భారత ప్రభుత్వం , మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ( BEL ) సంస్థ నుండి ట్రైనీ ఇంజనీర్ & ప్రాజెక్టు ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
నవరత్న కంపెనీ అయినటువంటి ఈ సంస్థ మొత్తం 48 ఉద్యోగాల భర్తీ నిమిత్తం అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి విద్యార్హతలు , దరఖాస్తు విధానం ,పరీక్షా విధానం , పరీక్షా కేంద్రాలు మొదలగు పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🏹 Walmart సంస్థలో ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు – Click here
🏹 గ్రామీణ ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు – Click here
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ( BEL ) నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- ట్రైనీ ఇంజనీర్ – I & ప్రాజెక్ట్ ఇంజనీర్ – I అనే ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
- మొత్తం పోస్టులు సంఖ్య – 48
- ట్రైనీ ఇంజనీర్ – I – 36
- ప్రాజెక్ట్ ఇంజనీర్ – I – 12
🔥 విద్యార్హత :
1) ట్రైనీ ఇంజనీర్ – I :
- ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి కంప్యూటర్ సైన్స్ విభాగంలో బి. ఈ / బి. టెక్ / బి. ఎస్సీ ( 4 సంవత్సరాల కోర్సు ) లో జనరల్ / EWS / ఓబీసీ అభ్యర్థులు ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణత , ఎస్సీ , ఎస్టీ , PwBD అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించి వుండాలి.
2) ప్రాజెక్ట్ ఇంజనీర్ – I :
- ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి కంప్యూటర్ సైన్స్ విభాగంలో బి. ఈ / బి. టెక్ / బి. ఎస్సీ ( 4 సంవత్సరాల కోర్సు ) లో జనరల్ / EWS / ఓబీసీ అభ్యర్థులు ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణత , ఎస్సీ , ఎస్టీ , PwBD అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించి వుండాలి.
🔥 గరిష్ట వయస్సు :
- ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాలకు 28 సంవత్సరాల లోపు గల వారు
- ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకు 32 సంవత్సరాల లోపు గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
- వయస్సు నిర్ధారణ కోసం 01/06/2024 ను కట్ ఆఫ్ తేది గా నిర్ణయించారు.
- ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు & ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు , PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ లో పొందుపరిచిన ఫార్మాట్ ను ప్రింట్ తీసి , నింపి ఎన్వలప్ పై ఈ క్రింది విధంగా రాసి ,ఆఫీస్ వారి చిరునామాకు స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపించాలి.
- “Application for the post of Trainee Engineer – I FOR CRL GAD/ Application for the post of Project Engineer– I FOCRLGAD”
🔥 దరఖాస్తు పంపవలసిన చిరునామా :
- Smt. Rekha Aggarwal DGM (HR&A), Central Research Laboratory, Bharat Electronics Limited, P.O. Bharat Nagar, Sahibabad, Ghaziabad Pin – 201010, (U.P.)
🔥 అప్లికేషన్ ఫీజు :
- ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల 177 రూపాయలు ( 150 రూపాయలు + 18 శాతం GST)
- ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 472 రూపాయలు ( 400 రూపాయలు + 18 శాతం GST ) దరఖాస్తు ఫీజు ను ఎస్బిఐ కలెక్ట్ ద్వారా చెల్లించాలి.,చెల్లించిన తర్వాత ఆ screenshot ను దరఖాస్తు కి జత చేయాలి.
- ఎస్బిఐ కలెక్ట్ రిఫరెన్స్ నెంబరు ను అప్లికేషన్ లో ప్రస్తావించాలి.
🔥 ఎంపిక విధానం :
- అభ్యర్థులను వ్రాత పరీక్ష & ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
- వ్రాత పరీక్ష కు 85 శాతం మార్కులు & ఇంటర్వ్యూ కి 15 శాతం మార్కులు కేటాయించారు.
🔥 జీతం :
- ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగానికి ఎంపిక కాబడిన వారు మొదటి సంవత్సరం నెలకు 30,000/- రూపాయలు , రెండవ సంవత్సరం నెలకి 35,000 /- రూపాయలు , మూడవ సంవత్సరం నెలకి 40,000/- రూపాయలు జీతం లభిస్తుంది.
- దీనితో పాటుగా అదనపు సౌకర్యాలు , అలవెన్స్ లు లభిస్తాయి.
- ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగానికి ఎంపిక కాబడిన వారు మొదటి సంవత్సరం నెలకు 40,000/- రూపాయలు , రెండవ సంవత్సరం నెలకి 45,000 /- రూపాయలు , మూడవ సంవత్సరం నెలకి 50,000/- , నాల్గవ సంవత్సరం నెలకి 55,000/- రూపాయలు జీతం లభిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదిలు :
- ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు ఆఫీస్ వారి చిరునామాకు చేసుకోవడానికి చివరి తేది : 11/12/2024.
👉 Click here for official website