27,675/- జీతం వచ్చే ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు | AP Contract Basis Jobs Latest Notification | AP Latest jobs Notifications

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ మరొక జిల్లా స్థాయి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 

ఈ నోటిఫికేషన్ ద్వారా వైద్య ఆరోగ్యశాఖలో జాతీయ ఆరోగ్య మిషన్ ప్రోగ్రాంలో NCD పథకం కు చెందిన పల్లేటివ్ కేర్ యూనిట్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు అన్ని ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే త్వరగా అప్లికేషన్ పెట్టుకోండి.

🏹 ఆంధ్రప్రదేశ్ లో భారీగా స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు – Click here 

🏹 విజయనగరం మెడికల్ కాలేజీలో జాబ్స్ – Click here 

🏹 పాడేరు మెడికల్ కాలేజ్ లో ఉద్యోగాలు – Click here 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : 

  • ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో ఉన్న DMHO కార్యాలయం నుండి విడుదల చేయడం జరిగింది.

🔥 పోస్టుల పేర్లు: 

  • ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిజీషియన్ మరియు స్టాఫ్ నర్స్ అనే పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. 

🔥 విద్యార్హత : 

  • ఫిజీషియన్ ఉద్యోగాలకు MD జనరల్ మెడిసిన్ చేసిన వారు అర్హులు. 
  • స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు GNM పూర్తి చేసిన వారు అర్హులు. (పల్ల్లెటివ్ కేర్ లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత)

🔥 ఖాళీలు : 

  • ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 04 పోస్టులు భర్తీ చేస్తున్నారు.  
  • భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో ఒక ఫిజీషియన్ పోస్టు, మూడు స్టాఫ్ నర్స్ పోస్టులు ఉన్నాయి.

🔥 జీతము: 

  • ఫిజీషియన్ ఉద్యోగానికి ఎంపిక అయితే జీతం 1,10,000/- ఇస్తారు. 
  • స్టాఫ్ నర్స్ ఉద్యోగానికి ఎంపిక అయితే జీతం 27,675/- ఇస్తారు.

🔥 ముఖ్యమైన తేదీలు : 

  • నోటిఫికేషన్ విడుదల తేదీ : 28-12-2024
  • అప్లికేషన్ ప్రారంభ తేదీ : 28-12-2024
  • అప్లికేషన్ చివరి తేదీ : 04-01-2025

🔥 వయస్సు : 

  • 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
  • ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్రింది విధంగా వయసులో సడలింపు కూడా వర్తిస్తుంది. 
  • అనగా ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసులో సడలింపు వర్తిస్తుంది.
  • విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు పది సంవత్సరాల వరకు వయసులో సడలింపు వర్తిస్తుంది.

🔥 అప్లికేషన్ ఫీజు వివరాలు :

  • ఓసి, ఈడబ్ల్యూఎస్ మరియు బీసీ అభ్యర్థులు 500/- ఫీజు చెల్లించాలి. 
  • ఎస్సీ, ఎస్టి, మరియు దివ్యాంగులైన అభ్యర్థులు 300/- ఫీజు చెల్లించాలి. 
  • District Medical & Health Officer, Prakasam District, Ongole అనే పేరు మీద ఈ ఫీజు డిడి రూపంలో చెల్లించి అప్లికేషన్ కు జత పరచాలి.

🔥 ఎంపిక విధానం : 

  • ఈ ఉద్యోగాల ఎంపికలో రాత పరీక్ష నిర్వహించరు.
  • మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • అభ్యర్థులకు అర్హత పరీక్షలో వచ్చిన మార్కులు ఆధారంగా 75% మార్కులు వరకు కేటాయిస్తారు.
  • అభ్యర్థులకు ఉన్న అనుభవానికి 15% మార్కుల వరకు కేటాయిస్తారు
  • మరియు ఉద్యోగానికి అప్లై చేయడానికి అవసరమైన అర్హత కోర్సు పూర్తి చేసినప్పటి నుండి ఇప్పటివరకు పూర్తయిన సంవత్సరాలకు ప్రతి సంవత్సరానికి ఒక మార్క్ కేటాయిస్తూ గరిష్టంగా 10% మార్కులు కేటాయిస్తారు. 

🔥 అనుభవానికి మార్కుల కేటాయింపు ఇలా చేస్తారు : 

  • గిరిజన ప్రాంతాల్లో పని చేస్తే ప్రతీ ఆరు నెలలకు 2.5 మార్కులు కేటాయిస్తారు.
  • గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తే ప్రతీ ఆరు నెలలకు 2 మార్కులు కేటాయిస్తారు.
  • పట్టణ ప్రాంతాల్లో పని చేస్తే ప్రతీ ఆరు నెలలకు ఒక మార్కు కేటాయిస్తారు.

🔥 పోస్టింగ్ : 

  • ఎంపికైన వారు ప్రకాశం జిల్లాలో పనిచేయాల్సి ఉంటుంది. 

🔥 అప్లికేషన్ విధానము : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేసేవారు ముందుగా నోటిఫికేషన్ తో పాటు ఇచ్చిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసి దానిలో ఉన్న అన్ని వివరాలు సరిగ్గా నమోదు చేసి, అవసరమైన అన్ని సెల్ఫ్ అటిస్టెడ్ జిరాక్స్ కాపీలు మరియు ఫీజు చెల్లించిన డిడి జతపరిచి అప్లికేషన్ సంబంధిత కార్యాలయంలో అందజేయాలి 

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా  : 

  • O/o the District Medical & Health Officer, Ongole, Prakasam District

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అన్ని నోటిఫికేషన్స్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి వివరాలు చదివి అర్హత ,ఆసక్తి ఉన్నవారు అప్లికేషన్ నింపి త్వరగా అప్లై చేయండి. 

Download Notification & Application
✅  Official Website – Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!