రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సంస్థ నుండి ఒక మంచి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఇంజనీర్ ( సివిల్ / ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి దరఖాస్తు చేయు విధానం , ఎంపిక విధానం , విద్యార్హతలు, వయస్సు వంటి పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🏹 హైకోర్టులో ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు – Click here
🏹 AP మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు – Click here
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సంస్థ ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తుంది
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
- మొత్తం 13 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- జూనియర్ ఇంజనీర్ ( సివిల్) – 07
- జూనియర్ ఇంజనీర్ ( ఎలక్ట్రికల్ ) – 04
🔥 విద్యార్హత :
జూనియర్ ఇంజనీర్ ( సివిల్) :
- ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ లేదా యూనివర్సిటీ నుండి కనీసం 65 శాతం మార్కులతో (ఎస్సీ , ఎస్టీ, దివ్యాంగులు అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులు ) సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణత సాధించాలి.
(లేదా)
- సివిల్ ఇంజనీరింగ్ లో 55 శాతం మార్కులతో ( ఎస్సీ , ఎస్టీ,దివ్యాంగులు అభ్యర్థులు కనీసం 45 శాతం మార్కులు) డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.
జూనియర్ ఇంజనీర్ ( ఎలక్ట్రికల్ ) :
- ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ లేదా యూనివర్సిటీ నుండి కనీసం 65 శాతం మార్కులతో (ఎస్సీ , ఎస్టీ, దివ్యాంగులు అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులు ) ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణత సాధించాలి.
(లేదా)
- ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో 55 శాతం మార్కులతో ( ఎస్సీ , ఎస్టీ,దివ్యాంగులు అభ్యర్థులు కనీసం 45 శాతం మార్కులు) డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.
🔥 అనుభవం:
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే డిప్లొమా అభ్యర్థులు సంబంధిత విభాగంలో 2 సంవత్సరాల అనుభవం కలిగి వుండాలి.
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే డిగ్రీ ( బి.టెక్/ బి.ఈ) అభ్యర్థులు సంబంధిత విభాగంలో 1 సంవత్సరం అనుభవం కలిగి వుండాలి.
🔥 గరిష్ఠ వయస్సు :
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 20 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వుండాలి.
- ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు
- ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు
- దివ్యాంగులు కి 10 సంవత్సరాలు
వయొసడలింపు కలదు.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో అప్లై చేయాలి.
🔥 అప్లికేషన్ ఫీజు :
- ఎస్సీ , ఎస్టీ , PwBD, ex – సర్వీస్ మాన్ వారు 50 రూపాయల అప్లికేషన్ ఫీజు ను ఆన్లైన్ విధానం ద్వారా చెల్లించాలి.
- ఓబీసీ , EWS, జనరల్ అభ్యర్థులు 450/- రూపాయల అప్లికేషన్ ఫీజును ఆన్లైన్ ద్వారా చెల్లించాలి.
🔥 జీతం :
- ఈ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన అభ్యర్థులకు 33,900/- రూపాయల బేసిక్ పే తో అన్ని అలవెన్సులు కలిపి నెలకు 80,236/- రూపాయల జీతం లభిస్తుంది.
🔥 ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులను ఆన్లైన్ పరీక్ష మరియు లాంగ్వేజ్ ప్రొఫెసియన్సి పరిక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
- ఆన్లైన్ పరీక్ష తేది :08/02/2025 న 300 మార్కులకు గాను నిర్వహిస్తారు.
- ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ , ఇంజనీరింగ్ డిసిప్లిన్ – 1 , ఇంజనీరింగ్ డిసిప్లిన్ -2 , జనరల్ ఇంటెలిజన్స్ అండ్ రీజనింగ్ సబ్జెక్టులు వుంటాయి.
- ¼ వంతు నెగెటివ్ మార్కింగ్ విధానం కలదు.
🔥 ముఖ్యమైన తేదిలు:
- ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది: 30/12/2024
- ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేది: 20/01/2025
- ఆన్లైన్ పరీక్ష నిర్వహణ కొరకు తాత్కాలిక తేది: 08/02/2025
👉 Click here to download notification