Headlines

ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష లో కాంట్రాక్టు ఉద్యోగాలు భర్తీ | AP EdCIL Recruitment 2025 | Latest jobs Notifications in Telugu

ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ (EdCIL) సంస్థ నుండి కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ ఉద్యోగాలను ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో  కాంట్రాక్టు ప్రాధిపతికన భర్తీ చేసేందుకు గాను నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ ఉద్యోగాలను SPD సమగ్ర శిక్ష అనుమతి మేరకు 26 జిల్లాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులను  ఎటువంటి వ్రాత పరిక్ష లేకుండా , మెరిట్ ఆధారంగా లేదా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి విద్యార్హతలు , దరఖాస్తు విధానం , ఎంపిక విధానం , జీతం మొదలగు పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🏹 AP మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు – Click here 

🏹 AP హైకోర్టులో ఉద్యోగాలు భర్తీ – Click here 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : 

  • ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ (EdCIL) సంస్థ నుండి ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గాను నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు: 

  • కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ ఉద్యోగాలను ఆంధ్రప్రదేశ్ లోని 26 రాష్ట్రాలలో భర్తీ చేస్తున్నారు. 

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య

  • మొత్తం 255 పోస్టులను భర్తీ చేస్తున్నారు.

 🔥 విద్యార్హత :

  • సైకాలజీ లో ఏం.ఎస్సీ /ఎం.ఏ  లేదా సైకాలజీ లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత (తప్పనిసరి) సాధించిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • సంబంధిత విభాగంలో కౌన్సిలింగ్ అంశంలో 2.5 సంవత్సరాల పని అనుభవం కలిగివుండాలి.
  • డిప్లొమా ఇన్ కెరీర్ గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్ పూర్తి చేసిన వారికి ప్రాధాన్యత కలదు.
  • దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తెలుగు భాషలో ప్రావీణ్యం కలిగి వుండాలి.

🔥  గరిష్ట వయస్సు :

  • అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి 40 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వుండాలి.
  • వయస్సు నిర్ధారణ కొరకు 31/12/2024 ను కట్ ఆఫ్ తేది గా నిర్ణయించారు.
  • వయస్సు , విద్యార్హత మొదలగు విషయాల నిర్ధారణ కొరకు కట్ ఆఫ్ తేది గా31/12/2024 ను నిర్ణయించారు.

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు నోటిఫికేషన్ లో తెలిపిన గూగుల్ లింక్ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేయాలి.

🔥 అప్లికేషన్ ఫీజు:

  • ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

🔥 ఎంపిక విధానం :

  •  అభ్యర్థులను వారి అకడమిక్ మరియు ఎక్పీరియన్స్ వంటి అంశాల తో పాటు వ్రాత పరిక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహణ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

🔥 జీతం

  • కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ గా ఎంపిక కాబడిన వారికి నెలకు 30,000 /- రూపాయలు జీతం ఇస్తారు.

🔥 ముఖ్యమైన అంశాలు:

  • కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో పనిచేసేందుకు అవకాశం వుంటుంది.
  • కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ ఉద్యోగాలను కాంట్రాక్టు ప్రాధిపతికన ఏప్రిల్ 30, 2025 వరకు నియమిస్తారు. తదనంతరం అవసరానికి అనుగుణంగా జూలై 2025 నుండి ఏప్రిల్ 2026 వరకు పొడిగిస్తారు.
  • సమగ్ర శిక్ష (ఆంధ్రప్రదేశ్) వారి అవసరాలు మరియు పనితీరు ఆధారంగా వీరి ఉద్యోగాల కాలపరిమితి పొడిగింపు వుంటుంది.

🔥 ముఖ్యమైన తేదీలు:

  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది : 01/01/2025
  • ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేది : 10/01/2025

👉 Click here for notification

👉 Click here to Apply 

👉 Click here for official website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!