Headlines

1036 పోస్టులతో రైల్వే శాఖ కొత్త నోటిఫికేషన్ విడుదల | RRB Ministerial and Isolated Categories Recruitment 2025 Notification Out | RRB MI Recruitment 2025 in Telugu

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి మరో బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసారు. RRB విడుదల చేసిన ఈ CEN : 07/2024 నోటిఫికేషన్ ద్వారా వివిధ మినిస్టీరియల్ మరియు ఐసోలేటెడ్ కేటగిరీ ఉద్యోగాలు మొత్తం 1036 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

భర్తీ చేస్తున్న ఉద్యోగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్లు , సైంటిఫిక్ సూపర్వైజర్, ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు , చీఫ్ లా అసిస్టెంట్ , పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ , సైంటిఫిక్ అసిస్టెంట్ / ట్రైనింగ్ , జూనియర్ ట్రాన్స్లేటర్ (హిందీ) , సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ , స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ , లైబ్రేరియన్ , మ్యూజిక్ టీచర్ , ప్రైమరీ రైల్వే టీచర్ , అసిస్టెంట్ టీచర్, లాబొరేటరీ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ – 3 వంటి వివిధ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🏹 AP హైకోర్టులో ఉద్యోగాలు భర్తీ – Click here 


🏹 జిల్లా కోర్టులో పదో తరగతి ఉద్యోగాలు – Click here

ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :

  • రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :

  • మొత్తం 1036 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:

  • పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్లు
  • సైంటిఫిక్ సూపర్వైజర్
  • ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు
  • చీఫ్ లా అసిస్టెంట్ 
  • పబ్లిక్ ప్రాసిక్యూటర్
  • ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ 
  • సైంటిఫిక్ అసిస్టెంట్ /  ట్రైనింగ్ 
  • జూనియర్ ట్రాన్స్లేటర్ ( హిందీ )
  • సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ 
  • స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ 
  • లైబ్రేరియన్ 
  • మ్యూజిక్ టీచర్ 
  • ప్రైమరీ రైల్వే టీచర్ 
  • అసిస్టెంట్ టీచర్ 
  • లాబొరేటరీ అసిస్టెంట్ 
  • ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ – 3

🔥 విద్యార్హత :

  • PGT ఉద్యోగాలకు సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ తో పాటు బీఈడీ పూర్తి చేసి ఉండాలి. 
  • TGT ఉద్యోగాలకు డిగ్రీ విద్యార్హతతో పాటు బిఈడి పూర్తి చేసి CTET క్వాలిఫై అయ్యి ఉండాలి. 
  • ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ (ఇంగ్లీష్) ఉద్యోగాలకు PT లో డిగ్రీ లేదా B.P.Ed పూర్తి చేసి ఉండాలి. 
  • సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు డిగ్రీ విద్యార్థితో పాటు పబ్లిక్ రిలేషన్స్ లేదా జర్నలిజం లేదా మాస్ కమ్యూనికేషన్స్ లో డిప్లమో పూర్తి చేసి ఉండాలి. 
  • స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు లేబర్ లేదా సోషల్ వెల్ఫేర్ లేదా లేబర్ లా లో డిప్లమో పూర్తి చేసి ఉండాలి / LLB లేదా PG లేదా MBA HR లో పూర్తి చేసి ఉండాలి. 
  • లేబరేటరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు 12వ తరగతి సైన్స్ లో పూర్తి చేసి ఉండి ఒక సంవత్సరం అనుభవం ఉండాలి. 
  • ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 (కెమిస్ట్ మరియు మెటలర్జిస్ట్) ఉద్యోగాలకు సైన్స్ గ్రూపులో 12వ తరగతి అర్హతతో పాటు DMLT పూర్తి చేసి ఉండాలి. 

🔥  వయస్సు :

  • పోస్టులను అనుసరించి 18 సంవత్సరాలు దాటి వుండి, 48 సంవత్సరాల లోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం వుంది.

🔥 వయస్సులో సడలింపు వివరాలు : 

  • గరిష్ట వయస్సు నిర్ధారణ లో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు , ఒబిసి వారికి 3 సంవత్సరాలు , దివ్యాంగులు కి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో  దరఖాస్తు చేసుకోవాలి.

🔥 అప్లికేషన్ ఫీజు: 

  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ,ఇబిసి, ఏక్స్ – సర్వీస్ మాన్ , మైనారిటీలు, ట్రాన్స్ జెండర్లు 250/- రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. (పరీక్ష రాసిన వారికి బ్యాంక్ చార్జీలు మినహాయించి పూర్తి ఫీజు రిఫండ్ చేస్తారు)
  • మిగతా అందరు అభ్యర్థులు 500/- రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. (పరీక్ష రాసిన వారికి బ్యాంక్ చార్జీలు మినహాయించి 400/- ఫీజు రిఫండ్ చేస్తారు)

🔥 జీతం :

  • పోస్టులను అనుసరించి జీతము ఇస్తారు.

🔥 ఎంపిక విధానం :

  • వ్రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
  • అలానే అవసరమైన పోస్టులకు స్కిల్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు.
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్

🔥 పరీక్ష విధానం :

  • పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులుకు నిర్వహిస్తారు.
  • ప్రతీ ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు.
  • ప్రతీ తప్పు సమాధానానికి ⅓ వంతు మార్కులు తగ్గిస్తారు.

 🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ:

  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది : 07/01/2025

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : 06/02/2025

🔥 అప్లికేషన్ సవరణ తేదీలు : 

  • 09-02-2025 తేది నుండి 18-02-2025 వరకు అప్లికేషన్ లో ఏమైనా తప్పులు ఉంటే మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది.

👉  Download Full Notification – Click here 

👉 Click here for official website 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!