సొంత జిల్లాలో జాబ్ చేసుకునే అవకాశం | ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఉద్యోగాలు భర్తీ | AP Latest jobs Notifications

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని నిరుద్యోగ మహిళా అభ్యర్థులు  దరఖాస్తు చేసుకునే విధంగా సొంత జిల్లాలలో పని చేసేవిధంగా , ఒక మంచి నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

అన్నమయ్య జిల్లా స్త్రీ & శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారి వారి కార్యాలయం నుండి రాజంపేట ,లక్కిరెడ్డి పల్లి , మదనపల్లి లో గల బాలసదనం లలో వివిధ ఉద్యోగాలను కాంట్రాక్టు / పార్ట్ టైం/ ఔట్ సోర్సింగ్ ప్రాధిపతికాన భర్తీ చేసేందుకు గాను ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా ,ఎటువంటి వ్రాత పరీక్షా లేకుండా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ఖాళీల వివరాలు , దరఖాస్తు విధానం , ఎంపిక విధానం మొదలగు అన్ని  పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🏹 10th అర్హతతో ఉద్యోగాలు – Click here 

🏹 గ్రామీణ విద్యుత్ కార్యాలయాల్లో ఉద్యోగాలు – Click here 

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : 

  • అన్నమయ్య జిల్లా స్త్రీ & శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారి వారి కార్యాలయం నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 

  • మొత్తం 17 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు

  • ఆఫీస్ ఇన్ ఛార్జ్ – 01 ( కాంట్రాక్టు ప్రాధిపతికన)
  • కుక్ -01 ( అవుట్సోర్సింగ్ ప్రాధిపతికన)
  • హెల్పర్ -01 ( అవుట్సోర్సింగ్ ప్రాధిపతికన)
  • హౌస్ కీపర్ -02 ( అవుట్సోర్సింగ్ ప్రాధిపతికన)
  • ఎడ్యుకేటర్ పార్ట్ టైం  -02 ( పార్ట్ టైం)
  • ఆర్ట్ & క్రాఫ్ట్ మరియు మ్యూజిక్ టీచర్ – 02 ( పార్ట్ టైం)
  • పి టి ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ – 03  (పార్ట్ టైం)
  • హెల్పేర్ కమ్ నైట్ వాచ్మెన్ -03 ( ఔట్ సోర్సింగ్) 

🔥 విద్యార్హత :

1)ఆఫీస్ ఇన్ ఛార్జ్ :

  • సోషల్ వర్క్ / సోషియాలజీ / చైల్డ్ డెవలప్మెంట్ / హ్యూమన్ రైట్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / సైకాలజీ / సైకియిర్టీ / లా / పబ్లిక్ హెల్త్ / కమ్యూనిటీ రిసోర్స్ మేనేజ్మెంట్/

2)కుక్ :

  • పదవ తరగతి ఉత్తీర్ణత / ఫెయిల్ 
  • ఏదైనా సంస్థ లో వంటపని విభాగంలో  3 సంవత్సరాల అనుభవం
  • ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ అవసరం అగును.

3)హెల్పర్  : 

  • 7వ తరగతి ఉత్తీర్ణత / ఫెయిల్
  • వంటపని & ఇంటిపని లో 3 సంవత్సరాల అనుభవం
  • ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ అవసరం అగును.

4)హౌస్ కీపర్ : 

  • పదవ తరగతి ఉత్తీర్ణత / ఫెయిల్ (హౌస్ కీపింగ్ లో డిప్లొమా వారికి ప్రాధాన్యత కలదు)
  • ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ అవసరం అగును.

            5)ఎడ్యుకేటర్ :

  • మేథమెటిక్స్ & సైన్స్ సబ్జెక్టు లను కలిగి వున్న బి.ఎస్సీ మరియు బి.ఈడి పూర్తి చేసి మూడు సంవత్సరాల అనుభవం కలిగి వుండాలి
  • బి.ఏ డిగ్రీ తో పాటుగా  బి. ఇడి పూర్తి చేసి , ఇంగ్లీష్ ,సోషల్ సబ్జెక్టు లలో 3 సంవత్సరాల అనుభవం కలిగి వుండాలి.

            6)ఆర్ట్ & క్రాఫ్ట్ మరియు మ్యూజిక్ టీచర్ :

  • పదవ తరగతి ఉత్తీర్ణత సాధించాలి.
  • ఎంబ్రాయిడరీ , టైలరింగ్, హండీ క్రాఫ్ట్ విభాగాలలో డిప్లొమా 
  • మ్యూజిక్ టీచర్ : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి మ్యూజిక్ డిప్లొమా
  • 3 సంవత్సరాల అనుభవం

            7)పి టి ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ :

  • ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ లో డిప్లొమా / డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.
  • 3 సంవత్సరాల అనుభవం కలిగి వుండాలి.

             8)హెల్పేర్ కమ్ నైట్ వాచ్మెన్

  • 7వ తరగతి ఉత్తీర్ణత / ఫెయిల్
  • వంటపని & ఇంటి పని లో 3 సంవత్సరాల a

🔥  వయస్సు :

  • ఈ ఉద్యోగాలకు 30 సంవత్సరాలు నిండి యుండి , 45 సంవత్సరాల లోపు గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు ను సమర్పించాలి.
  • అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు ను ప్రింట్ తీసుకొని , ఫిల్ చేసి సంబంధిత ధృవపత్రాలు ని జత చేసి , జిల్లా స్త్రీ & శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారి వారి కార్యాలయం ఆపోజిట్ కె. టి సి ఫంక్షన్ హాల్ , సుండుపల్లి రోడ్డు ,రాయచోటి నందు సమర్పించాలి.

🔥 అప్లికేషన్ ఫీజు :  

  •  ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

🔥 ఎంపిక విధానం :

  • అభ్యర్థులను ఎంపిక చేయడానికి ఎటువంటి వ్రాత పరిక్ష నిర్వహించరు.
  • గడువు తేది లోపల వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి , అభ్యర్థులను  ఇంటర్వ్యూ కి పిలుస్తారు.
  • ఇంటర్వ్యూ తో పాటుగా నియామకములు జరుగు తేది నాటికి అమలులో వున్న / జారీ చేయబడిన నిబంధనల ప్రకారం నియామకాలు జరుగును.

🔥 జీతం

  • ఆఫీస్ ఇన్ ఛార్జ్ గా ఎంపిక అయిన వారికి నెలకు 33,100/- రూపాయల జీతం లభిస్తుంది.
  • ఎడ్యుకేటర్ , ఆర్ట్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్ , PT ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి నెలకు 10,000/- రూపాయల జీతం లభిస్తుంది.
  • కుక్ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి నెలకు 9,930/- రూపాయలు జీతం లభిస్తుంది.
  • హేల్పర్,హౌస్ కీపర్ , హేల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి నెలకు 7944/- రూపాయల జీతం లభిస్తుంది.

 🔥 ముఖ్యమైన తేదిలు:

  • నోటిఫికేషన్ విడుదల తేది : 02/12/2024
  • దరఖాస్తును ఆఫీస్ వారి చిరునామాకు సమర్పించడానికి చివరి తేది : 13/12/2024

👉  Click here for notification and application

👉 Click here for official website 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!