ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ తాజాగా మరొక నోటిఫికేషన్ విడుదల అయ్యింది. కొన్ని పోస్టులు కాంట్రాక్టు పద్ధతిలో, మరి కొన్ని పోస్టులు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు.
నోటిఫికేషన్ పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి..
🏹 ఇంటర్ అర్హతతో పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాలు భర్తీ – Click here
🏹 ప్రభుత్వ స్కూల్ లో ఖాళీలు భర్తీ – Click here
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు :
- ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా , DMHO నుండి విడుదల చేయడం జరిగింది.
🔥 పోస్టుల పేర్లు:
- ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 , FNO పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 ఖాళీలు :
- నోటిఫికేషన్ ద్వారా మొత్తం 19 పోస్టులు భర్తీ చేస్తున్నారు. పోస్టులు వారీగా ఖాళీలు వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
- ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టులు – 05
- FNO పోస్టులు – 14
🔥 జీతము:
- ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు 32,670/- చొప్పున జీతం ఇస్తారు.
- FNO ఉద్యోగాలకు 15,000/- చొప్పున జీతం ఇస్తారు.
🔥 పోస్టింగ్
- ఎంపికైన వారు వారు గుంటూరు జిల్లాలో పని చేయాల్సి ఉంటుంది.
🔥 అప్లికేషన్ తేదీలు :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు 23-12-2024 నుండి అప్లై చేయవచ్చు.
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ 07-01-2025
🔥 విద్యార్హత :
- పోస్టులను అనుసరించి క్రింది విధంగా అర్హతలు ఉండాలి.
🔥 అప్లికేషన్ ఫీజు :
- జనరల్ అభ్యర్థులు 500/- రూపాయలు ఫీజు చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, PWD అభ్యర్థులు అభ్యర్థులు 200/- ఫీజు చెల్లించాలి.
🔥 వయస్సు :
- 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్రింది విధంగా వయసులో సడలింపు కూడా వర్తిస్తుంది.
- అనగా ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసులో సడలింపు వర్తిస్తుంది.
- విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు పది సంవత్సరాల వరకు వయసులో సడలింపు వర్తిస్తుంది.
🔥 ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాల ఎంపికలో రాత పరీక్ష నిర్వహించరు.
- మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
- అభ్యర్థులకు అర్హత పరీక్షలో వచ్చిన మార్కులు ఆధారంగా 75% మార్కులు వరకు కేటాయిస్తారు.
- అభ్యర్థులకు ఉన్న అనుభవానికి 15% మార్కుల వరకు కేటాయిస్తారు
- మరియు ఉద్యోగానికి అప్లై చేయడానికి అవసరమైన అర్హత కోర్సు పూర్తి చేసినప్పటి నుండి ఇప్పటివరకు పూర్తయిన సంవత్సరాలకు ప్రతి సంవత్సరానికి ఒక మార్క్ కేటాయిస్తూ గరిష్టంగా 10% మార్కులు కేటాయిస్తారు.
🔥 అనుభవానికి మార్కుల కేటాయింపు ఇలా చేస్తారు :
- గిరిజన ప్రాంతాల్లో పని చేస్తే ప్రతీ ఆరు నెలలకు 2.5 మార్కులు కేటాయిస్తారు.
- గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తే ప్రతీ ఆరు నెలలకు 2 మార్కులు కేటాయిస్తారు.
- పట్టణ ప్రాంతాల్లో పని చేస్తే ప్రతీ ఆరు నెలలకు ఒక మార్కు కేటాయిస్తారు.
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :
- అభ్యర్థులు తమ అప్లికేషన్ తో పాటు అప్లికేషన్ ఫీజు చెల్లించిన డిడిని మరియు సంబంధిత సర్టిఫికెట్స్ యొక్క జిరాక్స్ కాపీలను జతపరిచి రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించవచ్చు లేదా స్వయంగా వెళ్లి అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు.
- అప్లికేషన్ అందించాల్సిన అడ్రస్ : DMHO, గుంటూరు జిల్లా .
🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి వివరాలు చదివి అర్హత ,ఆసక్తి ఉన్నవారు అప్లికేషన్ నింపి త్వరగా అప్లై చేయండి.
✅ Download Notification – Click here
✅ Official Website – Click here