Headlines

HDFC బ్యాంక్ లో డిగ్రీ అర్హతతో 500 ఉద్యోగాలు | HDFC Bank Recruitment 2025 | Latest Bank Jobs

ప్రముఖ లీడింగ్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అయినటువంటి HDFC బ్యాంక్ సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ( IBPS) వారి సహకారంతో రిలేషన్షిప్ మేనేజర్స్ – ప్రోబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

దేశవ్యాప్తంగా మొత్తం 500 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి విద్యార్హతలు , దరఖాస్తు విధానం , పరీక్షా విధానం , పరీక్షా కేంద్రాలు మొదలగు పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి. 

🏹 ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు – Click here 

🏹 రైల్వేలో 1036 పోస్టులకు కొత్త నోటిఫికేషన్ – Click here 

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : 

  • HDFC బ్యాంక్ వారు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :

  • రిలేషన్షిప్ మేనేజర్స్ – ప్రోబేషనరీ ఆఫీసర్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :

  • 500 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 విద్యార్హత : 

  • ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి ఏదైనా విభాగంలో 50 శాతం మార్కులతో  గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి వుండాలి.
  • సంబంధిత విభాగంలో 1-10 సంవత్సరాల అనుభవం కలిగి వుండాలి.

🔥  గరిష్ట వయస్సు :

  • 35 సంవత్సరాల లోపు వయస్సు అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • వయస్సు నిర్ధారణకు 07/02/2025 ను కట్ ఆఫ్  తేది గా నిర్ణయించారు.

🔥దరఖాస్తు విధానం :

  • ఈ ఉద్యోగాలు కొరకు అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోవాలి.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • అభ్యర్థులు 479/- రూపాయల దరఖాస్తు ఫీజును ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • 30/12/2024 తేది నుండి 07/02/2025 లోగా దరఖాస్తు ఫీజును చెల్లించాలి.

🔥 ఎంపిక విధానం :

  • ఆన్లైన్ వ్రాత పరీక్ష మరియు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

 🔥 ఆన్లైన్ పరీక్షా విధానం :

  • మొత్తం 100 మార్కులకు గాను ఆన్లైన్ కంప్యూటర్ ఆధారిత పరిక్ష నిర్వహిస్తారు.
  • 100 ప్రశ్నలు వుంటాయి , ఒక గంట పాటు సమయం లభిస్తుంది.
  • ఇందులో రీజనింగ్ ( 35 ప్రశ్నలకు గాను 35 మార్కులు కేటాయించారు ) , న్యూమరికల్ ఎబిలిటీ  ( 35 ప్రశ్నలకు గాను 35 మార్కులు కేటాయించారు ) , ఇంగ్లీష్ లాంగ్వేజ్ ( 30 ప్రశ్నలకు గాను 30 మార్కులు కేటాయించారు ) సబ్జెక్టులు వుంటాయి.
  • ఒక్కో సబ్జెక్టు కి 20 నిముషాల చొప్పున సమయం కేటాయించారు.
  • ప్రతి తప్పు సమాధానానికి కి ¼ వంతు నెగెటివ్ మార్కింగ్ విధానం కలదు.

🔥 పరీక్ష కేంద్రాలు :

  • దేశంలోని పలు ప్రముఖ నగరాలతో పాటు   తెలుగు రాష్ట్రాలలో విశాఖపట్నం , హైదరాబాద్ ను పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేశారు.

🔥 జీతం : 

  • ఈ ఉద్యోగాలకు ఎంపికయిన వారికి 3 లక్షల నుండి 12 లక్షల వరకు పే స్కేల్ వర్తిస్తుంది.

🔥 ప్రొబేషన్ పీరియడ్: 

  • ఎంపిక కాబడిన అభ్యర్థులు ఆరు నెలలు పాటు ప్రొబెషన్ పీరియడ్ లో వుంటారు.

🔥 ముఖ్యమైన తేదిలు:

  • ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది : 30/12/2024
  • ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేది : 07/02/2025
  • టెన్టేటివ్ ఆన్లైన్ పరీక్ష నిర్వహణ : మార్చ్ 2025

👉  Click here for notification 

👉 Click here to Apply 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!