తెలంగాణ లోని టీజిసిఎబి ( TGCAB) & డీసీసీబీ (DCCB ) లో కొఆపరేటివ్ ఇంటర్న్స్ నియామకానికి నోటిఫికేషన్ విడుదల అయ్యింది .
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి విద్యార్హతలు , దరఖాస్తు విధానం ,ఎంపిక విధానం మొదలగు పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🔥 తెలంగాణ జిల్లా కోర్టు లో ఉద్యోగాలు భర్తీ – Click here
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : TGCAB & DCCB
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు : కో ఆపరేటివ్ ఇంటర్న్స్
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 10
- TGCAB లో ఇంటర్న్ – 01
- డీసీసీబీ లో ఇంటర్న్ – 09
🔥 విద్యార్హత :
- ఎంబీఏ లేదా మార్కెటింగ్ మేనేజ్మెంట్ / కో ఆపరేటివ్ మేనేజ్మెంట్ / అగ్రిబిజినెస్ మేనేజ్మెంట్ / రూరల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ లో తత్సమాన అర్హత కలిగి వుండాలి.
లేదా
- AICTE లేదా UGC తో గుర్తింపు పొందిన 2 సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ ( PGDM) ఉత్తీర్ణత సాధించి వుండాలి.
🔥వయస్సు :
- అభ్యర్థుల వయస్సు 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపుగా వుండాలి.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు దరఖాస్తును స్పీడ్ పోస్ట్ ద్వారా ఈ క్రింది చిరునామాకు చెరవేయ్యాలి.
The Deputy General Manager , Human Resource Management Department, The Telangana State Cooperative Bank Ltd., #4-1-441, Troop Bazar,Hyderabad – 500 001.
🔥 ఎంపిక విధానం :
- అభ్యర్థులను వారికి వారి అకడమిక్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 రెమ్యునరేషన్ :
- నెలకి 25,000/- రూపాయల రెమ్యునరేషన్ లభిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదిలు:
- స్పీడ్ పోస్ట్ ద్వారా దరఖాస్తు ను తేది 30/11/2024 లోగా ఆఫీస్ వారి చిరునామాకు చేరాలి.