Headlines

ఇంటర్ అర్హతతో రేషన్ డీలర్ల పోస్టులు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం | AP Ration Dealers Recruitment | Latest Jobs in Telugu

ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్లలో రేషన్ డీలర్ల పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత గల వారు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. స్థానికంగా నివసించే ప్రజాప్రతినిధులు ఈ పోస్టులకు అర్హులు కాదు.

తాజాగా 59 పోస్టులతో రేషన్ డీలర్ల పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ప్రకటన విడుదలైంది. ఈ ప్రకటనకు సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని అర్హత ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి. అర్హత ఉన్నవారికి తెలిసే విధంగా ఈ సమాచారాన్ని తప్పనిసరిగా షేర్ చేయండి.

AP మెడికల్ కళాశాలలో 10th ఉద్యోగాలు – Click here 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :

  • తాజాగా శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి రెవిన్యూ డివిజన్లో ఉన్న 59 రేషన్ డీలర్ల పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
  • టెక్కలి రెవెన్యూ డివిజన్ లో ఉన్న టెక్కలి , హిరమండలం , కోటబొమ్మాళి , LN పేట మండలం , మెలియపుట్టి మండలం , పాత పట్నం, సంత బొమ్మాళి మండలంలలో ఉన్న వివిధ గ్రామాల్లో ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు

  • రేషన్ డీలర్లు పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.

🔥 ఖాళీల సంఖ్య

  • మొత్తం 59 రేషన్ డీలర్స్ పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది.
  • ఇందులో వివిధ కారణాల వలన ఖాళీగా ఏర్పడిన 46 రేషన్ డీలర్ల పోస్టులతో పాటు, విభజన వల్ల ఏర్పడిన 13 రేషన్ డీలర్ల పోస్టులను కలిపి భర్తీ చేస్తున్నారు.

🔥 విద్యార్హత :

  • ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత పొందిన వారు అర్హులు.
  • అభ్యర్థులపై సివిల్ లేదా క్రిమినల్ కేసులు నమోదై ఉండకూడదు. 
  • స్థానికంగా నివసించే ప్రజాప్రతినిధులు ఈ పోస్టులకు అర్హులు కాదు.

🔥  వయస్సు :

  • 18 నుండి 40 సంవత్సరాల లోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

🔥దరఖాస్తు విధానం :

  • అర్హత ఉన్నవారు స్థానిక మండలాల తహసిల్దార్ కార్యాలయం లేదా సబ్ కలెక్టర్ కార్యాలయంలో సంప్రదించి ఉచితంగా అప్లికేషన్ పొందవచ్చు.
  • అప్లికేషన్ నింపి, అవసరమైన డాక్యుమెంట్స్ పైన గెజిటెడ్ అధికారుల చేత అటేస్టేషన్ చేయించి వాటిని కూడా అప్లికేషన్కు జతపరిచి ఎంపిక ప్రక్రియ కోసం 600/- ఫీజు చెల్లించాలి.

🔥 అవసరమగు ధృవ పత్రాలు :

  • 10 వ తరగతి , ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లు
  • నివాస ధ్రువీకరణ పత్రం (ఓటర్ కార్డు / ఆధార్ కార్డు / పాన్ కార్డు వంటివి )
  • కుల దృవీకరణ పత్రం
  • మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు
  • నిరుద్యోగిగా వుంటునట్లు స్వీయ  దృవీకరణ పత్రం ( సెల్ఫ్ డిక్లరేషన్ )
  • దివ్యాంగులు అయితే సంబంధిత ధృవ పత్రాలు. (సదరం సర్టిఫికెట్)

🔥 ఎంపిక విధానం :

  • వ్రాత పరీక్షకు 80 మార్కులు, ఇంటర్వ్యూకు 20 మార్కులు కేటాయిస్తారు. 

🔥 రాత పరీక్ష నిర్వహించే ప్రదేశం : 

  • డిసెంబర్ 27వ తేదిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేదా ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజ్ లో ఉదయం 11 గంటలకు పరీక్ష నిర్వహిస్తారు.

 🔥 ముఖ్యమైన తేదిలు

  • అప్లికేషన్ ప్రారంభ తేదీ : 26-12-2024
  • దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : 09/01/2025
  • హాల్ టికెట్స్ విడుదల తేది : 17-01-2025 
  • వ్రాత పరీక్ష నిర్వహణ తేది : 19/01/2025
  • వ్రాత పరీక్ష ఫలితాలు విడుదల తేది : 23-01-2025
  • ఇంటర్వ్యూలు నిర్వహణ తేది : 27-01-2025
  • తుది ఫలితాలు విడుదల తేది : 30-01-2025

👉 Download Notification Details 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!