Headlines

ప్రభుత్వ సంస్థలో గ్రూప్ C ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | Latest Government Jobs | Latest jobs in Telugu

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ నుండి గ్రూప్ సి ఉద్యోగాల భర్తీ కొరకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఎలక్ట్రీషియన్ , టెలికాం మెకానిక్ , ఆర్మమెంట్ మెకానిక్, ఫార్మసిస్ట్, లోయర్ డివిజన్ క్లర్క్ , ఫైర్ మాన్, ఫైర్ ఇంజన్ డ్రైవర్, వెహికల్ మెకానిక్ , ఫిట్టర్, వేల్డర్, కుక్ వంటి వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి దరఖాస్తు విధానం , ఎంపికా విధానం మొదలగు అన్ని అంశాలు కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.

🏹 ఇంటర్ అర్హతతో పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాలు భర్తీ – Click here 

🏹 ప్రభుత్వ స్కూల్ లో ఖాళీలు భర్తీ – Click here 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

  • డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ సంస్థ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య

  • 625 ఉద్యోగాల భర్తీ చేయనున్నారు.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:

  • ఎలక్ట్రీషియన్ , టెలికాం మెకానిక్ , ఆర్మమెంట్ మెకానిక్, ఫార్మసిస్ట్, లోయర్ డివిజన్ క్లర్క్ , ఫైర్ మాన్, ఫైర్ ఇంజన్ డ్రైవర్, వెహికల్ మెకానిక్ , ఫిట్టర్, వేల్డర్, కుక్ మొదలగు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 విద్యార్హత : పోస్టులను అనుసరించి పదవ తరగతి ,ఇంటర్మీడియట్ , సంబంధిత విభాగంలో ఐటిఐ , డిప్లొమా వంటి విద్యార్హతలు  అవసరమగును.

🔥 వయస్సు :

  • 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు 
  • ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు కలదు.

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • నోటిఫికేషన్ లో ప్రస్తావించిన దరఖాస్తు ఫారం ను ఫిల్ చేసి, ఒక ఎన్వలప్ పై “APPLICATION FOR THE POST OF ________” అని రాసి , 5 రూపాయల పోస్టల్ స్టాంప్ అతికించి , కార్యాలయ చిరునామాకు చెరవేయలి.

🔥 ఎంపిక విధానం :

  • వ్రాత పరీక్ష నిర్వహణ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

🔥 జీతం:

  • పోస్టులను అనుసరించి 25,000/- రూపాయలకు పైగా జీతం లభిస్తుంది.

🔥 నోట్

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు , ముందుగా అధికారిక నోటిఫికేషన్ లో అర్హత వంటి వివరాలు చూసుకొని ,ఏదో ఒక పోస్ట్ కి , ఏదో ఒక ఎస్టాబ్లిష్మెంట్ కి మాత్రమే దరఖాస్తు చేసుకోగలరు. 

 🔥 ముఖ్యమైన తేదిలు:

  • అర్హత , ఆసక్తి గల అభ్యర్థులు ఎంప్లాయిమెంట్ నోటీసులో నోటిఫికేషన్ విడుదల అయిన 21 రోజుల్లోగా దరఖాస్తు కార్యాలయం నకు చేరాలి.

👉  Click here to download notification & application 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!