భారత ప్రభుత్వ నవరత్న ఎంటర్ ప్రైస్ అయినటువంటి నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ ( NHPC ) లిమిటెడ్ సంస్థ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రైనీ ఆఫీసర్ (హెచ్ఆర్) , ట్రైనీ ఆఫీసర్ (పిఆర్) , ట్రైనీ ఆఫీసర్ (లా) , సీనియర్ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కొరకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి విద్యార్హతలు , దరఖాస్తు విధానం , ఎంపిక విధానం మొదలగు అన్ని అంశాలు కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
🏹 ఆంధ్రప్రదేశ్ లో క్లర్క్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు నోటిఫికేషన్ – Click here
🏹 LIC లో లక్ష మందికి ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు – Click here
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ ( NHPC) సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 118
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- ట్రైనీ ఆఫీసర్ ( హెచ్ ఆర్) – 71
- ట్రైనీ ఆఫీసర్ ( పి ఆర్) – 10
- ట్రైనీ ఆఫీసర్ ( లా) – 12
- సీనియర్ మెడికల్ ఆఫీసర్ – 25 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
🔥 విద్యార్హత :
- ట్రైనీ ఆఫీసర్ ( హెచ్ఆర్) :
హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ , సంబంధిత విభాగంలో 60 శాతం రెండు సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా లేదా తత్సమాన అర్హత
- ట్రైనీ ఆఫీసర్ (పిఆర్) :
కమ్యూనికేషన్స్ / మాస్ కమ్యూనికేషన్ / జర్నలిజం / పబ్లిక్ రిలేషన్స్ విభాగం లో 60 శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉత్తీర్ణత లేదా తత్సమాన అర్హత కలిగి వుం డాలి.
- ట్రైనీ ఆఫీసర్ (లా) :
60 శాతం మార్కులతో లా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా తత్సమాన అర్హత కలిగి వుండాలి.
- సీనియర్ మెడికల్ ఆఫీసర్:
వాలిడ్ రిజిస్ట్రేషన్ కలిగిన ఎంబీబీఎస్ డిగ్రీ ఉత్తీర్ణత మరియు రెండు సంవత్సరాల అనుభవం వున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥 వయస్సు :
- ట్రైనీ ఆఫీసర్ ( హెచ్ఆర్) & ట్రైనీ ఆఫీసర్ ( పిఆర్) ఉద్యోగాలకు 30 సంవత్సరాలు లోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ట్రైనీ ఆఫీసర్ (లా) , సీనియర్ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు 35 సంవత్సరాల లోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఎస్సీ, ఎస్టీ వారికి 5 సంవత్సరాలు
- ఓబీసీ వారికి 3 సంవత్సరాలు
- దివ్యాంగులు వారికి 10 సంవత్సరాలు
ప్రభుత్వ నిబంధనల మేరకు వయో సడలింపు లభిస్తుంది.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.
🔥 ఎంపిక విధానం :
- అభ్యర్థులను యుజిసి నెట్ స్కోరు మరియు ఇంటర్వ్యూ నిర్వహణ ద్వారా ఎంపిక చేస్తారు.
- యుజిసి నెట్ స్కోరు కు 75 శాతం , ఇంటర్వ్యూ కి 25 శాతం వెయిట్ ఏజ్ లభిస్తుంది.
🔥 జీతం:
- అభ్యర్థులు ఎంపిక కాబడిన పోస్ట్ ఆధారంగా సుమారు 80,000/- రూపాయల జీతం లభిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదిలు:
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేది : 09/12/2024.
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేయడానికి చివరి తేది : 30/12/2024.