Headlines

2686 పోస్టులకు AP Jobs Calendar – 2025 విడుదల – భర్తీ చేసే ఉద్యోగాలు ఇవే | AP Jobs Calendar 2025 Vacancies List | APPSC Jobs Calendar 2025

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఈ జాబ్ క్యాలెండర్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జనవరి 12వ తేదీన విడుదల చేసేందుకు కసరత్తు జరుగుతుంది. 

ఏపీపీఎస్సీ విడుదల చేయబోయే ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా కొత్తగా వివిధ రకాల నోటిఫికేషన్స్ విడుదల చేసి మొత్తం 1016 ఉద్యోగాలు భర్తీ చేస్తారు. తాజాగా దీనికి సంబంధించిన ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కూడా విడుదల కావడం జరిగింది. ఈ డ్రాఫ్ట్ జాబ్ క్యాలెండర్ లో మొత్తం 2686 పోస్టులు భర్తీకి సంబంధించిన వివరాలు తెలిపారు.

అంతేకాకుండా గతంలో ఏపీపీఎస్సీ విడుదల చేసిన 20 రకాల నోటిఫికేషన్స్ యొక్క పరీక్ష తేదీలు కూడా ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రకటిస్తారు. అంటే ఏపీపీఎస్సీ ఈ సంవత్సరం విడుదల చేయబోయే జాబ్ క్యాలెండర్ ద్వారా మొత్తం 2686 పోస్టుల భర్తీకి సంబంధించిన షెడ్యూల్ తెలియజేస్తుంది. 

ఇందులో ఇందులో ఏపీపీఎస్సీ విడుదల చేయబోయే కొత్త నోటిఫికేషన్స్ ద్వారా 1016 పోస్టులు భర్తీ చేస్తుండగా , ఇప్పటికే ఏపీపీఎస్సీ విడుదల చేసిన 1670 ఉద్యోగాల నోటిఫికేషన్స్ కు పరీక్ష తేదీలు ప్రకటిస్తుంది.

🏹 అటవీ శాఖలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు – Click here 

🏹 RBI లో ఉద్యోగాలు – Click here

మరి ఏపీపీఎస్సీ విడుదల చేయబోయే కొత్త నోటిఫికేషన్ ఏమిటి ? వాటి ద్వారా ఏ శాఖలో ఎన్నెన్ని ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నారు ? ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తారు ? ఇలాంటి వివరాలతో పాటు ఇప్పటికే విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు వాటికి సంబంధించిన పరీక్ష తేదీలు వివరాలకు సంబంధించిన ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ లో కొత్త నోటిఫికేషన్లు పాత నోటిఫికేషలకు సంబంధించిన వివరాలన్నీ ఉన్నాయి. 

ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి ఆ వివరాలు అన్నీ తెలుసుకోండి. అంతే కాదండోయ్ ఈ ఆర్టికల్ చివరిలో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇచ్చాం , దానిపై క్లిక్ చేసి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనవరి 12వ తేదీన ప్రకటించే జాబ్ క్యాలెండర్ ద్వారా వివిధ రకాల నోటిఫికేషన్స్  ద్వారా 1016 పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది. ఖాళీలు వివరాలు శాఖల వారీగా క్రింది విధంగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ అన్నీ కూడా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పూర్తయిన తర్వాత దానికి అనుగుణంగా జూలై నుండి డిసెంబర్ మధ్యలో విడుదల చేస్తారు.

