ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ షాపు డీలర్లును శాశ్వత ప్రాధిపతికన భర్తీ చేయు నిమిత్తం కర్నూల్ రెవెన్యూ డివిజన్ నుండి , అదోని రెవిన్యూ డివిజన్ నుండి మరియు తెనాలి రెవిన్యూ డివిజన్ నుండి నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
తమ సొంత గ్రామాలలో ఉద్యోగాలు పొందే అవకాశం వున్న ఈ ఉద్యోగాలను ,కేవలం ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి , ఈ ఉద్యోగాలను పొందవచ్చు. ఆసక్తి , అర్హత కల అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు.
🏹 ఆంధ్రప్రదేశ్ లో ప్రజా సంబంధాల అధికారి ఉద్యోగాలు – Click here
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- కర్నూల్ , అదోని, తెనాలి రెవిన్యూ డివిజన్ కార్యాలయాల నుండి ఈ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🏹 AP మంత్రుల పెషిల్లో ఉద్యోగాలు – Click here
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- రేషన్ డీలర్లు ఉద్యోగాలను శాశ్వత ప్రాధిపతికన భర్తీ చేయనున్నారు.
🔥 ఖాళీల సంఖ్య: 308
- కర్నూల్ రెవిన్యూ డివిజన్ పరిధిలో మొత్తం 76 చౌక దుకాణాలలో రేషన్ డీలర్ల భర్తీ జరగనుంది.
- ఆదోని గ్రామీణ రెవెన్యు డివిజన్ పరిధిలో 80 డిపోల్లో రేషన్ డీలర్ల భర్తీ జరగనుంది.
- తెనాలి రెవిన్యూ డివిజన్ లో 152 మందికి రేషన్ డీలర్ల గా ఎంపిక చేయనున్నారు.
🔥 విద్యార్హత :
- ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు.
🔥 వయస్సు :
- 18 సంవత్సరాలు నిండి యుండి, 40 సంవత్సరాల లోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం లో సంబంధిత రెవిన్యూ డివిజన్ కార్యాలయం (RDO ఆఫీస్) లేదా సబ్ కలెక్టర్ వారి కార్యాలయం నందు దరఖాస్తు లను అందజేయాలి.
- దరఖాస్తు ఫారం ను RDO కార్యాలయం లో పొంది , ఫిల్ చేసి , సంబంధిత అర్హత ధృవ పత్రాలు జత చేసి RDO కార్యాలయం లోని అధికారులకు / తహసీల్దార్ వారి కార్యాలయం నందు అందజేయాలి.
🔥 అవసరమగు ధృవ పత్రాలు :
- 10 వ తరగతి , ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లు
- వయస్సు దృవీకరణ పత్రం
- నివాస ధ్రువీకరణ పత్రం ( ఓటర్ కార్డు / ఆధార్ కార్డు / పాన్ కార్డు వంటివి )
- కుల దృవీకరణ పత్రం
- మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు
- నిరుద్యోగిగా వుంటునట్లు స్వీయ దృవీకరణ పత్రం ( సెల్ఫ్ డిక్లరేషన్ )
- దివ్యాంగులు అయితే సంబంధిత ధృవ పత్రాలు.
🔥 జీతం :
- అభ్యర్థులు ఎంపిక కాబడిన రేషన్ డీలర్ పోస్ట్ కి ఫిక్స్డ్ సాలరీ నెలవారీ జీతం గా లభిస్తుంది.
🔥 ఎంపిక విధానం :
- దరఖాస్తు స్వీకరణ పూర్తి అయిన అనంతరం దరఖాస్తులను shortlist చేసి వారికి వ్రాత పరిక్ష నిర్వహిస్తారు.
- వ్రాత పరీక్ష లో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- ఆ తర్వాత షార్ట్ లిస్టు చేయబడిన అభ్యర్థులకు మౌఖిక పరీక్ష నిర్వహిస్తారు.
- అభ్యర్థులు సంబంధిత రెవిన్యూ కార్యాలయాల నుండి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని , అర్హత ఆసక్తి వుంటే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు.
🔥 ముఖ్యమైన తేదిలు:
- దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : 30/12/2024
- వ్రాత పరీక్ష నిర్వహణ తేది : 05/01/2025