తెలంగాణ ఫార్మసిస్ట్ గ్రేడ్-2 ఉద్యోగాలకు అప్లై చేసుకుని ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ముఖ్యమైన అప్డేట్. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు సంబంధించిన హాల్ టికెట్స్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ పోర్టు తన వెబ్సైట్లో విడుదల చేసింది.. ఈ పోస్టులకు అప్లై చేసిన అభ్యర్థులు తమ హాల్ టికెట్స్ అఫీషియల్ వెబ్సైట్ లో అప్లై చేసినప్పుడు ఇచ్చిన ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ప్రస్తుతం ఈ పరీక్ష నవంబర్ 30వ తేదీన రెండు సెషన్స్ లో నిర్వహిస్తున్నట్లు బోర్డు వెల్లడించింది.
అభ్యర్థులు తమ హాల్ టికెట్ ను A4 షీట్ పైన ప్రింట్ తీసుకొని హాల్ టికెట్ తో పాటు నీలం లేదా నలుపు బాల్ పాయింట్ పెన్ను, గుర్తింపు కార్డు తో పరీక్షకు హాజరు కావాలి.
పరీక్షకు హాజరై అభ్యర్థులు పాటించాల్సిన జాగ్రత్తలకు సంబంధించి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్ లో ఒక వెబ్ నోట్ కూడా విడుదల చేసింది. అభ్యర్థులు దానిలో ఉన్న సూచనలు తప్పనిసరిగా పాటిస్తూ పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది.
🏹 తెలంగాణ కోపరేటివ్ బ్యాంక్స్ లో ఉద్యోగాలు – Click here
నవంబర్ 30వ తేదీన రెండు సెషన్స్ లో లలో పరీక్ష నిర్వహించబోతున్నట్టు బోర్డు వెల్లడించింది. రెండు షిఫ్ట్ లో పరీక్ష ను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహిస్తున్నారు. కాబట్టి నార్మలైజేషన్ విధానం కూడా మార్కులకు అప్లై చేస్తామని బోర్డు తెలియజేసింది.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాబోయే అభ్యర్థులకు అవగాహన కోసం ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 మాక్ టెస్ట్ ను కూడా అధికారిక వెబ్సైట్లో బోర్డు పెట్టడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు వెబ్సైట్లో ఇచ్చిన మార్క్ టెస్ట్ రాయవచ్చు.
అభ్యర్థులు ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేయడానికి మరియు బోర్డు విడుదల చేసిన వెబ్ నోట్ డౌన్లోడ్ చేయడానికి మరియు మాక్ టెస్ట్ రాయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి.
🏹 Official Website – Click here
🏹 Download Hall Tickets – Click here
ఈ సంవత్సరం ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ పోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ విడుదల చేసిన సమయంలో మొత్తం 633 పోస్టులకు భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్ లో బోర్డు పేర్కొంది. కానీ తర్వాత ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన మరో 99 ఫార్మసిస్ట్ 2 ఉద్యోగాలు కూడా ఇదే నోటిఫికేషన్లో జతపరిచి మొత్తం 722 పోస్టులు భర్తీ చేస్తున్నట్లు బోర్డు తర్వాత తెలిపింది.
ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించింది. నోటిఫికేషన్ విడుదల చేసిన సమయంలోనే నవంబర్ 30వ తేదీన పరీక్ష నిర్వహించబోతున్నట్లుగా ముందుగానే వెల్లడించింది బోర్డు.
బోర్డు చెప్పిన విధంగానే నవంబర్ 30వ తేదీన పరీక్ష నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు నిర్వహించి ప్రస్తుతం హాల్ టికెట్స్ కూడా విడుదల చేయడం జరిగింది.
🔥 ఎంపిక విధానము : ఈ ఉద్యోగాల ఎంపికలో మొత్తం 100 పాయింట్లకు ఎంపిక చేస్తారు.
- ఇందులో 80 పాయింట్లు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు.
- 20 పాయింట్లు గతంలో కాంట్రాక్టు లేదా అవుట్సోర్సింగ్ విధానంలో ప్రభుత్వ ఆసుపత్రులు, సంస్థలు, ప్రోగ్రాం లలో పనిచేసిన వారికి వెయిటిజి మార్కులు ఇస్తారు.
🔥 భర్తీ చేయబోయే మొత్తం ఖాళీల సంఖ్య : 722
🔥 పరీక్ష విధానం :
- 80 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో ప్రశ్నలు అభ్యర్థులు అప్లై చేసిన ఉద్యోగాల అర్హతకు సంబంధించిన సిలబస్ నుండి ఇస్తారు.
- ప్రతి ప్రశ్నకు ఒక మార్క్ ఉంటుంది..
- పరీక్షలో నెగిటివ్ మార్కులు ఉండవు.
- పరీక్ష ఇంగ్లీషులో మాత్రమే నిర్వహిస్తారు.
- పరీక్ష తెలుగులో ఉండదు
🔥 పరీక్షా కేంద్రాలు :
- హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్నగర్, సంగారెడ్డి, అదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ మరియు నర్సంపేట ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
- అభ్యర్థులు తాము అప్లై చేసే సమయంలో ఎంపిక చేసుకున్న పరీక్షా కేంద్రాల్లో ఒకదానిని పరీక్ష రాయడానికి కేటాయిస్తారు.
🏹 Official Website – Click here
🏹 Download Hall Tickets – Click here