తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరికొద్ది రోజుల్లో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (VRO) ఉద్యోగాలను భర్తీ చేయనుంది అన్న విషయం నిరుద్యోగ అభ్యర్థులకు తెలిసిందే అయితే ఈ గ్రామ రెవిన్యూ అధికారుల ఉద్యోగాల భర్తీ కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని , కొత్త రూల్స్ ను ప్రవేశపెట్టి , భర్తీ చేయనుంది.
సుమారు 10,956 రెవిన్యూ గ్రామాలలో రెవిన్యూ అధికారులు ను సంక్రాంతి నాటికి నియమించనున్నారు.
సంక్రాంతి లోపు రాష్ట్రం లోని 10,956 రెవిన్యూ అధికారులను నియమించి , తద్వారా రెవిన్యూ వ్యవస్థ ను పునరుద్దిస్తాము అని , గ్రామాలలో ప్రభుత్వ భూములకి రక్షణ , రెవిన్యూ శాఖతో ప్రభుత్వానికి సమన్వయ పరుస్తామని తెలియచేశారు.
ఇంటర్మీడియట్ & డిగ్రీ అర్హత తో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే విధంగా ఈ రూల్స్ ఫ్రేమ్ చేస్తున్నారు.
మొత్తం 10,956 ఉద్యోగాలలో కొన్ని పోస్టులను గతంలో వున్న VRO లతో భర్తీ చేసి , మిగతా 8,000 ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
🏹 సుప్రీం కోర్ట్ లో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు – Click here
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ద్వారా ఈ ఉద్యోగాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనుంది.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
- 10,956 ఉద్యోగాల నిమామకం జరగనుంది
- కేటగిరీ వారీగా పోస్ట్లు రిజర్వ్ చేయబడతాయి.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- రెవెన్యూ డిపార్ట్మెంట్ లో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (VRO) ఉద్యోగాల భర్తీ చేస్తారు.
🔥 విద్యార్హత :
- ఇంటర్మీడియట్ & డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు ఈ ఉద్యోగాలకు పొందేందుకు గాను దరఖాస్తు చేసుకోవచ్చు.
🏹 SBI లో క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ – Click here
🔥 వయస్సు :
- 18 సంవత్సరాలు నిండి యుండి 46 సంవత్సరాల లోపు వయసు గల వారు అర్హులు
- ఎస్సీ , ఎస్టీ , బీసీ , దివ్యాంగులు , Ex-సర్విస్ మాన్ వారికి ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు వయో సడలింపు కలదు.
🔥దరఖాస్తు విధానం :
- నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత TGPSC వెబ్సైట్ లో ఆన్లైన్ విధానం దరఖాస్తు చేసుకోవాలి.
- ముందుగా ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
- పదవ తరగతి , ఇంటర్మీడియట్ / డిగ్రీ సర్టిఫికెట్ లు , కుల దృవీకరణ పత్రం , పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ అవసరం అగును.
🔥 జీతం :
- నెలకు 45,000 /- రూపాయల వరకు జీతం లభిస్తుంది.
🔥 ఎంపిక చేయు విధానం :
- గతంలో రాష్ట్రం లో గల గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థను ప్రస్తుత ప్రభుత్వం మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని భావిస్తోంది.
- ఇందులో భాగంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమితులు అయిన VRO మరియు VRA వారిని నేరుగా గ్రామ రెవెన్యూ అధికారిగా విధుల్లోకి తీసుకుంటారు.
- వీరితో పాటుగా మరో 8,000 మందిని వ్రాత పరీక్ష నిర్వహించి , ఎంపిక చేస్తారు.
- సంక్రాంతి లోపుగా ఈ నియామకాలు పూర్తి చేస్తారు.
- వ్రాత పరీక్ష నిర్వహించి , పరీక్ష లో వచ్చిన మార్కుల ఆధారంగా , మెరిట్ ప్రాతిపదికన నియామకాలు చేపడతారు.
🔥 ROR చట్టం – ముఖ్యాంశాలు :
- తెలంగాణ భూమి హక్కుల పట్టాదారు పాసుబుక్ చట్టం – 2024 ద్వారా తెలంగాణ రాష్ట్రం లోని భూ సంబంధిత వివాదాలు కి శాశ్వత పరిస్కారం లభించే విధంగా ఈ చట్టాన్ని శాసన సభలో ప్రవేశపెట్టారు. ఈ చట్టం ద్వారానే ఊరికి ఒకరు చొప్పున వీఆర్వో చొప్పున 12వేల VROల భర్తీ చేయనున్నారు.
🔥 నోట్:
- ఈ ఉద్యోగాలకు మరికొద్ది రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కానుంది, నోటిఫికేషన్ విడుదల అయిన పూర్తి వివరాలను మరో ఆర్టికల్ లో తెలియచేయడం జరుగును.