రైల్వే ఉద్యోగాల కొరకు వేచి చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త! రైల్వే డిపార్ట్మెంట్ లో ఖాళీగా వున్న ఉద్యోగాలకు ప్రతి సంవత్సరం నోటిఫికేషన్స్ విడుదల చేయనున్నారు అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే రైల్వే టెక్నీషియన్ , అసిస్టెంట్ లోకో పైలెట్ , జూనియర్ ఇంజనీర్ వంటి ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసి , రిక్రూట్మెంట్ జరుపుతున్నారు.
ఇప్పుడు చాలా మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న రైల్వే గ్రూప్ – డి ఉద్యోగాల భర్తీ చేయు నిమిత్తం రైల్వే మంత్రిత్వ శాఖ అన్ని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ లకు ఒక లెటర్ జారీ చేసింది.
🏹 SBI లో క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ – Click here
🏹 సుప్రీం కోర్ట్ లో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు – Click here
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 32,438 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్లు ఈ లెటర్ ద్వారా స్పష్టం అయ్యింది.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- భారతదేశం లోని అన్ని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులులో ఉద్యోగాలకు RRB ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది చేస్తుంది.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
- మొత్తం 32,438 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు: గ్రూప్ – డి ఉద్యోగాలు
- మొత్తం 14 రకాల ఉద్యోగాల భర్తీ జరగనుంది.
- అసిస్టెంట్ (ఎస్&టి) : 2012
- అసిస్టెంట్ (వర్క్ షాప్) : 3077
- అసిస్టెంట్ బ్రిడ్జి : 301
- అసిస్టెంట్ కారేజ్ అండ్ వాగన్ : 2587
- అసిస్టెంట్ లోకో షెడ్ (డీజిల్) : 420
- అసిస్టెంట్ లోకో షెడ్ (ఎలక్ట్రికల్) : 950
- అసిస్టెంట్ ఆపరేషన్స్ (ఎలక్ట్రికల్) : 744
- అసిస్టెంట్ పి – వే : 257
- అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ (వర్క్ షాప్) : 624
- అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ : 1041
- అసిస్టెంట్ ట్రాక్ మెషిన్ : 799
- అసిస్టెంట్ టి ఆర్ డి : 1381
- పాయింట్స్ మాన్ – బి : 5058
- ట్రాక్ మెయింటైనర్ – IV: 13187
🔥 విద్యార్హత :
- అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ 10 వ తరగతి ఉత్తీర్ణత సాధించి వుండాలి.
(లేదా)
- 10 వ తరగతి ఉత్తీర్ణత తో పాటు సంబంధిత ట్రేడ్ విభాగంలో ఐటిఐ పూర్తి చేయాలి.
🔥 వయస్సు :
- అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాలు నిండి యుండి 33 సంవత్సరాలలోపు వుండాలి.
- గరిష్ట వయస్సు నిర్ధారణ లో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు , ఒబిసి వారికి 3 సంవత్సరాలు , దివ్యాంగులు కి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.
🔥 ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత వ్రాత పరీక్ష తో పాటు ఫిజికల్ ఎఫిసీయన్సీ పరిక్ష , డాక్యుమెంట్ వెరిఫికేషన్ , మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
🔥 నోట్:
- RRB గ్రూప్ – డి ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు. మరికొద్ది రోజులలో నోటిఫికేషన్ విడుదల అవుతుంది. అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ విడుదల అయ్యాక , పూర్తి సమాచారాన్ని తెలుసుకొని దరఖాస్తు చేసుకోవలెను.
- అధికారిక నోటిఫికేషన్ విడుదల అయ్యాక మరొక ఆర్టికల్ లో ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి సమాచారం తెలియచేయడం జరుగును.
👉 Click here for official note
- ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా Website ప్రతి రోజూ open చేయండి. మరియు మా What’s Group and Telegram Group లో జాయిన్ అవ్వండి.