తెలంగాణ రాష్ట్ర ఆర్టీసి లో ఉద్యోగాల కోసం ఎదురు చేస్తున్న అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
TGSRTC లో 3035 ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు గాను సిద్ధంగా వుంది. కొత్త బస్సులు కొనుగోలు , మహాలక్ష్మీ పథకం ప్రభుత్వం అమలులోకి తీసుకొని రావడం , APSRTC లో సిబ్బంది కొరత వంటి వివిధ కారణాలు వలన సాధ్యమైనంత వేగంగా ఈ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఆర్టీసీ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి కూడా ఆమోద ముద్ర వేశారు. ఈ నేపథ్యంలో RTC యాజమాన్యం కూడా పోస్టులు భర్తీకి సిద్ధమైంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా డ్రైవర్లు , శ్రామిక్ , అసిస్టెంట్ ఇంజనీర్లు , సెక్షన్ ఆఫీసర్ లు , డిప్యూటీ సూపర్ ఇన్టెండెంట్, డిపో మేనేజర్లు వంటి పలు ఉద్యోగాల భర్తీ చేయనున్నారు.
🏹 ఆహార ధాన్యాలు నిల్వ చేసే సంస్థలో ఉద్యోగాలు – Click here
🏹 పదో తరగతి అర్హతతో పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు – Click here
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( TGSRTC ) నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 3035
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- డ్రైవర్ – 2000
- శ్రామిక్ – 743
- అసిస్టెంట్ ఇంజనీర్ – 23
- డిపో మేనేజర్ – 25
- డిప్యూటీ సూపరింటెండెంట్ ( ట్రాఫిక్ ) – 84
- డిప్యూటీ సూపరింటెండెంట్( మెకానిక్) – 114
- అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్ – 15
- సెక్షన్ ఆఫీసర్ ( సివిల్) – 11
- మెడికల్ ఆఫీసర్ ( జనరల్ ) – 7
- మెడికల్ ఆఫీసర్ ( స్పెసిలిస్ట్ ) – 7
- అకౌంట్స్ ఆఫీసర్ – 6
🔥 విద్యార్హత :
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్ట్ ఆధారంగా పదవ తరగతి , 10+2 , డిగ్రీ , బి.టెక్, ఎంబీబీఎస్ వంటి విద్యార్హతలు కలిగి వుండాలి.
🔥 వయస్సు :
- 18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాల లోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు & బీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు మొదటిగా ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు.
🔥 ఎంపిక విధానం :
- అభ్యర్థులను వ్రాత పరీక్ష , ప్రోఫిషియన్సీ పరీక్ష నిర్వహణ ద్వారా ఎంపిక చేస్తారు.
🔥 జీతం:
- అభ్యర్థులు ఎంపిక కాబడిన పోస్ట్ ఆధారంగా ప్రారంభ కనీస వేతనం 19000/- రూపాయల నుండి 25,000 /- రూపాయల వరకు నెల జీతం లభిస్తుంది.
🔥 ముఖ్యమైన అంశాలు :
- ఈ ఉద్యోగాలకి సంబంధించిన నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు.మరి కొద్ది రోజులలో నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం వుంది. (రెండు నుండి మూడు వారాల్లో ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తారు)
- కొత్త బస్సులు కొనుగోలు , మహాలక్ష్మీ పథకం ప్రభుత్వం అమలులోకి తీసుకొని రావడం , APSRTC లో సిబ్బంది కొరత వంటి వివిధ కారణాలు వలన సాధ్యమైనంత వేగంగా ఈ పోస్టులు భర్తీ చేయనున్నారు.
- అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ విడుదల అయ్యాక అన్ని అంశాలు సరిచూసుకుని , దరఖాస్తు చేసుకోగలరు.
- అధికారిక నోటిఫికేషన్ విడుదల అయ్యాక మరో ఆర్టికల్ లో పూర్తి సమాచారాన్ని తెలియచేయడం జరుగును.