32,670/- జీతంతో ఏపీలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం | అర్హతలు , ఎంపిక విధానం వివరాలు ఇవే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల కోరుతూ మరో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అధికారికంగా విడుదల చేయడం జరిగింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఉన్నారు. తాజాగా చాలా రోజుల తర్వాత ఫార్మసీ ఆఫీసర్ అనే ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ మరొక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 32,670/- రూపాయలు జీతం ఇస్తారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాల ఎంపికలో ఎలాంటి రాత పరీక్ష ఉండదు.. అర్హత ఉన్న అభ్యర్థులు జనవరి 17వ తేదీలోపు అప్లై చేయాల్సి ఉంటుంది.

  • నోటిఫికేషన్ కు సంబంధించిన మరి కొన్ని ముఖ్యమైన వివరాలు కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకోండి..

ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : 

  • ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ ప్రాంతీయ డైరెక్టర్ కార్యాలయం, జోన్-IV, కడప నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

🔥 పోస్టుల పేర్లు: 

  • ఈ నోటిఫికేషన్ ద్వారా ఫార్మసీ ఆఫీసర్ అనే ఉద్యోగాల భర్తీ కోసం అర్హత ఉన్న అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. 

🔥 విద్యార్హత : 

  • D.ఫార్మసీ లేదా B.ఫార్మసీ విద్యార్హతలు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు. 

🔥 ఖాళీలు : 

  • ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 15 పోస్టులు భర్తీ చేస్తున్నారు.  

🔥 జీతము: 

  • ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 32,670/- రూపాయలు జీతం ఇస్తారు.

🔥 ముఖ్యమైన తేదీలు : 

  • నోటిఫికేషన్ విడుదల తేదీ : 04-01-2025
  • అప్లికేషన్ ప్రారంభ తేదీ :  04-01-2025
  • అప్లికేషన్ చివరి తేదీ :  17-01-2025

🔥 వయస్సు : 

  • 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
  • ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్రింది విధంగా వయసులో సడలింపు కూడా వర్తిస్తుంది. 
  • అనగా ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసులో సడలింపు వర్తిస్తుంది.
  • విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు పది సంవత్సరాల వరకు వయసులో సడలింపు వర్తిస్తుంది.

🔥 అప్లికేషన్ ఫీజు వివరాలు :

  • ఓసి అభ్యర్థులు 500/- ఫీజు చెల్లించాలి. 
  • ఎస్సీ, ఎస్టీ, BC మరియు PWD అభ్యర్థులు 300/- ఫీజు చెల్లించాలి. 

🔥 ఎంపిక విధానం : 

  • ఈ ఉద్యోగాల ఎంపికలో రాత పరీక్ష నిర్వహించరు.
  • మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • అభ్యర్థులకు అర్హత పరీక్షలో వచ్చిన మార్కులకు 75% మార్కులు కేటాయిస్తారు.
  • అభ్యర్థులకు ఉన్న అనుభవానికి 15% మార్కుల వరకు కేటాయిస్తారు
  • మరియు ఉద్యోగానికి అప్లై చేయడానికి అవసరమైన అర్హత కోర్సు పూర్తి చేసినప్పటి నుండి ఇప్పటివరకు పూర్తయిన సంవత్సరాలకు ప్రతి సంవత్సరానికి ఒక మార్క్ కేటాయిస్తూ గరిష్టంగా 10% మార్కులు కేటాయిస్తారు. 

🔥 అనుభవానికి మార్కుల కేటాయింపు ఇలా చేస్తారు : 

  • గిరిజన ప్రాంతాల్లో పని చేస్తే ప్రతీ ఆరు నెలలకు 2.5 మార్కులు కేటాయిస్తారు.
  • గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తే ప్రతీ ఆరు నెలలకు 2 మార్కులు కేటాయిస్తారు.
  • పట్టణ ప్రాంతాల్లో పని చేస్తే ప్రతీ ఆరు నెలలకు ఒక మార్కు కేటాయిస్తారు.

🔥 పోస్టింగ్ : 

  • ఎంపికైన వారికి జోన్-4 లో ఉండే హాస్పిటల్స్ లో పోస్టింగ్ ఇస్తారు.

🔥 అప్లికేషన్ విధానము : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేసేవారు ముందుగా నోటిఫికేషన్ తో పాటు ఇచ్చిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసి దానిలో ఉన్న అన్ని వివరాలు సరిగ్గా నమోదు చేసి, అవసరమైన అన్ని సెల్ఫ్ అటిస్టెడ్ జిరాక్స్ కాపీలు మరియు ఫీజు చెల్లించిన డిడి జతపరిచి అప్లికేషన్ సంబంధిత కార్యాలయంలో అందజేయాలి 

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా  : 

  • ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ ప్రాంతీయ డైరెక్టర్ కార్యాలయం, జోన్-IV, కడప

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అన్ని నోటిఫికేషన్స్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి వివరాలు చదివి అర్హత ,ఆసక్తి ఉన్నవారు అప్లికేషన్ నింపి త్వరగా అప్లై చేయండి. 

Download Notification & Application

✅  Official Website – Click here 

🔥 ముఖ్యమైన గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే అప్లై చేయండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!