  • అటవీ శాఖలో 100 సెక్షన్ ఆఫీసర్ పోస్టులు , 691 బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టులు, 13 డ్రాఫ్ట్ మెన్ గ్రేడ్ 2 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు, 10 తానేదార్ పోస్టులు భర్తీ చేస్తారు. 
  • వ్యవసాయ శాఖలో 10 అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేస్తారు. 
  • దేవదాయ శాఖలో 7 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ చేస్తారు. 
  • మున్సిపల్ శాఖలో జూనియర్ అకౌంట్స్ కేటగిరి-2 పోస్టులు , సీనియర్ అకౌంటెంట్ క్యాటగిరి పోస్టులు-3 మరియు జూనియర్ అకౌంటెంట్ క్యాటగిరి-4 పోస్టులు కలిపి మొత్తం 11 పోస్టులు భర్తీ చేస్తారు.
  • ఇంటర్మీడియట్ విద్యలో 2 గ్రంథ పాలకుల పోస్టులు భర్తీ చేస్తారు 
  • ఉద్యానవన శాఖలో రెండు హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేస్తారు. 
  • మత్స్య శాఖలో 3 అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ పోస్టులు భర్తీ చేస్తారు. 
  • భూగర్భ నీటిపారుదల శాఖలో 4 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేస్తారు. 
  • 7 జిల్లా సైనిక్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేస్తారు.
  • వీటితోపాటు రవాణా శాఖలో AMVI పోస్టులు, జైల్లో శాఖలో జూనియర్ అసిస్టెంట్ కం టైపిస్ట్, గనుల శాఖలో రాయల్టీ ఇన్స్పెక్టర్, బీసీ సంక్షేమ శాఖలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, దివ్యాంగుల సంక్షేమ శాఖలో వార్డెన్ , ఫ్యాక్టరీ సర్వీసెస్ లో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వంటి పోస్టులు కూడా భర్తీ చేయడం జరుగుతుంది. 
  • 150 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసి 2025 ఏప్రిల్ లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.
  • ఈ ఉద్యోగాలతో పాటు ఆంధ్రప్రదేశ్ లో 16,347 టీచర్ పోస్టులను DSC నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు.
  • ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటికే విడుదల చేసిన 20 నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్ష తేదీలను కూడా జాబ్ క్యాలెండర్ సందర్భంగా ప్రకటించడం జరుగుతుంది. మార్చి చివరి వారం నుండి జూన్ చివరివారం మధ్యలో వీటికి సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తుంది. 
  • ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ సర్వీస్లో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ , ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ & ఎనలిస్ట్ గ్రేడ్ మరియు ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లో అసిస్టెంట్ లైబ్రేరియన్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు 24-03-2025 నుండి 27-03-2025 మధ్య నిర్వహిస్తారు. 
  • అటవీ శాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షను ఏప్రిల్ 15వ తేదీన నిర్వహిస్తారు. 
  • ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షను ఏప్రిల్ 16వ తేదీన నిర్వహిస్తారు. 
  • ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్ లో అసిస్టెంట్ డైరెక్టర్, ఏపీ మెడికల్ అండ్ హెల్త్ సబర్డినేట్ సర్వీస్ లో లైబ్రెరియన్స్ , ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ సర్వీస్ లో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబిల్డ్ ట్రాన్స్ జెండర్ అండ్ సీనియర్ సిటిజన్స్ సర్వీస్ లో అసిస్టెంట్ డైరెక్టర్, ఏపీ గ్రౌండ్ వాటర్ సర్వీస్ లో అసిస్టెంట్ కెమిస్ట్, ఏపీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ సర్వీస్లో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్, ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబార్డినేట్ సర్వీస్ లో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, ఏపీ ఫిసిరిస్ సర్వీస్ లో ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు 21-04-2025 నుండి 24-04-2025 తేదీల మధ్య నిర్వహిస్తారు. 
  • గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షను మే 2025 లో నిర్వహిస్తారు. 
  • గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను ఫిబ్రవరి 23వ తేదీన నిర్వహిస్తారు. ఇప్పటికే ఏపీపీఎస్సీ దీనిపై ఒక ప్రకటన కూడా చేసింది. 
  • వీటితో పాటు ప్రభుత్వ జూనియర్, డిగ్రీ , TTD మరియు పాలిటెక్నిక్ కళాశాలలో లెక్చరర్ పోస్టులకు సంబంధించిన పరీక్షలు జూన్ 2025 లో నిర్వహించవచ్చు.

🏹  Download Draft Calendar Pdf – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!