భారతదేశంలోని ప్రముఖ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB)సంస్థ నుండి 2024-25 సంవత్సరానికి సంబంధించి వివిధ స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
9 డిపార్టుమెంటు లలో 61 రకాల ఉద్యోగాలను డిపార్ట్మెంట్ వారీగా భర్తీ చేస్తున్నారు. భర్తీ చేయబోయే ఉద్యోగాల సంఖ్య 1267.
🏹 ఇంటర్ అర్హతతో పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాలు భర్తీ – Click here
🏹 10th, ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు – Click here
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి దరఖాస్తు విధానం , ఎంపిక విధానం మొదలగు అన్ని అంశాలు కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా ( BOB ) సంస్థ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 1267
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు , ఖాళీల వివరాలు & విద్యార్హత:
భర్తీ చేయబోయే ఉద్యోగాలు | ఖాళీల వివరాలు | విద్యార్హత |
మేనేజర్ – సేల్స్ | 450 | ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత బ్యాంకింగ్ & ఫైనాన్స్ రంగంలో కనీసం 3 సంవత్సరాలు మార్కెటింగ్ & సేల్స్ విభాగంలో అనుభవం |
అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆఫీసర్ | 150 | ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత తో పాటు సేల్స్/ మార్కెటింగ్/ అగ్రీ బిజినెస్/ రూరల్ మేనేజ్మెంట్/ ఫైనాన్స్ విభాగంలో 2 సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా డిప్లొమా సంబంధిత విభాగంలో రెండు సంవత్సరాల అనుభవం |
మేనేజర్ – క్రెడిట్ అనాలసిస్ | 78 | ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతసంబంధిత విభాగంలో 3 సంవత్సరాల అనుభవం అవసరం |
అగ్రికల్చర్ మార్కెటింగ్ మేనేజర్ | 50 | ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత తో పాటు సేల్స్/ మార్కెటింగ్/ అగ్రీ బిజినెస్/ రూరల్ మేనేజ్మెంట్/ ఫైనాన్స్ విభాగంలో 2 సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా డిప్లొమా సంబంధిత విభాగంలో రెండు సంవత్సరాల అనుభవం |
సీనియర్ మేనేజర్ MSME – రిలేషన్షిప్ | 205 | గ్రాడ్యుయేషన్ లేదా ఎంబీఏ ఉత్తీర్ణతగ్రాడ్యుయేషన్ అర్హత కలవారు 8 సంవత్సరాలు , ఎంబీఏ అర్హత కల వారు 6 సంవత్సరాలు సంబంధిత విభాగంలో అనుభవం అవసరం |
సీనియర్ మేనేజర్ – క్రెడిట్ అనలిస్ట్ | 46 | సంబంధిత విభాగంలో 6 సంవత్సరాల అనుభవం అవసరం. |
- వీటితో పాటు ఇంకా చాలా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. కొన్ని పోస్టుల వివరాలు మాత్రమే ఇక్కడ సూచనాత్మకంగా ప్రస్తావించడం జరిగింది. మిగతా పోస్టుల వివరాలు కొరకు అధికారిక నోటిఫికేషన్ ను పరిశీలించగలరు.
🔥 వయస్సు :
- పోస్టులను అనుసరించి 22 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల లోపు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.( వయస్సు పరిమితి ఒక్కో పోస్ట్ కి ఒక్కో విధంగా ప్రస్తావించారు , కావున అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్ ను పరిశీలించగలరు).
- ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ – సర్వీస్ మాన్ వారికి అభ్యర్థులకు 5 సంవత్సరాలు
- ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు
- దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
🔥 అప్లికేషన్ ఫీజు :
- జనరల్ / EWS / ఓబీసీ అభ్యర్థులు 600/- రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ , దివ్యాంగులు , మహిళా అభ్యర్థులు 100/- రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
🔥 ఎంపిక విధానం :
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వ్రాత పరిక్ష , సైకోమెట్రిక్ పరీక్ష లేదా గ్రూప్ డిస్కషన్ / ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 పరీక్ష విధానం:
- 225 మార్కులకు గాను పరిక్ష నిర్వహిస్తారు.150 ప్రశ్నలకు 150 నిముషాల సమయం కేటాయించారు. ఇందులో రీజనింగ్ (25 ప్రశ్నలకు గాను 25 మార్కులు) , ఇంగ్లీష్ లాంగ్వేజ్ (25 ప్రశ్నలకు గాను 25 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (25 ప్రశ్నలకు గాను 25 మార్కులు), ప్రొఫెషనల్ నాలెడ్జ్ (75 ప్రశ్నలకు గాను 150 మార్కులు) కేటాయించారు.
🔥 జీతం:
- అభ్యర్థులు ఎంపిక కాబడిన పోస్ట్ ఆధారంగా నెలకు 50,000/- రూపాయల నుండి 1,00,000/- రూపాయలు దాటి కూడా జీతం లభిస్తుంది.
🔥 ప్రోబేషన్ పీరియడ్ :
- ఎంపిక కాబడిన అభ్యర్థులు ఒక సంవత్సర కాలం పాటు ప్రోబేషన్ లో వుంచబడతారు.
🔥 సర్వీస్ బాండ్ :
- ఎంపిక కాబడిన వారు కనీసం 3 సంవత్సరాలు పాటు సంస్థ పరిదిలో పనిచేసేందుకు గాను 1.5 లక్షల బాండ్ కి కట్టుబడి వుండాలి.
🔥 ముఖ్యమైన తేదిలు:
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది: 28/12/2024
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది: 17/01/2025
👉 Click here for official website