తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో గల తెలంగాణ ప్రభుత్వ ఆదర్శ పాఠశాలల నందు పనిచేసేందుకు గాను ఫిజికల్ డైరెక్టర్ మరియు కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలను అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన , వారధి సొసైటీ , కరీంనగర్ సంస్థ నుండి ఉద్యోగ ప్రకటన విడుదల అయ్యింది.
జగిత్యాల జిల్లాకు చెందిన , అర్హత గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🏹 జిల్లా సహకార బ్యాంకుల్లో ఉద్యోగాలు – Click here
🏹 HDFC Bank లో 500 ఉద్యోగాలు – Click here
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- వారధి సొసైటీ , కరీంనగర్ సంస్థ నుండి ఈ రిక్రూట్మెంట్ జరుపుతున్నారు.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
- 03 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- ఫిజికల్ డైరెక్టర్ – 02
- కంప్యూటర్ ఆపరేటర్ – 01
🔥 విద్యార్హత :
- ఫిజికల్ డైరెక్టర్ :
- అభ్యర్థి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఫిజికల్ ఎడ్యుకేషన్ డిగ్రీ నందు ఉత్తీర్ణులు అయి వుండాలి.
- అభ్యర్థులు జాతీయ స్థాయి టోర్నమెంట్ నందు పాల్గొంటే , సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించవలెను.
- కంప్యూటర్ ఆపరేటర్:
- అభ్యర్థి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బి.కాం (కంప్యూటర్) లేదా బి.ఎస్సీ (కంప్యూటర్) తో పాటుగా ఏం.కామ్ / ఎంబిఎ / ఎంసిఎ ఉత్తీర్ణత సాధించి వుండాలి.
- అకౌంట్స్ మరియు అడ్మినిస్ట్రేషన్ రంగంలో కనీసం రెండు సంవత్సరాల పని అనుభవం అవసరం.
🔥 వయస్సు :
- 18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఎస్సీ, ఎస్టీ , బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
- PH అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
- ఎక్స్ సర్విస్ మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
🔥దరఖాస్తు విధానం :
- అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు వారి యొక్క బయోడేటా లేదా దరఖాస్తు తో పాటు విద్యార్హత దృవీకరణ పత్రములు జిరాక్స్ ప్రతులను కార్యాలయ పని రోజులలో తేది : 10/01/2025 సాయంత్రం 5:00 గంటల లోగా జిల్లా కలెక్టర్ కార్యాలయం (సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ సముదాయం ) థరూర్ క్యాంప్ , జగిత్యాల రూం నెంబరు : 04 నందు వారధి సొసైటీ మేనేజర్ గారికి సమర్పించవలెను.
🔥 జీతం :
- ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి 22,750/- రూపాయల జీతం లభిస్తుంది.
- కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి 19,500/- రూపాయల జీతం లభిస్తుంది.
🔥 ముఖ్యమైన తేది:
- అభ్యర్థులు 10/01/2025 సాయంత్రం 5:00 లోగా దరఖాస్తును సంబంధిత చిరునామాకు సమర్పించవలెను.