భారత ప్రభుత్వం , ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మినిస్ట్రీ పరిదిలో గల మినిరత్న కంపెనీ అయినటువంటి బ్రాడ్ కాస్టింగ్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ , రాజ్బన్ సిమెంట్ ఫ్యాక్టరీ (హిమాచల్ ప్రదేశ్) సంస్థ కార్యాలయంలో ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా బర్నర్ , ఫిట్టర్ , ఎలక్ట్రీషియన్ , ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ అను ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ఖాళీల వివరాలు , దరఖాస్తు విధానం , ఎంపిక విధానం మొదలగు అన్ని పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
✅ రైల్వేలో 32 వేల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల – Click here
🏹 ఆంధ్రప్రదేశ్ లో ప్రజా సంబంధాల అధికారి పోస్టులు భర్తీ – Click here
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- బ్రాడ్ కాస్టింగ్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 05
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- బర్నర్ – 01
- ఫిట్టర్ – 02
- ఎలక్ట్రీషియన్ – 01
- ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ – 01 అనే ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
🔥 విద్యార్హత :
- బర్నర్ :
- కెమిస్ట్రీ సబ్జెక్టు గా కలిగిన బి. ఎస్సీ డిగ్రీ ఉత్తీర్ణత లేదా కెమికల్ ఇంజనీరింగ్ / సిమెంట్ టెక్నాలజీ లో డిప్లొమా ఉత్తీర్ణత సాధించి వుండాలి.
- సిమెంట్ ఇండస్ట్రీ లో ఒక సంవత్సరం పనిచేసిన అనుభవం అవసరం అగును.
- ఫిట్టర్ : ఐటిఐ ( ఫిట్టర్ ) ఉత్తీర్ణత
- ఎలక్ట్రీషియన్ : ఐటిఐ ( ఎలక్ట్రీషియన్ ) ఉత్తీర్ణత
- ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ : ఐటిఐ (ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ఉత్తీర్ణత )
🔥 వయస్సు :
- బర్నర్ ఉద్యోగాలకు 40 సంవత్సరాల లోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఫిట్టర్ , ఎలక్ట్రీషియన్ , ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ఉద్యోగాలకు 18 సంవత్సరాలు నిండి యుండి 35 సంవత్సరాలలోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- అప్లికేషన్ తో పాటు గా క్రింద పేర్కొన్న కాపీలు కూడా ఆఫ్లైన్ విధానం ద్వారా పంపించాలి.
🔥 అవసరమగు పత్రాలు :
- విద్యార్హత ధృవ పత్రాలు
- SSC లేదా బర్త్ సర్టిఫికెట్
- కుల ధృవీకరణ పత్రం
- పని అనుభవం వున్న వారు వర్క్ ఎక్సపీరియన్స్ దృవీకరణ పత్రం
- పాన్ కార్డు
- ఆధార్ కార్డు
- పేర్కొన్న ధృవ పత్రాలు సెల్ఫ్ అటెస్టెడ్ చేసి , దరఖాస్తు తో జత చేసి ఆఫీస్ వారి చిరునామా కి పంపించాలి.
🔥 దరఖాస్తు పంపవలసిన చిరునామా:
- Broadcast Engineering Consultants India Limited (BECIL), BECIL BHAWAN, C-56/A-17, Sector-62, Noida-201307 (U.P).
🔥 అప్లికేషన్ ఫీజు :
- జనరల్ / ఓబీసీ/ ఎక్స్ – సర్వీస్ మాన్ / మహిళలు – 590/- రూపాయలు.
- ఎస్సీ , ఎస్టీ, PwBD, EWS అభ్యర్థులు 295/- రూపాయలు దరఖాస్తు ఫీజు ను ఆఫ్లైన్ విధానం ద్వారా డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో “Broadcast Engineering Consultants India Ltd, Noida” పేరు మీదుగా చెల్లించాలి.
🔥 జీతం:
- బర్నర్ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి నెలకు 40,000/- రూపాయల జీతం లభిస్తుంది.
- ఫిట్టర్ , ఎలక్ట్రీషియన్ , ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ఉద్యోగాలు కు ఎంపిక కాబడిన వారికి 12,360/- రూపాయల జీతం లభిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదిలు:
- ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : 08/01/2025
👉 Click here for notification and application
👉 Click here for official website