మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ పరిధి లోగల సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ ఎంటర్ ప్రైస్ , నవరత్న కంపెనీ రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ (RITES) లిమిటెడ్ సంస్థ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ ఉద్యోగాలకు ఎటువంటి వ్రాత పరీక్ష లేకుండా , వాక్ ఇన్ ఇంటర్వ్యూ కి హాజరు అయి ఈ ఉద్యోగాలను పొందవచ్చు. ఒక సంవత్సరం కాంట్రాక్టు ప్రాధిపతికన ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.అవసరాన్ని బట్టి ఈ ఉద్యోగాల కాలపరిమితి పొడిగింపు వుంటుంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ హైవే ఇంజనీర్, సర్వే ఇంజనీర్, అసిస్టెంట్ బ్రిడ్జి ఇంజనీర్ , క్వాంటిటీ సర్వేయర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్ , క్యాడ్ ఎక్సపోర్ట్ ఉద్యోగాల భర్తీ కొరకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి విద్యార్హతలు , దరఖాస్తు విధానం , ఎంపికా విధానం మొదలగు అన్ని అంశాలు కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
🏹 10th, ఇంటర్ అర్హతలతో గ్రూప్ C ఉద్యోగాలు – Click here
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ (RITES) లిమిటెడ్ సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 25
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- అసిస్టెంట్ హైవే ఇంజనీర్
- సర్వే ఇంజనీర్
- అసిస్టెంట్ బ్రిడ్జి ఇంజనీర్
- క్వాంటిటీ సర్వేయర్
- ఎలక్ట్రికల్ ఇంజనీర్
- క్యాడ్ ఎక్సపోర్ట్
🔥 విద్యార్హత :
- ఉద్యోగాలకు సంబంధించి విద్యార్హతలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
🔥 వయస్సు :
- 40 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- వయస్సు నిర్ధారణ కొరకు 17/01/2025 ను కట్ ఆఫ్ తేదిగా నిర్ధారించారు.
- ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు కి ప్రభుత్వ నిబంధనల మేరకు వయొసడలింపు కలదు.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.
🔥 ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను స్క్రీనింగ్ చేసి , అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.
- షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి , ఎంపిక చేస్తారు.
- జనరల్ / EWS అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులు & ఎస్సీ , ఎస్టీ , ఓబీసీ ( NCL) , దివ్యాంగులు అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులు సాధించాలి.
🔥 అప్లికేషన్ ఫీజు :
- అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లిచవలసిన అవసరం లేదు
🔥 ఇంటర్వ్యూ నిర్వహణ తేదిలు:
- తేది 13/01/2025 నుండి తేది 17/01/2025 వరకు నిర్వహిస్తారు.
🔥 ఇంటర్వ్యూ నిర్వహణ స్థలం:
- 1. RITES Ltd., Shikhar, Plot 1, Leisure Valley, RITES Bhawan, Near IFFCO chowk Metro Station, Sector 29, Gurugram, 122001, Haryana
- 2. RITES Ltd., VAT-741/742,4th Floor,T-7,Sect-30A,International Infotech Park,Vashi Railway Station Complex,Navi Mumbai -400703
- లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపిక చేస్తారు.
🔥జీతం :
- అభ్యర్థులు ఎంపిక కాబడిన ఉద్యోగాన్ని అనుసరించి 32,000/- రూపాయల నుండి 48,000/- రూపాయల వరకు నెల జీతం లభిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదిలు:
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : 25/12/2024
- వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించే తేదీలు 13/01/2025 నుండి 17/01/2025.