ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ ఎంపిక ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న దేహ దారుఢ్య పరీక్షలు కొన్ని జిల్లాల్లో వాయిదా వేయడం జరిగింది. వైకుంఠ ఏకాదశి , శాంతిభద్రతల ను దృష్టిలో పెట్టుకొని ఈనెల 8వ తేదీ నుంచి 10వ తేదీ మధ్య జరగాల్సిన దారుఢ్య పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు పోలీస్ నియామక మండలి ఒక ప్రకటనలో తెలిపింది. మిగతా తేదీల్లో నిర్వహించాల్సిన దేహదారుఢ్య పరీక్షలు యధావిధిగా జరుగుతాయి.
🏹 AP మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు – Click here
🏹 AP హైకోర్టులో ఉద్యోగాలు భర్తీ – Click here
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
కొత్త తేదీలు ఇవే :
- శ్రీకాకుళం , విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో జనవరి 8వ తేదీన నిర్వహించాల్సిన దేహదారుఢ్య పరీక్షలను జనవరి 11వ తేదీన నిర్వహిస్తారు.
- అనంతపురంలో జనవరి 8 నుండి 10వ తేదీల మధ్య నిర్వహించాల్సిన దేహదారుఢ్య పరీక్షలను జనవరి 17 , 18, 20 తేదీల్లో నిర్వహిస్తారు.
- చిత్తూరులో జనవరి 8 నుండి 9 వరకు జరగాల్సిన దేహదారుఢ్య పరీక్షలను జనవరి 17, 18 తేదీల్లో నిర్వహిస్తారు.
- క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అధికారిక వెబ్సైట్లో విడుదల చేసిన ప్రకటన మీరు డౌన్లోడ్ చేసి చదవండి
🏹 Official Website – Click here
గమనిక : 6,100 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో భాగంగా నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షలో పాస్ అయిన వారికి ప్రస్తుతం దేహదారుఢ్య పరీక్షలను పోలీస్ నియామక మండలి నిర్వహిస్తుంది.