ఆంధ్రప్రదేశ్ వైద్య , ఆరోగ్య శాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూసే వారికి శుభవార్త . ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో 7,000 నుంచి 8,000 ఉద్యోగాల భర్తీకి వైద్య , ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని మంత్రిగారు చెప్పారు.
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఈ పోస్టులు భర్తీకి సంబంధించిన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి..
🏹 AIIMS మంగళగిరిలో ఉద్యోగాలు – Click here
🏹 ONGC లో ఉద్యోగాలు – Click here
శుక్రవారం ఆంధ్రప్రదేశ్ వైద్య , ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖపై మంత్రి సత్య కుమార్ యాదవ్ గారు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైద్య ఆరోగ్యశాఖలో 1,0,1125 పోస్టులు ఉండగా వాటిలో 26,263 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. అనగా సిబ్బంది కొరత 25.97 శాతం ఉంది అని స్పష్టం చేశారు. ఇంత పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉన్నప్పటికీ గత ప్రభుత్వం ‘జీరో వేకెన్సీ’ అంటూ ప్రచారం చేసుకుందని విమర్శించారు.
కాబట్టి వైద్య ఆరోగ్య శాఖలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు త్వరలో ఏడు నుంచి ఎనిమిది వేల పోస్టులను భర్తీ చేయాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనికోసం ప్రాధాన్యతల ఆధారంగా కార్యాచరణ రూపొందించాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు. కాబట్టి మంత్రిగారి ఆదేశాలు మేరకు త్వరలో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసి అవకాశాలు ఉన్నాయి.
భర్తీ చేయబోయే ఉద్యోగాల్లో స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, లాబ్ టెక్నీషియన్, FNO, MNO , ల్యాబ్ అటెండెన్ట్స్ , డేటా ఎంట్రీ ఆపరేటర్ , రేడియో గ్రాఫిక్ టెక్నీషియన్ , CT టెక్నీషియన్ (CT స్కాన్) , ECG టెక్నీషియన్ , అనస్తీసియా టెక్నీషియన్ , ధోబి / ప్యాకర్స్ , ఎలక్ట్రీషియన్ , ప్లంబర్ , డ్రైవర్ (హెవీ వెహికల్) , థియేటర్ అసిస్టెంట్ , గ్యాస్ ఆపరేటర్ , వార్డ్ బాయ్స్ వంటి వివిధ రకాల ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం ఉంది.