సికింద్రాబాద్ రైల్వే జోన్లో 1642 ఉద్యోగాలు భర్తీ | South Central Railway Group D Recruitment Update | Railway Group D Notification in Telugu

రైల్వేలో గ్రూప్ డి ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో కలిపి మొత్తం 32,438 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. ఇందులో సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ అయినా సికింద్రాబాద్ జోన్ నుండి 1642 పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది. తాజాగా ఈ పోస్టులకు సంబంధించి సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ డివిజన్ నుండి ఒక అధికారిక నోట్ కూడా విడుదల కావడం జరిగింది. పూర్తి నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మీరు సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ లో ఉన్న ఉద్యోగాలకు అప్లై చేసి ఎంపికైతే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వివిధ రైల్వే డివిజన్లో పనిచేసుకునే అవకాశం పొందవచ్చు. 

గుంతకల్లు, గుంటూరు, నెల్లూరు, హైదరాబాద్, సికింద్రాబాద్, బెజవాడ డివిజన్స్ లో పనిచేయవచ్చు.

🏹 సుప్రీం కోర్ట్ లో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు – Click here 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

సౌత్ సెంట్రల్ రైల్వేలో భర్తీ చేయబోయే ఖాళీలు పోస్టుల వారీగా క్రింది విధంగా ఉన్నాయి. 

దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో కలిపి భర్తీ చేస్తున్న పోస్టుల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. 

  1. అసిస్టెంట్ (ఎస్ & టి) :  124
  2. అసిస్టెంట్ (వర్క్ షాప్ ) : 96  
  3. అసిస్టెంట్ బ్రిడ్జి : 0
  4. అసిస్టెంట్ కారేజ్ అండ్ వాగన్ : 106
  5. అసిస్టెంట్ లోకో షెడ్ (డీజిల్) : 25
  6. అసిస్టెంట్ లోకో షెడ్ (ఎలక్ట్రికల్ ) : 54
  7. అసిస్టెంట్ ఆపరేషన్స్ (ఎలక్ట్రికల్) : 20
  8. అసిస్టెంట్ పి – వే  : 76
  9. అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ (వర్క్ షాప్) : 28
  10. అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ : 61
  11. అసిస్టెంట్ ట్రాక్ మెషిన్ : 86
  12. అసిస్టెంట్ టి ఆర్ డి : 66
  13. పాయింట్స్ మాన్ – బి : 209
  14. ట్రాక్ మెయింటైనర్ – IV: 691

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :

  • గ్రూప్ D ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోడల్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. 

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య

  • మొత్తం 32,438 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ లో 1642 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. 

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు

  • రైల్వేలో లెవెల్ – 1 ఉద్యోగాలు అయిన గ్రూప్ – డి ఉద్యోగాలు భర్తీ చేస్తారు.

🔥 విద్యార్హత :

  • అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ 10 వ తరగతి ఉత్తీర్ణత సాధించి వుండాలి.

                           (లేదా)

  • 10 వ తరగతి ఉత్తీర్ణత తో పాటు సంబంధిత ట్రేడ్ విభాగంలో ఐటిఐ పూర్తి చేయాలి.

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో  దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి నోటిఫికేషన్ విడుదల చేసిన సమయంలో అప్లికేషన్ ప్రారంభ తేదీ,  చివరి తేదీ, అప్లికేషన్ ఎడిట్ చేసుకునే తేదీలతో పాటు మరికొన్ని ముఖ్యమైన తేదీలు ప్రకటిస్తారు.

🔥 ఎంపిక విధానం :

  • కంప్యూటర్ ఆధారిత వ్రాత పరీక్ష తో పాటు ఫిజికల్ ఎఫిసీయన్సీ పరిక్ష , డాక్యుమెంట్ వెరిఫికేషన్ , మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

🔥  వయస్సు :

  • అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాలు నిండి యుండి 33 సంవత్సరాలలోపు వుండాలి.

🔥 వయస్సులో సడలింపు వివరాలు : 

  • గరిష్ట వయస్సు నిర్ధారణ లో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు , ఒబిసి వారికి 3 సంవత్సరాలు , దివ్యాంగులు కి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.

 🔥 నోట్

  • ఆర్ ఆర్ బి గ్రూప్ – డి ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు. మరికొద్ది రోజులలో నోటిఫికేషన్ విడుదల అవుతుంది.అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ విడుదల అయ్యాక , పూర్తి సమాచారాన్ని తెలుసుకొని దరఖాస్తు చేసుకోవలెను.
  • అధికారిక నోటిఫికేషన్ విడుదల అయ్యాక మరొక ఆర్టికల్ లో ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి సమాచారం మా వెబ్సైట్ ద్వారా తెలియజేస్తాం.
  • దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో కలిపి భర్తీ చేస్తున్న పోస్టుల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. 
  • మొత్తం  14 రకాల ఉద్యోగాల భర్తీ జరగనుంది.
  1. అసిస్టెంట్ (ఎస్ & టి) :  2012
  2. అసిస్టెంట్ (వర్క్ షాప్ ) : 3077  
  3. అసిస్టెంట్ బ్రిడ్జి : 301 
  4. అసిస్టెంట్ కారేజ్ అండ్ వాగన్ : 2587  
  5. అసిస్టెంట్ లోకో షెడ్ (డీజిల్) :  420 
  6. అసిస్టెంట్ లోకో షెడ్ (ఎలక్ట్రికల్ ) : 950
  7. అసిస్టెంట్ ఆపరేషన్స్ (ఎలక్ట్రికల్) : 744
  8. అసిస్టెంట్ పి – వే  : 257
  9. అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ (వర్క్ షాప్) : 624
  10. అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ : 1041
  11. అసిస్టెంట్ ట్రాక్ మెషిన్ : 799
  12. అసిస్టెంట్ టి ఆర్ డి : 1381
  13. పాయింట్స్ మాన్ – బి : 5058
  14. ట్రాక్ మెయింటైనర్ – IV: 13187

👉 Click here for Total Vacancies List

👉 సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ ఖాళీల లిస్ట్ – Click here 

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!