ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ( JAM) grade ఓ , స్పెషలిస్ట్ అగ్రి అసెట్ ఆఫీసర్ ( AAO) ఉద్యోగాల భర్తీ కొరకు అర్హత , ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 600 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ( JAM) ఖాళీలు: 500 , స్పెషలిస్ట్ అగ్రి అసెట్ ఆఫీసర్ ( AAO) ఖాళీలు : 100 వున్నాయి.
డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🏹 రాత పరీక్ష లేకుండా BHEL లో ఉద్యోగాలు భర్తీ – Click here
🏹 తెలంగాణ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రాం కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 600
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ( JAM) – 500
- స్పెషలిస్ట్ అగ్రి అసెట్ ఆఫీసర్ ( AAO ) -100
🔥 విద్యార్హత :
1)జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ( JAM) , గ్రేడ్- O:
- గుర్తింపు పొందిన సంస్థ లేదా యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉత్తీర్ణత సాధించి వుండాలి.
2)స్పెషలిస్ట్ అగ్రి అసెట్ ఆఫీసర్ ( AAO ) :
- అగ్రికల్చర్, హార్టికల్చర్ , అగ్రికల్చర్ ఇంజనీరింగ్ , ఫిషరీస్ సైన్స్ / ఇంజనీరింగ్ , అనిమల్ హస్బండరీ , వెటర్నరీ సైన్స్ , ఫోరెస్ట్రి , డైరీ సైన్స్ / టెక్నాలజీ , ఫుడ్ సైన్స్ / టెక్నాలజీ , పిస్కి కల్చర్ , అగ్రో ఫారెస్టరి, సేరి కల్చర్ లలో 4 సంవత్సరాల డిగ్రీ ( బి . ఎస్సీ / బి.టెక్ / బి.ఈ) ఉత్తీర్ణత సాధించి వుండాలి
🔥 వయస్సు :
- 20 సంవత్సరాలు నిండి యుండి 25 సంవత్సరాల లోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- అభ్యర్థులు అక్టోబర్ 2 1999 కంటే ముందుగా , అక్టోబర్ 1 , 2004 తర్వాత జన్మించి వుండరాదు ( పేర్కొన్న రెండు తేదీలను పరిగణిస్తారు )
- ఎస్సీ , ఎస్టీ , ఓబీసీ ( NCL), దివ్యాంగులు , Ex – సర్విస్ మాన్ వారికి ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు వయో సడలింపు కలదు.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.
🔥 అప్లికేషన్ ఫీజు :
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 250/- రూపాయలు దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
- మిగతా అందరు అభ్యర్థులు 1050/- రూపాయల దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
🔥 జీతం :
- సంవత్సరానికి 6.14 లక్షల నుండి 6.50 లక్షల వరకు జీతం లభిస్తుంది.
- ఈ ఉద్యోగాలను పొందిన వారు IDBI బ్యాంక్ వారి న్యూ పెన్షన్ స్కీమ ( IBLNPS) కు అర్హత పొందుతారు.
🔥 ఎంపిక విధానం :
- అభ్యర్థులను వ్రాత పరీక్ష ( ఆన్లైన్ టెస్ట్ ) , డాక్యుమెంట్ వెరిఫికేషన్ , పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహణ ద్వారా ఎంపిక చేస్తారు.
- వ్రాత పరీక్ష లో రీజనింగ్ , ఇంగ్లీష్ లాంగ్వేజ్ , క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ , జనరల్ అవేర్నెస్ సబ్జెక్టులు వుంటాయి.
- AAO ఉద్యోగాలకు వీటితో పాటు గా ప్రొఫెషనల్ నాలెడ్జ్ పై కూడా పరీక్ష నిర్వహిస్తారు.
🔥 ముఖ్యమైన తేదిలు:
- వయస్సు మరియు విద్యార్హత నిర్ధారణ కొరకు కట్ అఫ్ తేది : 01/102024
- నోటిఫికేషన్ విడుదల అయిన తేది: 20/11/2024
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది :21/11/2024
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది :30/11/2024
- వ్రాత పరీక్ష నిర్వహణ ( టెంటేటివ్) : డిసెంబర్ 2024 లేదా జనవరి 2025
👉 Click here for official website