తెలంగాణ రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల కోరుతూ ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 1201 డ్రైవర్ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఎంపికైన వారికి తమ సొంత డిపోలోనే ఉద్యోగం ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఎంపికైన వారికి ప్రతి నెల 26,000/- జీతంతో పాటు రోజుకు 150/- రూపాయలు అలవెన్స్ కూడా ఇస్తారు.
అయితే ఈ ఉద్యోగాలకు అందరూ అప్లై చేసుకునే అవకాశం లేదు. కేవలం మాజీ సైనికులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.
తెలంగాణ సైనిక సంక్షేమ శాఖ తెలంగాణ రోడ్డు రవాణా సంస్థలు ఖాళీగా ఉన్న 1201 పోస్టులను భర్తీ చేసేందుకు మాజీ సైనికుల నుండి దరఖాస్తులు కోరుతుంది. ఈ పోస్టులకు అప్లై చేయడానికి క్రింది విధంగా అర్హతలు కలిగి ఉండాలి.
✅ తెలంగాణ లో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీ – Click here
🏹 అర్హతలు :
- మాజీ సైనికులై ఉండాలి. మరియు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
- కనీసం 18 నెలల డ్రైవింగ్ అనుభవం కలిగి ఉండాలి.
- వీరి వయస్సు 58 సంవత్సరాలకు మించ కూడదు.
- కనీసం 160 cm ఎత్తు కలిగి ఉండాలి.
🏹 అప్లై చేయడానికి చివరి తేదీ :
- ఈ పోస్టులకు పూర్తి అర్హతలు కలిగి ఉన్నవారు నవంబర్ 30వ తేదీ లోపు తమ అప్లికేషన్ పంపించాలి
🏹 అప్లికేషన్ పంపించాల్సిన మెయిల్ ఐడి :
- [email protected] లేదా [email protected] అని మెయిల్ ఐడి కి పంపించాలి.
- అభ్యర్థులు తమ డాక్యుమెంట్స్ స్కాన్ చేసి PDF రూపంలో మెయిల్ ద్వారా పంపించాలి.
🏹 జీతము :
- ఎంపికైన మాజీ సైనికులకు నెలకు 26 వేల రూపాయలు జీతంతో పాటు రోజుకు 150/- రూపాయల అలవెన్స్ కూడా ఇస్తారు.