తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త ! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ( VRO ) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గాను రంగం సిద్ధం చేస్తుంది. సుమారు 10,956 రెవిన్యూ గ్రామాలలో రెవిన్యూ అధికారులును సంక్రాంతి నాటికి నియమించనున్నట్లు రెవిన్యూ , గృహనిర్మాణ ,సమాచార మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.
సంక్రాంతి లోపు రాష్ట్రం లోని 10,956 రెవిన్యూ అధికారులను నియమించి , తద్వారా రెవిన్యూ వ్యవస్థ ను పునరుద్దిస్తాము అని , గ్రామాలలో ప్రభుత్వ భూములకి రక్షణ , రెవిన్యూ శాఖతో ప్రభుత్వానికి సమన్వయ పరుస్తామని తెలియచేశారు.
🔥 ఇంటర్మీడియట్ & డిగ్రీ అర్హత తో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
✅ నవోదయ & కేంద్రీయ విద్యాలయాల్లో 6700 ఉద్యోగాలు – Click here
మొత్తం 10,956 ఉద్యోగాలలో కొన్ని పోస్టులను గతంలో వున్న విఆర్ఓ లతో భర్తీ చేసి , మిగతా ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
అభ్యర్థులు అవగాహన కోసం క్రింద రిక్రూట్మెంట్ కోసం కొన్ని ముఖ్యమైన వివరాలు ఇవ్వబడినవి..
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( TGPSC ) ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసి ఈ ఉద్యోగాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనుంది.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
- 10,956 ఉద్యోగాల నిమామకం జరగనుంది
- కేటగిరీ వారీగా పోస్ట్లు రిజర్వ్ చేయబడతాయి.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- రెవెన్యూ డిపార్ట్మెంట్ లో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (VRO) ఉద్యోగాల భర్తీ చేస్తారు.
🔥 విద్యార్హత :
- ఇంటర్మీడియట్ & డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు ఈ ఉద్యోగాలకు పొందేందుకు గాను దరఖాస్తు చేసుకోవచ్చు.
✅ వ్యవసాయ శాఖలో పదో తరగతి అర్హతతో MTS ఉద్యోగాలు – Click here
🔥 వయస్సు :
- 18 సంవత్సరాలు నిండి యుండి 46 సంవత్సరాల లోపు వయసు గల వారు అర్హులు అవుతారు.
- ఎస్సీ , ఎస్టీ , బీసీ , దివ్యాంగులు , Ex – సర్విస్ మాన్ వారికి ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు వయో సడలింపు కలదు.
🔥దరఖాస్తు విధానం :
- నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత TGPSC వెబ్సైట్ లో ఆన్లైన్ విధానం దరఖాస్తు చేసుకోవాలి.
- దీనికోసం ముందుగా TGPSC ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- పదవ తరగతి , ఇంటర్మీడియట్ / డిగ్రీ సర్టిఫికెట్ లు , కుల దృవీకరణ పత్రం , పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ అవసరం అగును.
🔥 జీతం :
- నెలకు 45,000/- రూపాయల వరకు జీతం లభిస్తుంది.
🔥 ఎంపిక చేయు విధానం :
- గతంలో రాష్ట్రంలో గల గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థను ప్రస్తుత ప్రభుత్వం మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని భావిస్తోంది.
- ఇందులో భాగంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమితులు అయిన VRO మరియు VRA వారిని నేరుగా గ్రామ రెవెన్యూ అధికారిగా విధుల్లోకి తీసుకుంటారు.
- వీరితో పాటుగా మరో 8000 మందిని వ్రాత పరీక్ష నిర్వహించి , ఎంపిక చేస్తారు.
- సంక్రాంతి లోపుగా ఈ నియామకాలు పూర్తి చేస్తారు.
- వ్రాత పరీక్ష నిర్వహించి , పరీక్ష లో వచ్చిన మార్కుల ఆధారంగా , మెరిట్ ప్రాతిపదికన నియామకాలు చేపడతారు.
🔥 నోట్:
- ఈ ఉద్యోగాలకు మరికొద్ది రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కానుంది, నోటిఫికేషన్ విడుదల అయిన పూర్తి వివరాలను మరో ఆర్టికల్ లో తెలియచేయడం జరుగును.