భారత ప్రభుత్వం , సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంస్థ , హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా గల CSIR – నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (NGRI) సంస్థ జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు భారతదేశం లోని అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి , అవసరమగు విద్యార్హతలు , దరఖాస్తు చేయు విధానం , ఎంపిక విధానం మొదలగు అన్ని అంశాలు ను పూర్తిగా తెలుసుకొనేందుకు గాను ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి.
🏹 AP హైకోర్టులో ఉద్యోగాలు భర్తీ – Click here
🏹 జిల్లా కోర్టులో పదో తరగతి ఉద్యోగాలు – Click here
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- CSIR – నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (NGRI) సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
- మొత్తం 04 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గాను ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥 విద్యార్హత :
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10+2 / ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి వుండాలి లేదా తత్సమాన అర్హత కలిగి వుండాలి.
- DoPT వారి నిబంధనల మేరకు స్టేనోగ్రఫీలో ప్రావీణ్యత కలిగి వుండాలి.
🔥 వయస్సు:.
- జూనియర్ స్టేనోగ్రాఫర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వుండాలి.
- వయస్సు నిర్ధారణ కొరకు కట్ ఆఫ్ తేది గా 31/01/2025 ను నిర్ణయించారు.
- ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు & ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.
🔥 అవసరమగు ధృవపత్రాలు:
- పదవ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్
- ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా ఉత్తీర్ణత సర్టిఫికెట్
- గ్రాడ్యుయేషన్ లేదా ఇతర క్వాలిఫికేషన్లు ఏమైనా వుంటే ఆ సర్టిఫికెట్లు
- డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్
- కుల ధృవీకరణ పత్రం
- నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (అవసరమగు వారు)
- దివ్యాంగుల సర్టిఫికెట్
- ఇతర ధ్రువపత్రాలు ఏమైనా వుంటే ఆ ధ్రువపత్రాలు
🔥 దరఖాస్తు ఫీజు:
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా 500/- రూపాయల అప్లికేషన్ ఫీజును చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ , దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
🔥 ఎంపిక విధానం :
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను వ్రాత పరీక్ష (ఓఏంఆర్ / కంప్యూటర్ ఆధారిత) మరియు స్టేనోగ్రఫిలో ప్రోఫిషియన్సీ పరీక్ష నిర్వహణ ద్వారా ఎంపిక చేస్తారు.
🔥 వ్రాత పరీక్ష విధానం :
- ఓఏంఆర్ ఆధారిత లేదా కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ ఆబ్జెక్టివ్ పరీక్ష వుంటుంది.
- మొత్తం 200 ప్రశ్నలకు గాను 2 గంటల సమయం కేటాయిస్తారు.
- జనరల్ ఇంటెలిజన్స్ & రీజనింగ్ 50 ప్రశ్నలకు గాను 50 మార్కులు , జనరల్ అవేర్నెస్ 50 ప్రశ్నలకు 50 మార్కులు , ఇంగ్లీష్ లాంగ్వేజ్ 100 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు.
- ప్రతి ప్రశ్నకు ¼ వంతు నెగెటివ్ మార్కింగ్ విధానం కలదు.
🔥 ప్రొఫెసియన్సీ పరిక్ష :
- అభ్యర్థులు ఆన్లైన్ పరిక్ష తో పాటు ప్రోఫెసియన్సీ పరిక్ష కూడా రాయాలి.
- అభ్యర్థులకు ఇంగ్లీష్ లేదా హిందీలో 10 నిమిషాల పాటు నిముషానికి 80 పదాల చొప్పున ఒక డిక్టేషన్ ఇవ్వబడుతుంది.
- ట్రాన్స్క్రిప్షన్ కి సంబంధించి ఇంగ్లీష్ భాషకి 50 నిముషాలు , హిందీ భాషకి 65 నిముషాలు సమయం ఇవ్వబడుతుంది.
🔥 జీతం:
- జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగానికి ఎంపిక కాబడిన వారికి 7 వ సిపిసి ప్రకారం లెవెల్ – 4 పే స్కేల్ రూపాయలు 25,500/- 81,100/- వర్తిస్తుంది.
- వీరికి నెలకు సుమారు 52,100/- రూపాయల జీతం లభిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదీలు:
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేది : 30/12/2024 (ఉదయం 10:00 గంటల నుండి)
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేయడానికి చివరి తేది : 31/01/2025 (సాయంత్రం 6:00 గంటల లోగా)