ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టులో ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అర్హత గల అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు 35,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నారు.
- ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానము, జీతము , అప్లై విధానము ఇలాంటి ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే ఈ ఉద్యోగానికి త్వరగా అప్లై చేయండి.
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ 17-01-2025
🏹 ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు దిగువన ఇవ్వబడినవి…
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు :
- ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.
🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
- ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో లా క్లర్క్స్ పోస్టులు భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.
🔥 మొత్తం పోస్టుల సంఖ్య :
- ఈ నోటిఫికేషన్ ద్వారా 05 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 అర్హతలు :
- ఈ పోస్టులకు అప్లై చేయడానికి “ లా “ లో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.
🔥 ఫీజు :
- ఈ పోస్టులకు అప్లై చేసే వారు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
🔥 పోస్టింగ్ ఎక్కడ ఇస్తారు :
- ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో పోస్టింగ్ ఇస్తారు.
🔥 గరిష్ట వయస్సు :
- 30 సంవత్సరాల వయస్సు నిండకుడదు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేసేవారు అప్లికేషన్ పంపించడానికి చివరి తేదీ 17-01-2025
🔥 జీతం ఎంత ఉంటుంది :
- ఎంపికైన వారికి నెలకు 35,000/- జీతము ఇస్తారు.
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది :
- వైవా వాయిస్ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 అప్లికేషన్ విధానం :
- ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు వారికి చెందిన విద్యార్హత సర్టిఫికెట్స్ మరియు వయసు ధ్రువీకరణ పత్రము వంటి సర్టిఫికెట్ల జీరాక్స్ కాపీలపై అటెస్టేషన్ చేయించి అప్లికేషన్ కు జతపరిచి జనవరి 17వ తేదీ సాయంత్రం ఐదు గంటలు లోపు చేరే విధంగా అప్లికేషన్ రిజిస్టర్ పోస్టు ద్వారా పంపాలి.
- అప్లికేషన్ పంపే కవర్ మీద తప్పనిసరిగా “ Application For the Posts of Law Clerks ” అని రాయాలి.
🔥 అప్లికేషన్ పంపవలసిన చిరునామా :
- అప్లికేషన్ దిగువ తెలిపిన అడ్రెస్స్ కు పంపించాలి.
- Registrar (Recruitment) , High Court Of AP at Amaravati, Nelapadu , Guntur District , Andhra Pradesh, PIN – 522239 .
🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత మరియు ఆసక్తి ఉంటే ఆఫ్లైన్ లో అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది. కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.
✅ Download Notification & Application
🔥 Official Website – Click here
🔥 గమనిక : అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి.