Headlines

తెలంగాణ జిల్లా కోర్టుల్లో ఇంటర్ అర్హతతో రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ | Telangana District Court Record Assistant Jobs Notification 2025

తెలంగాణ రాష్ట్రంలోని రాష్ట్ర హైకోర్ట్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ 07/2025 విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జిల్లా కోర్టుల్లో రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత గల వారు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయబోయే ఈ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత పొందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🏹 తెలంగాణ జిల్లా కోర్టుల్లో 479 ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు – Click here 

🏹 తెలంగాణ కోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవరకు అతి తక్కువ ఫీజు తో ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నాము.

🔥 Download Our App

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : 

  • తెలంగాణ హైకోర్టు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥 ఉద్యోగాల సంఖ్య : 

  • మొత్తం అన్ని జిల్లాలో కలిపి 52 పోస్టులను భర్తీ చేస్తున్నారు.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:

  • రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 విద్యార్హత

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఇంటర్మీడియట్ విద్యార్హత ఉన్న వారు అర్హులు.
  • అభ్యర్థులు వారు దరఖాస్తు చేసుకుంటున్న జిల్లాలో గల స్థానిక భాషపై అవగాహన కలిగి వుండాలి.

 🔥  వయస్సు :

  • 18 సంవత్సరాల నుండి 34 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఎస్సీ,  ఎస్టీ, బీసీ,  EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు , దివ్యాంగులు కి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
  • వయస్సు నిర్ధారణ కొరకు 01/07/2025 ను కట్ ఆఫ్ తేది గా నిర్ణయించారు.

🔥దరఖాస్తు విధానం : 

  • అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వార అధికారిక వెబ్సైట్ లో జనవరి 08-01-2025 నుండి జనవరి 31-01-2025 లోగా దరఖాస్తు చేసుకోవాలి.

🔥 ఎంపిక విధానం:

  • ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఓఏంఆర్ ఆధారిత వ్రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
  • ఈ వ్రాత పరీక్షలో వారి కనీస విద్యార్హత ఆధారిత స్థాయి ప్రశ్నలు అడుగుతారు.
  • వ్రాత పరీక్ష తర్వాత 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్ & మౌఖిక ఇంటర్వ్యూకు పిలుస్తారు.

🏹 పరీక్ష విధానం : 

  • మొత్తం 100 మార్కులకు 100 ప్రశ్నలు ఇస్తారు.
  • 60 ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్ నుండి 40 ప్రశ్నలు జనరల్  ఇంగ్లీష్ నుండి ఇస్తారు.
  • పరీక్ష సమయం : 120 నిమిషాలు.

🏹 క్వాలిఫై మార్కులు : 

  • OC మరియు EWS అభ్యర్థులకు 40% మార్కులు, BC అభ్యర్థులకు 35% మార్కులు , ఎస్సీ, ఎస్టీ, PH అభ్యర్థులకు 30% మార్కులు వస్తే క్వాలిఫై అవుతారు. 

🔥 అప్లికేషన్ ఫీజు:

  • అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు ఫీజు ను చెల్లించాలి.
  • ఓసి మరియు బిసి అభ్యర్థులు 600/- రూపాయలు చెల్లించాలి.
  • ఎస్సీ, ఎస్టీ ,  EWS &  దివ్యాంగులు 400/- రూపాయలు దరఖాస్తు ఫీజు ను చెల్లించాలి.

🔥 జీతం:

  • ఎంపిక కాబడిన అభ్యర్థులు కి ఉద్యోగానికి ఎంపిక అయిన ప్రారంభం లోనే 30,000/- వేలకు పైగా జీతం లభిస్తుంది మరియు వివిధ అలోవేన్స్ లు కూడా లభిస్తాయి.
  • వీరికి 19,000/- రూపాయల నుండి 58,850/- రూపాయల పే స్కేల్ వర్తిస్తుంది.

 🔥 ముఖ్యమైన తేదిలు:

  • నోటిఫికేషన్లు విడుదల అయిన తేది : 02/01/2025
  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది : 08/01/2025
  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : 31/01/2025
  • హాల్ టికెట్స్ విడుదల తేదీ : తరువాత వెల్లడిస్తారు.
  • ఓఎంఆర్ ఆధారిత పరీక్ష నిర్వహణ : ఏప్రిల్ 2025

👉  Click here for Download notification

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!