సెంట్రల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ (CGST) & సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుండి ట్యాక్స్ అసిస్టెంట్ మరియు హవల్దార్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు పదో తరగతి మరియు డిగ్రీ వంటి విద్యార్హతలు కలిగి ఉండాలి.
ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు వివిధ ఆటలు లేదా క్రీడలలో ప్రతిభావంతులైన క్రీడాకారుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ లో తెలియజేయడం జరిగింది. చివరి వరకు పూర్తిగా చదివి తెలుసుకుని మీకు అర్హత ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి.
పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి అవసరమైన లింక్స్ ఆర్టికల్ చివరిలో ఇవ్వబడినవి.
- ఇలాంటి మరి కొన్ని ఉద్యోగాల సమాచారం కోసం క్రింద ఇచ్చిన లింక్స్ పైన క్లిక్ చేసి మా WhatsApp మరియు Telegram Group’s లో జాయిన్ అవ్వండి.
▶️ మరి కొన్ని రకాల ఉద్యోగాల సమాచారం 👇 👇 👇
🏹 పదో తరగతి అర్హతతో పోస్టల్ శాఖలో ఉద్యోగాలు భర్తీ – Click here
🏹 మీ సేవ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానం – Click here
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- సెంట్రల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ మరియు సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
🔥 భర్తీ చేయబోయే పోస్టులు :
- వివిధ ఆటలు లేదా క్రీడలలో ప్రతిభావంతులైన క్రీడాకారుల కోటాలో ట్యాక్స్ అసిస్టెంట్ మరియు హవల్దార్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
- భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులు – 04 మరియు హవల్దార్ – 10 ఉన్నాయి.
🔥 విద్యార్హతలు :
- ట్యాక్స్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హతతో పాటు నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా డేటా ఎంట్రీ వర్క్ చేయగలిగిన వారు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
- హవల్దార్ ఉద్యోగాలకు పదో తరగతి విద్యార్హత ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.
🔥 వయస్సు :
- టాక్స్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు .
- హవల్దార్ ఉద్యోగాలకు 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు. నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా ఈ హవల్దార్ ఉద్యోగాలకు శారీరక కొలతలు కలిగి ఉండాలి.
🔥 వయస్సులో సడలింపు :
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు వర్తిస్తుంది.
🔥 అప్లికేషన్ విధానం :
- అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తమ అప్లికేషన్ కు అవసరమైన సర్టిఫికెట్స్ అన్ని జతపరిచి పోస్ట్ ద్వారా పంపించాలి. మరియు అప్లికేషన్ Soft Copy లను మెయిల్ చేయాలి.
- అప్లికేషన్ పంపించాల్సిన మెయిల్ ఐడి – [email protected]
🔥 అప్లికేషన్ పంపించాల్సిన అడ్రస్ :
- అప్లికేషన్ పంపేవారు తప్పనిసరిగా క్రింది విధంగా అప్లికేషన్ పంపే కవర్ మీద రాయాల్సి ఉంటుంది.
- “Application of Meritorious Sportspersons” in Central GST and CX, RANCHI ZONE PATNA — 2024.
- For the post of TAX ASSISTANT / HAVALDAR under Sports Quota —
- NAME OF THE SPORT:—
- అడ్రస్ : The Joint Commissioner (CCA) O/o the Chief Commissioner, CGST & CX, RANCHI ZONE PATNA ,1st FLOOR, CENTRAL REVENUE BUILDING (ANNEXE), BIRCHAND PATEL PATH, PATNA-800 001
🔥 ఎంపిక విధానం :
- అభ్యర్థులు పాల్గొన్న క్రీడల ఆధారంగా ఎంపిక చేస్తారు. అనగా అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రీయ, యూనివర్సిటీ స్థాయి, ఇండియన్ యూత్ గేమ్స్, పాఠశాల స్థాయిలో క్రీడలు లేదా ఆటల్లో పాల్గొన్న వారికి ప్రాధాన్య క్రమం ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.
🔥 జీతము :
- టాక్స్ అసిస్టెంట్ ఉద్యోగాలకు లెవెల్-4 ప్రకారం 25,500/- నుండి 81,100/- వరకు పేస్కేల్ ఉంటుంది.
- హవల్దార్ ఉద్యోగాలకు లెవల్-1 ప్రకారం 18,000/- నుండి 56,900/- వరకు పేస్కేల్ ఉంటుంది.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ :
- 23-11-2024 తేది నుండి అభ్యర్థులు ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- నోటిఫికేషన్ విడుదల తేదీ నుండి 30 రోజుల్లోపు చేరే విధంగా అప్లికేషన్ పంపించాలి. (23-12-2024).
🔥 జాబ్ లొకేషన్ :
- ఎంపికైన వారికి పాట్నా మరియు రాంచి ప్రాంతాల్లో పోస్టింగ్ ఇస్తారు.
Note: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే .అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత అప్లికేషన్ పెట్టుకోండి.
👉 Download Full Notification – Click here
✅ Download Application – Click here