ఎటువంటి వ్రాత పరిక్ష లేకుండా , కేవలం 10వ తరగతి ఉత్తీర్ణత తో సొంత జిల్లాలో ఉద్యోగం పొందేందుకు గాను నోటిఫికేషన్ విడుదల అయ్యింది. మహిళా అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్ ఒక సువర్ణావకాశం.
సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం ప్రాజెక్ట్ కార్యాలయం నుండి ఈ నోటిఫికేషన్ ప్రకటించబడింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని ఒంగోలు సిటీ , కురుచేడు, మార్కాపురం , టంగుటూరు మండలాల్లో ఐసీడీఎస్ ప్రాజెక్టు క్రింద అంగన్వాడి కేంద్రాలలో అంగన్వాడి కార్యకర్తలు మరియు ఆయా ఉద్యోగాల భర్తీ నిమిత్తం ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🏹 1036 పోస్టులుతో రైల్వే కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది – Click here
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం ప్రాజెక్ట్ కార్యాలయాల నుండి ఈ నోటిఫికేషన్ ప్రకటించబడింది.
🔥 ఖాళీల సంఖ్య : 139
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- అంగన్వాడీ కార్యకర్తలు
- అంగన్వాడి ఆయా
- ఒంగోలు సిటీ పరిధిలో 15 అంగన్వాడీ కార్యకర్తలు , 4 మిని కార్యకర్తలు , 89 అంగన్వాడీ ఆయా లు భర్తీ చేస్తున్నారు.
- కురిచేడు మండలం లో 1 అంగన్వాడీ కార్యకర్త , 3 అంగన్వాడీ ఆయా పోస్టులను భర్తీ చేస్తున్నారు.
- మార్కాపురం పట్టణ మండలంలో 5 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
- టంగుటూరు మండల పరిధిలో 1 అంగన్వాడీ కార్యకర్త , 21 అంగన్వాడీ ఆయా ఉద్యోగాల భర్తీ చేయనున్నారు.
🔥 విద్యార్హత & మిగతా అర్హతలు:
- అంగన్వాడీ కార్యకర్తలు అభ్యర్థులు తప్పనిసరిగా 10 వ తరగతి ఉత్తీర్ణత సాధించి వుండాలి.
- అంగన్వాడీ ఆయా అభ్యర్థులు 7 వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి.
- తప్పనిసరిగా వివాహితురాలై వుండాలి.
- స్థానిక నివాసితురాలై వుండాలి.
🔥 వయస్సు :
- 21 సంవత్సరాలు నిండి యుండి 35 సంవత్సరాలు లోపు వయస్సు గల మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులు 21 సంవత్సరాలు నిండిన వారు లేకపోతే 18 సంవత్సరాలు నిండిన వారిని పరిగణనలోకి తీసుకుంటారు.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం ద్వారా సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం ప్రాజెక్ట్ కార్యాలయం వారికి దరఖాస్తు అందజేయాలి.
🔥 దరఖాస్తు తో పాటు అవసరమగు ధృవ పత్రాలు :
- వయస్సు నిర్ధారణ కొరకు పుట్టిన తేది ధృవ పత్రం
- కుల , నివాస స్థల ధ్రువీకరణ పత్రం
- పుర్వానుభవం వుంటే సంబంధిత ధృవ పత్రం
- వితంతువు అయితే భర్త మరణ దృవీకరణ పత్రం
- వికలాంగులు అయితే సదరం సర్టిఫికెట్
- అదనపు అర్హతలు వుంటే సంబంధిత ధృవ పత్రాలు
- అన్ని కూడా గెజిటెడ్ అధికారితో అటెస్ట్ చేసి , దరఖాస్తు తో పాటు జత చేసి , ఐసీడీఎస్ కార్యాలయం కి ఇవ్వాలి.
🔥 ఎంపిక విధానం :
- ఎటువంటి వ్రాత పరీక్ష మరియు ఇంటర్వూ లేకుండా , డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహణ ద్వారా , మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
🔥 జీతం:
- ఎంపిక కాబడిన అంగన్వాడి కార్యకర్తలకు 12,000/- రూపాయల జీతం లభిస్తుంది.
- ఎంపిక కాబడిన అంగన్వాడి ఆయాలకు 8,000/- రూపాయల జీతం లభిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదిలు:
- ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది : 11/12/2024.
- ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : 23/12/2024.
👉 Click here to download application