్ వివరాలు అన్ని తెలుసుకొని ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి.
🏹 AP రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగాలు – Click here
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- యూకో బ్యాంక్ నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసారు.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- UCO Bank బ్రాంచ్ లలో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
- మొత్తం 250 ఉద్యోగాలు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది.
🔥 విద్యార్హత :
- ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉండాలి.
- అభ్యర్థి అప్లై చేసే రాష్ట్ర స్థానిక భాష వచ్చి ఉండాలి.
🔥 జీతం :
- జీతము రూ.48,480/- నుండి రూ.85,920/- అలాగే DA, HRA, CCA వంటి అలవెన్సులు మరియు వైద్య ప్రయోజనాలు కూడా ఇస్తారు.
🏹 మన రాష్ట్రంలో పోస్టింగ్ వచ్చే ప్రభుత్వ ఉద్యోగాలు – Click here
🔥 వయస్సు :
- వయస్సు 20 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. (02-01-1995 నుండి 01-01-2025 మధ్య పుట్టిన తేదీ ఉన్న వారు అర్హులు)
🔥 వయసులో సడలింపు :
- ప్రభుత్వ నిబంధనలు ప్రకారం SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు , PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసులో సడలింపు వర్తిస్తుంది.
🔥 ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 అప్లికేషన్ ఫీజు :
- SC / ST / PWD అభ్యర్థులకు ఫీజు – 175/-
- ఇతరులకు ఫీజు – 850/-
🏹 HPCL లో ఉద్యోగాలు – Click here
🔥 అప్లై విధానము :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. అప్లై చేసే సమయంలో అభ్యర్థులు అన్ని వివరాలు సరిగ్గా నమోదు చేయాలి.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు 16-01-2025 తేదీ నుండి అప్లై చేయవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- అప్లై చేయుటకు చివరి తేదీ : 05/02/2025
🔥 పరీక్ష కేంద్రాలు :
- తెలుగు రాష్ట్రాల్లో అనంతపురం, విజయవాడ / గుంటూరు, విశాఖపట్నం, హైదరాబాద్ / సికింద్రాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్, నర్సంపేట పట్టణాల్లో పరీక్ష కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
🏹 Download Full Notification- Click here