SBI Life లో పదో తరగతి పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు | SBI Work From home jobs | SBI Life Work From home jobs in Telugu

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ (SBI Life Insurance) నుండి లైఫ్ మిత్ర లేదా ఇన్సూరెన్స్ అడ్వైజర్ అనే పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు. పదో తరగతి అర్హత కలిగిన వారు ఈ లైఫ్ మిత్ర పోస్ట్ లకు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు అప్లై చేసుకున్న వారికి 25 గంటలు ట్రైనింగ్ ఇచ్చి పోస్టింగ్ ఇస్తారు. ఎంపికైన వారు చక్కగా తమ ఇంటి నుండే ఈ పని చేసుకోవచ్చు. నిరుద్యోగులు , గృహిణీలు మరియు ఏదైనా ఉద్యోగం చేస్తూ అదనపు ఆదాయం కోసం చూసే వారికి ఇది చాలా మంచి అవకాశం. అస్సలు వదులుకోవద్దు.

అసలు ఈ లైఫ్ మిత్ర పోస్ట్ లు అంటే ఏమిటి ? చేయాల్సిన పని ఏమిటి ? ఎలా అప్లై చేసుకోవాలి ? ఎంపికైతే జీతం ఎంత ఇస్తారు ? ఇలాంటి ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు ఆసక్తి ఉంటే ఈ పోస్టులకు క్రింద ఇచ్చిన లింకుపైన క్లిక్ చేసి అప్లై చేయండి. లేదా మీకు దగ్గరలో ఉండే SBI Life Insurance ఆఫీస్ లో సంప్రదించండి.

🏹 మన రాష్ర్టంలో పోస్టింగ్ వచ్చే ఉద్యోగాలు – Click here 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ

  • ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ (SBI Life Insurance) సంస్థ ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥 భర్తీ చేసే ఉద్యోగాలు

  • లైఫ్ మిత్ర లేదా ఇన్సూరెన్స్ అడ్వైజర్ అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥 అర్హతలు : 

  • కేవలం పదో తరగతి అర్హత కలిగిన వారు ఈ లైఫ్ మిత్ర అనే పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇతర విద్యార్హతలు మరియు అనుభవం అవసరం లేదు. 

🔥 జీతము : 

  • ఎంపికైన వారు ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ కు చెందిన పాలసీలు చేసిన దానిపై కమిషన్ వస్తుంది. ఒక పాలసీ చేస్తే 30% వరకు కమిషన్ పొందే అవకాశం ఉంది. తరువాత పాలసీ తీసుకున్న వినియోగదారులు వాళ్లు చెల్లించే ప్రీమియంపై కూడా కొంత కమిషన్ ఇస్తారు. ఇంతే కాకుండా ఇతర చాలా రకాల బెనిఫిట్స్ మరియు రివార్డ్స్ కూడా ఈ సంస్థ ఇస్తుంది. మీరు అప్లై చేసుకుంటే వారే మీకు పూర్తి వివరాలు అన్ని తెలియజేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి ప్రత్యేకంగా జీతం అంటూ ఏమీ ఉండదు.

🔥 కనీస వయస్సు

  • ఈ పోస్టులకు కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులు.

🔥 ఎంపిక విధానం : 

  • ఈ పోస్టులకు అప్లై చేసిన వారిని కంపెనీవారు సంప్రదించి ఎంపిక ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తారు. SBI Life Insurance Advisor గా పని చేయాలి అంటే IRDAI నిర్వహించే పరీక్ష పాస్ అవ్వాలి.

🔥 అప్లై విధానం : 

  • ఆన్లైన్ లో అప్లై చేయాలి. అప్లై చేసేటప్పుడు అభ్యర్ధులు తమ వివరాలు సరిగ్గా నమోదు చేయాలి. లేదంటే అప్లికేషన్ తిరస్కరణ కావచ్చు. కాబట్టి వివరాలు అన్ని స్పష్టంగా నమోదు చేయండి.

🏹 తెలంగాణ విద్యుత్ శాఖలో 1000 ఉద్యోగాలు – Click here 

🔥 ఉద్యోగం – భాద్యతలు

  • ఈ పోస్టులకు ఎంపికైన వారు తనకు తెలిసిన వారిని సంప్రదించి ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలకు సంబంధించిన వివరాలు తెలియచేసి పాలసీలను విక్రయించాలి. ఇలా చేయడం వలన ఒక్కో పాలసీపై మంచి కమిషన్ ఇస్తారు. ఈ పాలసీలకు సంబంధించి పూర్తి వివరాలు మీకు సంస్థ ప్రతినిధులు తెలియజేస్తారు. పాలసీలకు సంబంధించిన వివరాలు తెలియజేస్తూ 25 గంటలు ట్రైనింగ్ కూడా అందిస్తారు.
  • మంచి పనితీరు చూపించిన వారికి ఈ సంస్థలో ఉద్యోగ అవకాశం కూడా కల్పించవచ్చు.

🔥 ట్రైనింగ్ సమయం : 

  • ఈ పోస్టులకు ఎంపికైన వారికి 25 గంటలు ట్రైనింగ్ ఇస్తారు. 

🔥 టార్గెట్స్ ఉంటాయా ? :

  • ఈ పోస్టులకు ఎంపికైన వారికి ఎటువంటి టార్గెట్స్ ఉండవు. మీకు మీరే టార్గెట్స్ పెట్టుకుని పని చేస్తే ప్రతి నెల బాగా సంపాదించే అవకాశం ఉంటుంది.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • ప్రస్తుతం ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు. ఎంపిక ప్రక్రియలో ఒక్క రూపాయి కూడా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

🔥 జాబ్ లోకేషన్ : 

  • Work from home (చక్కగా ఇంటి వద్దనే ఉండి పని చేసుకోవచ్చు). మీకు తెలిసిన స్నేహితులు , బంధువులు మరియు ఇన్సూరెన్స్ పాలసీ అవసరమయ్యే వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కోసం తెలియజేసి , అందులో ఉన్న పాలసీలను అమ్మడం ద్వారా అధిక ఆదాయం సంపాదించవచ్చు. దీనికోసం మీరు ప్రతిరోజు ఆఫీస్ కి ఆఫీస్ కు వెళ్ళనవసరం లేదు. 

▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్స్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి , అధికారిక వెబ్సైట్ లో అప్లై చేయండి. 

🏹  Apply Online – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!