విజయవాడ విమానాశ్రయంలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | AAICLAS Notification 2024 | Jobs in Vijayawada Airport

AAI కార్గో లాజిస్టిక్స్ & అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ (AAICLAS) సంస్థ నుండి చీఫ్ ఇన్స్ట్రక్టర్ , ఇన్స్ట్రక్టర్, సెక్యూరిటీ స్క్రీనర్ ఉద్యోగాలను కాంటాక్ట్ ప్రాధిపధికన భర్తీ చేయడానికి అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. 

చీఫ్ ఇన్స్ట్రక్టర్ , ఇన్స్ట్రక్టర్ ఉద్యోగాలను తేది :28/11/2024 న జరుగు ఆన్లైన్ ఇంటర్వ్యూ కి హాజరు అయి ఉద్యోగాలను పొందవచ్చు.

సెక్యూరిటీ స్క్రీనర్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారు విజయవాడ ,  చెన్నై , ఢిల్లీ , కొలకత్తా ,గోవా వంటి అంతర్జాతీయ విమానాశ్రయాలు లో పని చేయాల్సి వుంటుంది.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🏹 10th అర్హతతో ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు – Click here 

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : AAI కార్గో లాజిస్టిక్స్ & అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ ( AAICLAS)

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 277

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు

  • చీఫ్ ఇన్స్ట్రక్టర్ – 01
  • ఇన్స్ట్రక్టర్ – 02
  • సెక్యూరిటీ స్క్రీనర్ ( ఫ్రెషర్ ) – 274

🔥 విద్యార్హత

  1. సెక్యూరిటీ స్క్రీనర్ ( ఫ్రెషర్ ): 
  • అత్యధికంగా ఖాళీలు ను భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి బ్యాచిలర్ డిగ్రీ అర్హత కా పేర్కొన్నారు.
  • బ్యాచిలర్ డిగ్రీ లో జనరల్ కేటగిరీ అభ్యర్థులు 60 శాతం మార్కులు , ఎస్సీ ,  ఎస్టీ అభ్యర్థులు 55 శాతం మార్కులు పొందివుండాలి.
  • హిందీ , ఇంగ్లీష్ ,స్థానిక భాష పై అవగాహన వుండాలి.
  1. చీఫ్ ఇన్స్ట్రక్టర్ :
  • DGCA ద్వారా పౌర విమానయాన అవసరాల ప్రకారం నిర్ణయించారు.
  • 15 సంవత్సరాల అనుభవం అవసరం

        3) ఇన్స్ట్రక్టర్

  • DGCA ద్వారా పౌర విమానయాన అవసరాల ప్రకారం నిర్ణయించారు
  • 5 సంవత్సరాల అనుభవం అవసరం.

🔥 గరిష్ఠ వయస్సు :

  • సెక్యూరిటీ స్క్రీనర్ ( ఫ్రెషర్ ): 27 సంవత్సరాల లోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • చీఫ్ ఇన్స్ట్రక్టర్ పోస్ట్ కి 67 సంవత్సరాల లోపు గల వారు , ఇన్స్ట్రక్టర్ పోస్ట్ కి 60 సంవత్సరాల లోపు గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • పేర్కొన్న అన్ని పోస్టులకు వయస్సు నిర్ధారణ కొరకు 01/11/2024 ను కట్ ఆఫ్ తేది గా నిర్ణయించారు.

🔥దరఖాస్తు విధానం :

  • సెక్యూరిటీ స్క్రీనర్ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

🔥 అప్లికేషన్ ఫీజు

  • సెక్యూరిటీ స్క్రీనర్ ఉద్యోగాలను అప్లై చేసుకొనే అభ్యర్థులు జనరల్ / ఓబీసీ వారు అయితే 700/- రూపాయలు , ఎస్సీ, ఎస్టీ, EWS, మహిళా అభ్యర్థులు అయితే 100 /- రూపాయలు దరఖాస్తు ఫీజు చెల్లించాలి.

🔥 జీతం :

  • చీఫ్ ఇన్స్ట్రక్టర్ గా ఎంపిక కాబడితే నెలకు మొదటి సంవత్సరం 1,50,000/- రూపాయలు ,రెండవ సంవత్సరం 1,65,000 /- రూపాయలు , మూడవ సంవత్సరం 1,85,000 /-రూపాయలు జీతం లభిస్తుంది.
  • ఇన్స్ట్రక్టర్ గా ఎంపిక కాబడిన వారు నెలకు  మొదటి సంవత్సరం 1,25,000/- రూపాయలు ,రెండవ సంవత్సరం 1,35,000/- రూపాయలు , మూడవ సంవత్సరం 1,45,000 /-రూపాయలు జీతం చొప్పున  పొందుతారు
  • సెక్యూరిటీ స్క్రీనర్ (ఫ్రెషర్) గా ఎంపిక కాబడిన వారు నెలకు  మొదటి సంవత్సరం 30,000/- రూపాయలు ,రెండవ సంవత్సరం 32,000 /- రూపాయలు , మూడవ సంవత్సరం 34,000 /-రూపాయలు జీతం చొప్పున  పొందుతారు

🔥 ఎంపిక విధానం :

  • చీఫ్ ఇన్స్ట్రక్టర్& ఇన్స్ట్రక్టర్ ఉద్యోగాలకు ఆన్లైన్ ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
  • సెక్యూరిటీ స్క్రీనర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన అభ్యర్థులలో షార్ట్ లిస్ట్ చేసి , ఎంపిక చేస్తారు.

🔥 ముఖ్యమైన తేదిలు : 

  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది : 21/11/2024
  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది :10/12/2024 ( సాయంత్రం 5:00 గంటల లోగా)
  •  చీఫ్ ఇన్స్ట్రక్టర్ & ఇన్స్ట్రక్టర్ ఉద్యోగాలకు ఆన్లైన్ ఇంటర్వ్యూ నిర్వహణ తేది : 28/11/2024 ( ఉదయం 11:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!