Headlines

తెలంగాణ మోడల్ స్కూల్స్ లో ANM ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | Telangana Model Schools Recruitment | Telangana ANM Jobs

తెలంగాణ రాష్ట్రంలో మోడల్ స్కూల్స్ లో కాంట్రాక్టు పద్ధతిలో ANM ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న వారి నుంచి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. అర్హత ఉన్నవారు డిసెంబర్ 11వ తేది లోపు అప్లై చేయాలి.

రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి..

🏹 తెలంగాణలో 8,000 VRO ఉద్యోగాలు భర్తీ – Click here 

తెలంగాణలో డిసెంబర్ 29వ తేదీన జరగబోతున్న ANM / MPHA పరీక్షకు ప్రిపేర్ అయ్యే వారికోసం మా యాప్ లో  MHSRB సిలబస్ ప్రకారం సబ్జెక్ట్ వైజ్ గా టెస్టులు మరియు మోడల్ టెస్టులు పెడుతూ ఉన్నాము. ఈ కోర్సు కేవలం 299/- మాత్రమే. ప్రస్తుతం ఆఫర్ ఉంది. కోర్సు కావాలనుకునేవారు మా యాప్ Install చేసుకోండి.

🏹 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ

  • తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ జిల్లా డీఈవో కార్యాలయం నుంచి ఈ రిక్రూట్మెంట్ ప్రకటన విడుదలైంది.

🏹 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు : 

  • ఈ నోటిఫికేషన్ ద్వారా హన్మకొండ జిల్లాలో భీమదేవరపల్లి మరియు ఎల్కతుర్తి లోని తెలంగాణ మోడల్ స్కూల్స్ లో ANM ఉద్యోగాలు భర్తీ కోసం దరఖాస్తులు కోరుతున్నారు. 

🏹 అర్హతలు : 

  • ఈ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ అర్హతతో పాటు ఏఎన్ఎం శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా అభ్యర్థులు అప్లై చేయడానికి అర్హులు. 

🏹 అప్లై చేయడానికి ఉండవలసిన వయస్సు : 

  • ఏఎన్ఎం పోస్టులకు అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే కనీసం 18 నుండి గరిష్టంగా 44 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు. 

🏹 అప్లికేషన్ చివరి తేదీ

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ – డిసెంబర్ 11 

🏹 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : 

  • హనుమకొండ జిల్లాలోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం (DEO ఆఫీస్) నందు అభ్యర్థులు తమ అప్లికేషన్ అందజేయాలి. 

🏹 ఎంపిక విధానము : 

  • ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. కావున ఎంపిక విధానంలో రాత పరీక్ష నిర్వహించకపోవచ్చు. 
  • అభ్యర్థులకు అర్హత పరీక్షలు వచ్చిన మార్కులు మరియు వారికి ఉన్న అనుభవం ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేయవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!