తెలంగాణా రాష్ట్రంలోని హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలో గల స్పెషల్ పోలీస్ ఆఫీసర్ (SPO) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సిటి సిఏఆర్ హెడ్ క్వార్టర్స్ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు.
తాత్కాలిక ప్రాతిపదికన మొత్తం 191 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🏹 జిల్లా కోర్టులో ఉద్యోగాలు – Click here
🏹 తెలంగాణ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు – Click here
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- సిటి సిఏఆర్ హెడ్ క్వార్టర్స్ అధికారులు ఈ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేశారు.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
- 191 ఉద్యోగాలను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- స్పెషల్ పోలీస్ ఆఫీసర్ (SPO) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 అర్హత :
- ఈ ఉద్యోగాలకు మాజీ సైనికులు , మాజీ పారా మిలటరీ బలగాలు , రిటైర్డ్ పోలీస్ సిబ్బంది దరఖాస్తు చేసుకోవచ్చు.
- తెలంగాణా రాష్ట్రానికి చెందిన వారికి ప్రాధాన్యత లభిస్తుంది.
🔥 వయస్సు :
- జనవరి 01 , 2025 నాటికి 58 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు వున్న మాజీ పారా మిలటరీ , రిటైర్డ్ పోలీస్ అధికారులు , రెండు సంవత్సరాల లోపు పదవి విరమణ చేసి వున్న వారు ఈ పోస్టులకు అర్హులని తెలిపారు.
- గరిష్ట వయోపరిమితి 61 సంవత్సరాలు.
🔥దరఖాస్తు విధానం :
- అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం ద్వారా నేరుగా కార్యాలయం కి వారి దరఖాస్తు ను అందజేయాలి.
🔥 కార్యాలయ చిరునామా:
ఎస్పివో (SPO) ఆఫీస్ , సిటి పోలీస్ కార్ హెడ్ క్వార్టర్స్ , పెట్ల బురుజు కార్యాలయం లో జనవరి 25 సాయంత్రం 5:00 గంటల లోగా నేరుగా సంప్రదించి దరఖాస్తులు సమర్పించాలి.
🔥 అవసరమగు ధృవపత్రాలు:
- ఎక్స్ సర్వీస్ మాన్ డిశ్చార్జ్ బుక్ / సిఎపిపి డిశ్చార్జ్ సర్టిఫికెట్
- ఆర్పిపి రిటైర్మెంట్ ఆర్డర్
- ఆధార్ కార్డు
- పాన్ కార్డ్
- టెక్నికల్ ట్రేడ్ ప్రోఫిసియన్సీ సర్టిఫికెట్
- డ్రైవింగ్ లైసెన్స్ – ఎల్ఎంవి / హెచ్ఎంవి (డ్రైవర్ అభ్యర్థులు)
- 3 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు
🔥 జీతం :
- ఈ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి నెలకు 26 వేల రూపాయల గౌరవ వేతనం లభిస్తుంది.
🔥 ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారి యొక్క మెరిట్ మరియు ధ్రువపత్రాలు పరిశీలించి , ఎంపిక చేస్తారు.
🔥 ముఖ్యమైన తేది:
- అభ్యర్థులు జనవరి 25 సాయంత్రం 5:00 గంటల లోగా నేరుగా కార్యాలయం ను సంప్రదించి దరఖాస్తులు సమర్పించాలి.