తెలంగాణ రాష్ట్రంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అధారిటీ, నల్గొండ నుండి రికార్డ్ అసిస్టెంట్ మరియు, టైపిస్ట్ కం అసిస్టెంట్ అనే ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు నవంబర్ 18వ తేదీ నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు అప్లై చేయవచ్చు. అప్లై చేసుకున్న అభ్యర్థులకు డిసెంబర్ 15వ తేదీన పరీక్ష నిర్వహించబోతున్నట్లుగా నోటిఫికేషన్ లో ముందుగానే తెలియజేశారు. అభ్యర్థులకు స్థానిక జిల్లా భాష తప్పనిసరిగా వచ్చి ఉండాలి.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని అర్హత ఉన్న ప్రతి ఒక్కరు త్వరగా అప్లికేషన్ పెట్టుకోండి.
🏹 రేషన్ డీలర్ల నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానం – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అధారిటీ తెలంగాణ , నల్గొండ నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
🔥 పోస్టుల పేర్లు :
- ఈ నోటిఫికేషన్ ద్వారా టైపిస్ట్ కం అసిస్టెంట్ మరియు రికార్డ్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం పోస్టుల సంఖ్య :
- నోటిఫికేషన్ ద్వారా 04 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
- వీటిలో రెండు టైపిస్ట్ కం అసిస్టెంట్ ఉద్యోగాలు మరియు రెండు రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి.
🔥 అర్హతలు :
- టైపిస్ట్ కం అసిస్టెంట్ ఉద్యోగాలకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఆర్ట్స్ లేదా సైన్స్ లేదా కామర్స్ లేదా లా లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. మరియు టైపు రైటింగ్ హైయర్ గ్రేడ్ ఇంగ్లీష్ లో గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ పాస్ అయ్యి ఉండాలి. టైప్ రైటింగ్ హైడ్ గ్రేడ్ పూర్తి చేసిన వాళ్లు లేకపోతే లోయర్ గ్రేడ్ పూర్తి చేసిన వారిని పరిగణలోకి తీసుకుంటారు. ఈ ఉద్యోగాలకు కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉండాలి.
- రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు పదో తరగతి పూర్తి చేసిన వాళ్లు అప్లై చేసుకోవచ్చు.
🔥 వయస్సు :
- కనీసం 18 సంవత్సరాలు నుండి 34 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి అర్హులు.
🔥 వయసులో సడలింపు :
- ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయసులో ఐదు సంవత్సరాలు సడలింపు ఇస్తారు.
- PwBD అభ్యర్థులకు వయసులో 10 సంవత్సరాలు సడలింపు ఇస్తారు..
🔥 అప్లికేషన్ ఫీజు :
- ఓసి మరియు బీసీ అభ్యర్థులు 800 రూపాయలు ఫీజు చెల్లించాలి.
- ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు 400 రూపాయలు ఫీజు చెల్లించాలి.
- The Principal District Legal Services Authority, Nalgonda అనే పేరు మీద చెల్లి బాట అయ్యేవిధంగా డిడి రూపంలో ఫీజు చెల్లించాలి.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేది :
- 16-11-2024 నుండి ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.
🔥 చివరి తేదీ :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ 02-12-2024
🔥 అప్లికేషన్స్ వెరిఫికేషన్ తేదీలు :
- అప్లై చేసుకున్న అభ్యర్థుల అప్లికేషన్స్ డిసెంబర్ 3 నుండి డిసెంబర్ 5వ తేదీ వరకు వెరిఫికేషన్ చేస్తారు.
🔥 హాల్ టికెట్స్ డౌన్లోడింగ్ తేదీ :
- 09-12-2024 తేదీ నుండి అభ్యర్థులు తమ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
🔥 పరీక్ష తేదీలు :
- 15-12-2024 తేదీన ఈ రెండు రకాల ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహిస్తారు.
🔥 అప్లై చేయు విధానం :
- అభ్యర్థులు తమ అప్లికేషన్ ను నింపి అవసరమైన సర్టిఫికెట్స్ మరియు ఫీజు చెల్లించిన డిడి ని కూడా జతపరిచి కొరియర్ ద్వారా లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా పంపించాలి.
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :
- అభ్యర్థులు తమ అప్లికేషన్ ను నింపి అవసరమైన సర్టిఫికెట్స్ మరియు ఫీజు చెల్లించిన డిడి ని కూడా జతపరిచి కొరియర్ ద్వారా లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా పంపించాలి.
🔥 అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా :
చైర్మన్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అధారిటీ, న్యాయ సేవా సదన్, డిస్ట్రిక్ట్ కోర్ట్ పర్మిసెస్, నల్గొండ
🔥 ఎంపిక విధానం :
- టైపిస్ట్ కం అసిస్టెంట్ ఉద్యోగాలకు ఓఎంఆర్ విధానంలో 40 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష రాయడానికి 40 నిమిషాల సమయం ఇస్తారు. ఇదే టైపిస్ట్ కం అసిస్టెంట్ ఉద్యోగాలకు టైప్ రైటింగ్ టెస్ట్ 40 మార్కులకు నిర్వహిస్తారు. టైప్ రైటింగ్ టెస్ట్కు ఐదు నిమిషాల సమయం ఇస్తా. దీనితోపాటు 20 మార్కులకు ఓరల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
- రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 80 మార్కులకు 90 నిమిషాలతో ఓఎంఆర్ పరీక్ష నిర్వహిస్తారు. 20 మార్కులకు ఓరల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
- ఈ రెండు రకాల ఉద్యోగాలకు పరీక్ష ఇంగ్లీష్ భాషలో నిర్వహిస్తారు.
Note : పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ మరియు అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి.
🏹 Download Full Notification – Click here
🏹 Official Website – Click here