ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ విధానంలో ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఉన్నారు. ఈ నోటిఫికేషన్స్ ఆయా జిల్లాల్లో ఉండే DMHO కార్యాలయాలు మరియు గవర్నమెంట్ మెడికల్ కాలేజీల నుండి విడుదలవుతున్నాయి.
తాజాగా రాష్ట్రస్థాయి నోటిఫికేషన్ ఒకటి విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది.
తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్ లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ 266 ఖాళీలతో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలను జోన్లవారీగా భర్తీ చేయడం జరుగుతుంది. అర్హులైన వారు తమ జోన్ కు చెందిన RDM&HS కార్యాలయంలో అప్లికేషన్ జనవరి 15వ తేదీలోపు అందజేయాలి. ఏ జోన్ అభ్యర్థులు ఆ జోన్ లో ఉండే ఉద్యోగాలకు లోకల్ అభ్యర్థులు అవుతారు.
🏹 విజయనగరం మెడికల్ కాలేజీలో జాబ్స్ – Click here
🏹 పాడేరు మెడికల్ కాలేజ్ లో ఉద్యోగాలు – Click here
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్, అప్లికేషన్, అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి.
🔥 ఉద్యోగాలు భర్తీ చేసే సంస్థ :
- ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తుంది.
🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య :
- 415 స్టాఫ్ నర్స్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. (పెరిగిన ఖాళీలతో కలిపి 415 పోస్టులు భర్తీ చేస్తున్నారు)
🔥 అర్హత :
- GNM / BSc (Nursing) పూర్తి చేసిన వారు అర్హులు
🔥 నోటిఫికేషన్ విడుదల తేదీ:
- 01-01-2025 తేదిన నోటిఫికేషన్ విడుదల చేసారు.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ :
- 01-01-2025 తేది నుండి ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- 15-01-2025 తేదిలోపు అప్లై చేయాలి.
🔥 ప్రొవిజినల మెరిట్ విడుదల లిస్ట్ తేదీ :
- 24-01-2025 తేదిన విడుదల చేస్తారు.
🔥 ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ :
- 29-01-2025 తేదిన విడుదల చేస్తారు.
🔥 కౌన్సిలింగ్స్ తేదీ :
- జనవరి 30, 31 తేదీల్లో నిర్వహిస్తారు.
🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు
🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు
🔥 వయో సడలింపు : SC, ST, BC, EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , దివ్యాంగులైన అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
🔥 ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాల ఎంపికలో రాత పరీక్ష నిర్వహించరు.
- మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
- అభ్యర్థులకు అర్హత పరీక్షలో వచ్చిన మార్కులు ఆధారంగా 75% మార్కులు వరకు కేటాయిస్తారు.
- అభ్యర్థులకు ఉన్న అనుభవానికి 15% మార్కుల వరకు కేటాయిస్తారు
- మరియు ఉద్యోగానికి అప్లై చేయడానికి అవసరమైన అర్హత కోర్సు పూర్తి చేసినప్పటి నుండి ఇప్పటివరకు పూర్తయిన సంవత్సరాలకు ప్రతి సంవత్సరానికి ఒక మార్క్ కేటాయిస్తూ గరిష్టంగా 10% మార్కులు కేటాయిస్తారు.
🔥 అనుభవానికి మార్కుల కేటాయింపు ఇలా చేస్తారు :
- గిరిజన ప్రాంతాల్లో పని చేస్తే ప్రతీ ఆరు నెలలకు 2.5 మార్కులు కేటాయిస్తారు.
- గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తే ప్రతీ ఆరు నెలలకు 2 మార్కులు కేటాయిస్తారు.
- పట్టణ ప్రాంతాల్లో పని చేస్తే ప్రతీ ఆరు నెలలకు ఒక మార్కు కేటాయిస్తారు.
🔥 అప్లికేషన్ విధానం :
- క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది , కాబట్టి నోటిఫికేషన్ తో పాటు ఉన్న అప్లికేషన్ నింపి సెల్ఫ్ అటిస్టెడ్ జిరాక్స్ కాపీలను జతపరిచి అప్లై చేయాలి.
🔥 పోస్టింగ్ ప్రదేశం :
- ఈ ఉద్యోగాలను జోన్లవారీగా భర్తీ చేస్తున్నారు కాబట్టి ఎంపికైన వారికి తమ జోన్ లోనే పోస్టింగ్ ఇస్తారు.
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :
- అభ్యర్థులు తమ జోన్ కు చెందిన RDM&HS కార్యాలయంలో అందజేయాలి.
✅ Download Vacancies List – Click here
✅ Download Zone 1 Notification & Application
✅ Download Zone 3 Notification & Application
✅ Download Zone 2 Notification & Application
✅ Download Zone 4 Notification & Application
✅ Zone 1 Google Form Link – Click here
▶️ అభ్యర్థులకు ముఖ్య గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి . All the best 👍