భువనేశ్వర్ ప్రధాన కేంద్రంగా గల CSIR – ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ సంస్థ జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు భారతదేశం లోని అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి , అవసరమగు విద్యార్హతలు , దరఖాస్తు చేయు విధానం , ఎంపిక విధానం మొదలగు అన్ని అంశాలు ను పూర్తిగా తెలుసుకొనేందుకు గాను ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి.
🏹 సుప్రీం కోర్ట్ లో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు – Click here
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- CSIR – ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 02
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
🔥 విద్యార్హత :
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10+2 , ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి వుండాలి లేదా తత్సమాన అర్హత కలిగి వుండాలి.
- DOPT వారి నిబంధనల మేరకు స్టేనోగ్రఫీ లో ప్రావీణ్యత కలిగి వుండాలి.
🏹 SBI లో క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ – Click here
🔥 వయస్సు:.
- జూనియర్ స్టేనోగ్రాఫర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వుండాలి.
- వయస్సు నిర్ధారణ కొరకు కట్ ఆఫ్ గా 10/01/2025 తేది నీ నిర్ణయించారు.
- ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు & ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
- PWBD వారికి 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.
🔥 దరఖాస్తు ఫీజు:
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా 500/- రూపాయల అప్లికేషన్ ఫీజును చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ , దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
🔥 ఎంపిక విధానం :
- అభ్యర్థులను వ్రాత పరీక్ష , ప్రోఫిషియన్సీ పరీక్ష నిర్వహణ ద్వారా ఎంపిక చేస్తారు.
🔥 వ్రాత పరీక్ష విధానం :
- ఓఏంఆర్ ఆధారిత ఆన్లైన్ ఆబ్జెక్టివ్ పరీక్ష వుంటుంది.
- మొత్తం 200 ప్రశ్నలకు గాను 2 గంటల సమయం కేటాయిస్తారు.
- జనరల్ ఇంటెలిజన్స్ & రీజనింగ్ 50 ప్రశ్నలకు గాను 50 మార్కులు , జనరల్ అవేర్నెస్ 50 ప్రశ్నలకు 50 మార్కులు , ఇంగ్లీష్ లాంగ్వేజ్ & కంప్రేహెన్షన్ 100 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు.
- ప్రతి ప్రశ్నకు ¼ వంతు నెగెటివ్ మార్కింగ్ విధానం కలదు.
🔥 ప్రొఫెసియన్సీ పరిక్ష :
- అభ్యర్థులు ఆన్లైన్ పరిక్ష తో పాటు ప్రోఫెసియన్సీ పరిక్ష కూడా రాయాలి.
- 10 నిముషాల కాలంలో ఇంగ్లీష్ లో అయితే 80 పదాలు టైప్ చేయగలిగే సామర్థ్యం కలిగి వుండాలి.
🔥 జీతం:
- జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగానికి ఎంపిక కాబడిన వారికి 7 వ సిపిసి ప్రకారం లెవెల్ – 4పే స్కేల్ రూపాయలు 25,500/- 81,100/- వర్తిస్తుంది.
- వీరికి నెలకు 46,869/- రూపాయల జీతం లభిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదిలు:
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేది : 12/12/2024
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేయడానికి చివరి తేది : 10/01/2025