ముంబై ప్రధాన కేంద్రంగా గల పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థ నుండి జూనియర్ అసోసియేట్స్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) ఉద్యోగాల భర్తీ కొరకు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
దేశవ్యాప్తంగా మొత్తం 13,735 ఉద్యోగాలను భర్తీ చేస్తుండగా తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోనే 392 ఖాళీలు వుండడం , అభ్యర్థులుకి శుభపరిణామం.
అభ్యర్థులు తమ సొంత రాష్ట్రం లోనే అప్లై చేసుకోవలసిన అవసరం లేదు , వారికి ఇష్టం వచ్చిన రాష్ట్ర పరిధిలో దరఖాస్తు చేసుకోవచ్చు , అయితే వారికి ఆ రాష్ట్ర స్థానిక భాష వచ్చి వుండాలి.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి విద్యార్హతలు , దరఖాస్తు విధానం ,పరీక్షా విధానం , పరీక్షా కేంద్రాలు మొదలగు పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఎస్బిఐ ) సంస్థ దేశ వ్యాప్తంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తుంది.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- జూనియర్ అసోసియేట్స్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) అనే క్లేరికల్ కేడర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
- 13735 ఉద్యోగాల భర్తీ జరగనుంది.
- తెలుగు రాష్ట్రాలలో ఖాళీల సంఖ్య ఈ విధంగా వుంది.
- ఆంధ్రప్రదేశ్ – 50
- తెలంగాణ – 342
ఈ ఖాళీలు కేటగిరీ వారీగా విభజించబడ్డాయి
🔥 విద్యార్హత :
- అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉత్తీర్ణత సాధించి వుండాలి లేదా తత్సమాన అర్హత కలిగి వుండాలి.
- విద్యార్హత నిర్ధారణ కొరకు 31/12/2024 ను కట్ ఆఫ్ తేది గా నిర్ణయించారు.
🔥 వయస్సు :
- అర్హత గల అభ్యర్థులు వయస్సు 20 సంవత్సరాలు నిండి వుండి 28 సంవత్సరాలలోపు గా వుండాలి.
- ఎస్సీ, ఎస్టీ వారికి 5 సంవత్సరాలు
- ఓబీసీ ( నాన్ క్రిమి లేయర్) వారికి 3 సంవత్సరాలు
- PWBD వారికి 10 సంవత్సరాలు
- Ex – సర్వీస్ మాన్ వారికి 5 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
- వయస్సు నిర్ధారణ కొరకు 01/04/2024 ను కట్ ఆఫ్ తేది గా నిర్ణయించారు.
🏹 ఆహార ధాన్యాలు నిల్వ చేసే సంస్థలో ఉద్యోగాలు – Click here
🏹 1036 పోస్టులుతో రైల్వే కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది – Click here
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో అప్లై చేయాలి.
🔥 అప్లికేషన్ ఫీజు :
- జనరల్ , EWS , OBC అభ్యర్థులు 750 రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- ఎస్సీ , ఎస్టీ , PwBD , ఎక్స్ సర్విస్ మెన్ అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
🔥 ఎంపిక విధానం :
- అభ్యర్థులను ఆన్లైన్ పరీక్ష (ప్రిలిమినరీ & మెయిన్స్ ) నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- అభ్యర్థులకు దరఖాస్తు చేసుకుంటున్న రాష్ట్ర స్థానిక భాష వచ్చి వుండాలి , స్థానిక భాష నైపుణ్యత ను పరిశీలించి ( లాంగ్వేజ్ ప్రోఫిసియన్సీ టెస్ట్ ) నియామకం చేస్తారు.
🔥 ఆన్లైన్ పరీక్షా విధానం :
- ప్రిలిమినరీ లో మొత్తం 100 మార్కులకు గాను , 100 ప్రశ్నలు ఇస్తారు ,ఇవి బహులైచ్చిక ప్రశ్నలు ఇందులో రీజనింగ్,కంప్యూటర్ ఆప్టిట్యూడ్ ,జనరల్ అవేర్నెస్ ,ఇంగ్లీష్ సబ్జెక్టుల నుండి ప్రశ్నలు వుంటాయి. 100 నిముషాల కాల పరిమితిలో సెక్షన్ వారీగా సమయం మార్కులు ,ప్రశ్నలు నిర్ధారిస్తారు.
- మెయిన్స్ పరీక్ష 200 మార్కులకు గాను 190 ప్రశ్నలు ఉంటాయి. ఫైనాన్షియల్ అవేర్నెస్ , జనరల్ ఇంగ్లిష్ , క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ , రీజనింగ్ ఎబిలిటీ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ ప్రశ్నలు ఉంటాయి.
- ప్రతి తప్పు సమాధానానికి కి ¼ వంతు నెగెటివ్ మార్కింగ్ విధానం కలదు.
🔥 పరీక్ష కేంద్రాలు :
- దేశంలోని పలు ప్రముఖ నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాలలో కూడా పలు నగరాలను పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేశారు.
- ఆంధ్ర ప్రదేశ్ : అనంతపూర్ , ఏలూరు , గుంటూరు/ విజయవాడ , కడప , కాకినాడ ,కర్నూల్ , నెల్లూరు , రాజమండ్రి , శ్రీకాకుళం , తిరుపతి , విశాఖపట్నం , విజయనగరం కేంద్రాలను ఎంపిక చేశారు.
- తెలంగాణ : హైదరాబాద్ , ఖమ్మం , వరంగల్ , కరీంనగర్ కేంద్రాలను ఎంపిక చేశారు.
🔥 జీతం :
- అభ్యర్థులకు 26,730/- రూపాయల బేసిక్ పే తో పాటు వివిధ అలవాన్స్ లు లభిస్తాయి.
🔥 ప్రొబేషన్ పీరియడ్:
- ఎంపిక కాబడిన అభ్యర్థులు 6 నెలలు పాటు ప్రొబెషన్ పీరియడ్ లో వుంటారు.
🔥 సర్వీస్ బాండ్: ఎంపిక కాబడిన అభ్యర్థులు 3 సంవత్సరాలు బ్యాంక్ వారి సర్వీస్ లో పనిచేసే విధంగా 2 లక్షల రూపాయలకు బాండ్ కి
🔥 ముఖ్యమైన తేదిలు:
- ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది : 17/12/2024
- ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేది : 07/01/2025
- ప్రిలిమినరీ వ్రాత పరీక్ష ఫిబ్రవరి 2025 లో నిర్వహిస్తారు.
- మెయిన్స్ వ్రాత పరీక్ష మార్చ్ / ఏప్రిల్ 2025 లో నిర్వహిస్తారు.