తెలంగాణ MPHA(F) / ANM ఉద్యోగాలకు అప్లై చేసుకుని ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ముఖ్యమైన అప్డేట్. MPHA(F) / ANM ఉద్యోగాలకు సంబంధించిన హాల్ టికెట్స్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ పోర్టు తన వెబ్సైట్లో విడుదల చేసింది.. ఈ పోస్టులకు అప్లై చేసిన అభ్యర్థులు తమ హాల్ టికెట్స్ అఫీషియల్ వెబ్సైట్ లో అప్లై చేసినప్పుడు ఇచ్చిన ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
MPHA(F) / ANM పరీక్ష రాయపోయేవారు సబ్జెక్టుల వారిగా ప్రాక్టీస్ టెస్టులు మరియు మోడల్ టెస్టుల కోసం మా యాప్ వెంటనే డౌన్లోడ్ చేసి ప్రాక్టీస్ మొదలు పెట్టండి..
🏹 Download Our APP – Click here
- ప్రస్తుతం ఈ పరీక్ష డిసెంబర్ 29వ తేదీన ఓకే సెషన్ లో నిర్వహించబోతున్నారు.
- అభ్యర్థులు తమ హాల్ టికెట్ ను A4 షీట్ పైన ప్రింట్ తీసుకొని హాల్ టికెట్ తో పాటు నీలం లేదా నలుపు బాల్ పాయింట్ పెన్ను, గుర్తింపు కార్డు తో పరీక్షకు హాజరు కావాలి. పారదర్శకమైన వాటర్ బాటిల్ కూడా తీసుకుని వెళ్లొచ్చు. ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు మరియు ఏ వస్తువులు కూడా పరీక్ష హాల్లో పలికి అనుమతించరు.
- పరీక్షకు హాజరు అయ్యే అభ్యర్థులు పాటించాల్సిన జాగ్రత్తలకు సంబంధించి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్ లో ఒక వెబ్ నోట్ కూడా విడుదల చేసింది. అభ్యర్థులు దానిలో ఉన్న సూచనలు తప్పనిసరిగా పాటిస్తూ పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది.
- అభ్యర్థులకు కేటాయించిన పరీక్షా కేంద్రంలో మాత్రమే పరీక్ష రాయాలి.
- అభ్యర్థి బదులు వేరొకరు పరీక్ష రాయడానికి వెళితే అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడంతో పాటు FIR కూడా నమోదు చేస్తారు.
- పరీక్ష రాయిబోయే వారు రిపోర్టింగ్ సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకునే విధంగా బయలుదేరాలి.
- డిసెంబర్ 29వ తేదీన ఒకే సెషన్ లో పరీక్ష నిర్వహించబోతున్నట్టు బోర్డు వెల్లడించింది. కాబట్టి మార్కుల నార్మలైజేషన్ ఉండదు.
- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాబోయే అభ్యర్థులకు అవగాహన కోసం MPHA(F) / ANM మాక్ టెస్ట్ ను కూడా అధికారిక వెబ్సైట్లో బోర్డు పెట్టడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు వెబ్సైట్లో ఇచ్చిన మాక్ టెస్ట్ రాయవచ్చు.
- అభ్యర్థులు MPHA(F) / ANM హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేయడానికి మరియు బోర్డు విడుదల చేసిన వెబ్ నోట్ డౌన్లోడ్ చేయడానికి మరియు మాక్ టెస్ట్ రాయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి.
🏹 Official Website – Click here
🏹 Download Hall Tickets – Click here
రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు : 👇 👇 👇
- 2023 సంవత్సరంలో జూలై 26వ తేదీన MPHA(F) / ANM ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ పోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ విడుదల చేసిన సమయంలో మొత్తం 1520 పోస్టులకు భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్ లో బోర్డు పేర్కొంది. కానీ తర్వాత ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన మరో 411 MPHA(F) / ANM ఉద్యోగాలు కూడా ఇదే నోటిఫికేషన్ లో జతపరిచి మొత్తం 1911 పోస్టులు భర్తీ చేస్తున్నట్లు బోర్డు తర్వాత తెలిపింది.
- కొద్దిరోజులు క్రితం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహగారు కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న ఏఎన్ఎం లకు మరో 323 పోస్టులు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో కలిపి భర్తీ చేస్తామని హామీ కూడా ఇచ్చారు. ఈ పోస్టులు కూడా కలిపితే మొత్తం పోస్టుల సంఖ్య 2254 కు చేరుకుంటుంది.
- ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించిన తర్వాత అనేక కారణాల వలన పరీక్ష వాయిదా పడుతూ వచ్చింది. 2024 లో నవంబర్ 8వ తేదీన MHSRB డిసెంబర్ 29వ తేదీన ఈ ఉద్యోగాలకు పరీక్ష నిర్వహించబోతున్నట్లు వెబ్ నోటీసులో తెలిపింది.
🔥 ఎంపిక విధానము : ఈ ఉద్యోగాల ఎంపికలో మొత్తం 100 పాయింట్లకు ఎంపిక చేస్తారు.
- ఇందులో 70 పాయింట్లు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు.
- 30 పాయింట్లు గతంలో కాంట్రాక్టు లేదా అవుట్సోర్సింగ్ విధానంలో ప్రభుత్వ ఆసుపత్రులు, సంస్థలు, ప్రోగ్రాం లలో పనిచేసిన వారికి వెయిటిజి మార్కులు ఇస్తారు.
🔥 భర్తీ చేయబోయే మొత్తం ఖాళీల సంఖ్య : 1931 (అధికారికంగా బోర్డు ప్రకటించిన ఖాళీలు ఇవి)
🔥 పరీక్ష విధానం :
- 70 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో ప్రశ్నలు అభ్యర్థులు అప్లై చేసిన ఉద్యోగాల అర్హతకు సంబంధించిన సిలబస్ నుండి ఇస్తారు.
- ప్రతి ప్రశ్నకు ఒక మార్క్ ఉంటుంది..
- పరీక్షలో నెగిటివ్ మార్కులు ఉండవు.
- పరీక్ష తెలుగు మరియు ఇంగ్లీషులో ఉంటుంది.
🔥 పరీక్షా కేంద్రాలు :
- అదిలాబాద్ ,హనుమకొండ హైదరాబాద్ ,కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్ నగర్ , మందని, నల్గొండ , నర్సంపేట, నిజామాబాద్ , పెద్దపల్లి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్
- అభ్యర్థులకు కేటాయించిన పరీక్షా కేంద్రంలో ఎటువంటి మార్పు ఉండదు.
🏹 Official Website – Click here
🏹 Download Hall Tickets – Click here