మన తెలంగాణ రాష్ట్రంలో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ మరియు బస్తీ దవాఖాన మెడికల్ ఆఫీసర్ అనే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అధికారికంగా విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 19 MLHP ఉద్యోగాలతో పాటు 3 BDMK మెడికల్ ఆఫీసర్ అనే పోస్టులను కూడా భర్తీ చేస్తున్నారు.
అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకి ఆన్లైన్ విధానంలో లేదా ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయొచ్చు. రెండు పద్ధతుల్లో ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు జనవరి 3వ తేదీ లోపు అప్లై చేయవచ్చు. ఆన్లైన్లో అప్లై చేయాలి అనుకునేవారు ఖమ్మం జిల్లా వెబ్సైట్ లో ఇచ్చిన లింకు ద్వారా అప్లై చేయాలి.
✅ అన్ని జిల్లాల నోటిఫికేషన్స్ – click here
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన జిల్లా :
- ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నుండి విడుదల చేయబడింది.
🔥 పోస్టుల పేర్లు :
- ఈ నోటిఫికేషన్ ద్వారా మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ మరియు బస్తీ దవాఖాన మెడికల్ ఆఫీసర్ అనే ఉద్యోగాల భర్తీ కోసం అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 మొత్తం ఖాళీలు :
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 22 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇందులో పోస్ట్లు వారిగా ఖాళీలు వివరాలు క్రింద విధంగా ఉన్నాయి.
- బస్తీ దవాఖాన మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు – 03
- MLHP ఉద్యోగాలు – 19
🔥 అర్హతలు :
- GNM / బీఎస్సీ (నర్సింగ్) , MBBS, BAMS వంటి విద్యార్హతలు ఉన్నవారు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
🔥 జీతము :
- బస్తీ దవాఖాన మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 52,000/- జీతం ఇస్తారు.
- MLHP ఉద్యోగాలకి ఎంపికైన MBBS , BAMS అర్హతలు ఉన్నవారికి నెలకు 40,000/- జీతం ఇస్తారు.
- GNM, బీఎస్సీ (నర్సింగ్) అర్హతలు ఉన్నవారికి నెలకు 29,900/- జీతము ఇస్తారు.
🔥 వయస్సు :
- 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
🔥 వయసులో సడలింపు :
- ఎస్సీ , ఎస్టీ మరియు బీసీ మరియు EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది.
- PWD అభ్యర్థులకు వయస్సులో 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
🔥 ఎంపిక విధానం :
- రూల్ ఆఫ్ రిజర్వేషన్ మరియు మెరిట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాల ఎంపికలో రాత పరీక్ష ఉండదు.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ :
- ఈ ఉద్యోగాలకు 30-12-2024 నుండి అప్లై చేసుకోవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేది :
- ఈ ఉద్యోగాలకు 03-01-2025 తేది లోపు అప్లై చేయాలి.
🔥 ముఖ్యమైన తేదీలు :
- నోటిఫికేషన్ విడుదల తేదీ : 28-12-2024
- అప్లికేషన్ ప్రారంభ తేదీ : 30-12-2024
- అప్లికేషన్ చివరి తేదీ : 03-01-2025
- ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ : 16-01-2025
- సెలక్షన్ లిస్ట్ విడుదల తేదీ : 20-01-2025
- కౌన్సిలింగ్ తేదీ : 25-01-2025
🔥 అప్లై విధానం :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వరకు తమ దరఖాస్తుకు సర్టిఫికెట్స్ యొక్క సెల్ఫ్ అటేస్టేషన్ చేసిన జిరాక్స్ కాపీలు జతపరిచి అప్లై చేయాలి..
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం, ఖమ్మం జిల్లా
🔥 Download Notification & Application