తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది రోజులలో VRO , VRA ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు అన్న విషయం తెలిసిందే! అయితే అభ్యర్థులు కి ఈ అంశం పై ఈ రోజు ఒక మంచి అప్డేట్ రావడం జరిగింది.
ఈ ఉద్యోగ నియామకం కి సంబందించి సెలక్షన్ ప్రాసెస్ ప్రారంభిస్తూ ఒక నోటీసు విడుదల కావడం జరిగింది. చీఫ్ కమిషనర్ , లాండ్ అడ్మినిస్ట్రేషన్ వారి కార్యాలయం నుండి ఈ సర్క్యులర్ విడుదల చేయబడింది.
గతంలో వివిధ డిపార్ట్మెంట్ లలో సర్దుబాటు చేయబడిన VRO , VRA లను తిరిగి మళ్ళీ విఆర్ఓ లగా నియామకం చేసేందుకు గాను ఈ నోటీసు లో ప్రస్తావించారు.
ఇంటర్మీడియట్ & డిగ్రీ అర్హత తో నిరుద్యోగులు, ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం 10,956 ఉద్యోగాలలో కొన్ని పోస్టులను గతంలో వున్న విఆర్ఓలతో భర్తీ చేసి , మిగతా ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🏹 ఇంటర్ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు – Click here
🏹 AP లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు – Click here
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( TGPSC ) ద్వారా ఈ ఉద్యోగాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనుంది.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
- 10,956 ఉద్యోగాల నిమామకం జరగనుంది
- రిజర్వేషన్ల వారీగా పోస్ట్లు రిజర్వ్ చేయబడతాయి.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- రెవెన్యూ డిపార్ట్మెంట్ లో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ( VRO ) ఉద్యోగాల భర్తీ చేస్తారు.
🔥 విద్యార్హత :
- ఇంటర్మీడియట్ & డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు ఈ ఉద్యోగాలకు పొందేందుకు గాను దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥 వయస్సు :
- 18 సంవత్సరాలు నిండి యుండి 46 సంవత్సరాల లోపు వయసు గల వారు అర్హులు.
- ఎస్సీ , ఎస్టీ , బీసీ, దివ్యాంగులు , Ex – సర్విస్ మాన్ వారికి ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు వయో సడలింపు కలదు.
🔥దరఖాస్తు విధానం :
- నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత TGPSC వెబ్సైట్ లో ఆన్లైన్ విధానం దరఖాస్తు చేసుకోవాలి.
- ముందుగా ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
- పదవ తరగతి , ఇంటర్మీడియట్ / డిగ్రీ సర్టిఫికెట్ లు , కుల దృవీకరణ పత్రం , పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ అవసరం అగును.
🔥 జీతం :
- నెలకు 45,000/- రూపాయల వరకు జీతం లభిస్తుంది.
🔥 ఎంపిక చేయు విధానం :
- గతంలో రాష్ట్రంలో గల గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థను ప్రస్తుత ప్రభుత్వం మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని భావిస్తోంది.
- ఇందులో భాగంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమితులు అయిన VRO మరియు VRA వారిని నేరుగా గ్రామ రెవెన్యూ అధికారిగా విధుల్లోకి తీసుకుంటారు.
- వీరితో పాటుగా మరో 8000 మందిని వ్రాత పరీక్ష నిర్వహించి , ఎంపిక చేస్తారు.
- సంక్రాంతి లోపుగా ఈ నియామకాలు పూర్తి చేస్తారు.
- వ్రాత పరీక్ష నిర్వహించి ,పరీక్ష లో వచ్చిన మార్కుల ఆధారంగా , మెరిట్ ప్రాతిపదికన నియామకాలు చేపడతారు.
🔥 సర్క్యులర్ నోటిఫికేషన్ లో ముఖ్యమైన అంశాలు:
- తెలంగాణ రాష్ట్రం లోని కలెక్టర్లు ప్రతి రెవిన్యూ గ్రామంలో ఒక విలేజ్ స్థాయి అధికారిని నియమించాలి.
- గతంలో VRO, VRA లుగా పనిచేసి , వేరే డిపార్ట్మెంట్ నకు కేటాయించబడిన వారిని వారి విద్యార్హత మరియు ఆసక్తి ఆధారంగా మరలా విలేజ్ లెవెల్ అధికారిగా నియమించాలని ఆదేశించారు.
- ఈ ప్రక్రియనుప్రక్రియను తేది 28/12/2024 లోగా పూర్తి చేయాలి.
🔥 నోట్:
- ఈ ఉద్యోగాలకు మరికొద్ది రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కానుంది, నోటిఫికేషన్ విడుదల అయిన తరువాత పూర్తి వివరాలను మరో ఆర్టికల్ లో తెలియచేయడం జరుగును.