ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పరిధిలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీ / గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ , విజయనగరం సంస్థ నుండి కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ప్రాధిపతికన వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
10 వ తరగతి , ఇంటర్మీడియట్ , డిప్లొమా , డిగ్రీ , బిటెక్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు ఎటువంటి వ్రాత పరిక్ష , ఇంటర్వ్యూ లేకుండా కేవలం మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలను నేషనల్ హెల్త్ మిషన్ లో భాగంగా రాష్ట్రీయ బాల్ స్వాస్త్య కార్యక్రమం లో భాగంగా భర్తీ చేస్తున్నారు.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి , అవసరమగు విద్యార్హతలు , దరఖాస్తు చేయు విధానం , ఎంపిక విధానం మొదలగు అన్ని అంశాలు ను పూర్తిగా తెలుసుకొనేందుకు గాను ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి.
🏹 కృషి విజ్ఞాన కేంద్రంలో 10th , ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు – Click here
🏹 10th , ఇంటర్ అర్హతతో గ్రూప్ “C” ఉద్యోగాలు – Click here
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- డిస్ట్రిక్ట్ మెడికల్ & హెల్త్ ఆఫీస్ (DMHO) , విజయనగరం సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 91
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- సైక్యాట్రిక్ సోషల్ వర్కర్
- చైల్డ్ సైకాలజిస్టు
- క్లినికల్ సైకాలజిస్టు
- స్పీచ్ థెరపిస్ట్
- జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్
- ల్యాబ్ టెక్నీషియన్
- ల్యాబ్ అటెండెంట్
- ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్
- ఓటి టెక్నీషియన్
- డెంటల్ టెక్నీషియన్
- ఎలక్ట్రీషియన్ గ్రేడ్ -3
- లైబ్రరీ అసిస్టెంట్
- స్టోర్ అటెండర్
- ఆఫీస్ సబార్డినెట్
- జనరల్ డ్యూటీ అటెండెంట్
- ఎలక్ట్రికల్ హెల్పర్
- కంప్యూటర్ ప్రోగ్రామర్
- సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్
- నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్
- ఫిజికల్ ఎడ్యుకేషనల్ ట్రైనర్ ( PET)
🔥 విద్యార్హత :
- పోస్టులను అనుసరించి విద్యార్హతలు ఈ క్రింది విధంగా ఉండాలి.
🔥 వయస్సు :
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయు అభ్యర్థులు 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు వుండాలి.
- ఎస్సీ , ఎస్టీ, బీసీ ,EWS అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు 5 సంవత్సరాలు వయోసడలింపు కలదు.
- ఎక్స్ – సర్వీస్ మాన్ వారికి 3 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
- దివ్యాంగులు కి 10 సంవత్సరాలు వయొసడలింపు కలదు.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం ద్వారా లో దరఖాస్తుచేసుకోవాలి.
- దరఖాస్తులను నేరుగా లేదా పోస్ట్ ద్వారా పంపించవచ్చు.
- 08/01/2025 సాయంత్రం 5:00 గంటల లోగా దరఖాస్తు కార్యాలయం నకు చేరాలి.
🔥 అప్లికేషన్ ఫీజు :
- అభ్యర్థులు దరఖాస్తు ఫీజును డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ , విజయనగరం వారి పేరు మీదుగా చెల్లించాలి.
- ఓసి ( EWS) , ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు – 300/- రూపాయలు.
- ఓసి అభ్యర్థులు 400/- రూపాయలు దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
- దివ్యాంగులు కి దరఖాస్తు ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు.
🔥 అవసరమగు ధృవపత్రాలు :
- ఫిల్ చేసిన దరఖాస్తు ఫారం
- 10 వ తరగతి సర్టిఫికెట్లు
- అన్ని విద్యార్హతలు సర్టిఫికెట్లు
- కౌన్సిల్ / బోర్డు ద్వారా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
- ఇటీవల కుల దృవీకరణ పత్రం
- 4 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు గల స్టడీ సర్టిఫికెట్లు
- సదరం సర్టిఫికెట్ ( అవసరమగు వారు)
- EWS సర్టిఫికెట్ ( అవసరమగు వారు)
- స్పోర్ట్స్ సర్టిఫికెట్ ( అవసరమగు వారు)
- సర్వీస్ సర్టిఫికెట్ ( అవసరమగు వారు)
- పైన పేర్కొన్న ధృవపత్రాలు యొక్క కాపీలు పై గెజిటెడ్ అధికారి వారి సంతకం వుండాలి.
🔥 ఎంపిక విధానం :
- అభ్యర్థులకు ఎటువంటి వ్రాత పరిక్ష , ఇంటర్వ్యూ లేకుండా కేవలం మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
- మొత్తం 100 మార్కులకు గాను ఎంపిక నిర్వహణ వుంటుంది.
- అకడమిక్ విద్యార్హత లో మార్కులకు 75 శాతం వెయిట్ఏజ్ , 15 శాతం గత అనుభవం ( అవుట్సోర్సింగ్ / కాంట్రాక్టు / కోవిడ్ సర్వీస్) కి , 10 శాతం విద్య లో సీనియారిటీ కి కేటాయించారు.
- ఈ ఉద్యోగాల ఎంపిక కొరకు తయారుచేసిన మెరిట్ లిస్టు 31/12/2025 వరకు వాలిడ్ గా వుంటుంది. డిపార్ట్మెంట్ వారు ఆ తేది వరకు భర్తీ చేయు ఉద్యోగాల నియామకం కొరకు కూడా ఉపయోగపడుతుంది.
🔥 జీతం:
- అభ్యర్థులు ఎంపిక కాబడిన పోస్ట్ ఆధారంగా 30,000 రూపాయలకు పైగా జీతం లభిస్తుంది. వివిధ అలవన్స్ లు కూడా లభిస్తాయి.
🔥 ముఖ్యమైన తేదీలు:
- నోటిఫికేషన్ విడుదల తేది : 28/12/2024
- ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది : 28/12/2024 ఉదయం 10:30 గంటల నుండి.
- ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : 08/01/2025 సాయంత్రం 5:00 గంటల లోగా.
- దరఖాస్తుల స్క్రుటినిటీ : 09/01/2025 నుండి 31/01/2025 వరకు.
- తాత్కాలిక మెరిట్ జాబితా విడుదల చేయు తేది: 03/02/2025.
- తాత్కాలిక మెరిట్ జాబితా పై అర్జీల స్వీకరణ : 04/02/2025 నుండి 11/02/2025.
- ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేయు తేది: 15/02/2025.
- ఉద్యోగ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చు తేది : 28/02/2025
👉 Click here to download notification and application