డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) కు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ (DRDL) నుండి జూనియర్ రీసెర్చ్ ఫెలో అనే పోస్టుల భర్తీకి దరఖాస్తుల కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
ఈ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ (DRDL) హైదరాబాదులోని కాంచన్ బాగ్ లో ఉంది. ఈ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు కూడా లేదు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి ముఖ్యమైన సమాచారంతో పాటు పూర్తి నోటిఫికేషన్ & అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి అవసరమైన లింక్ ఈ ఆర్టికల్ చివరిలో ఇవ్వబడినది.
🏹 ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు – Click here
🏹 తెలంగాణ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రాం కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- హైదరాబాదులో ఉన్న DRDO – DRDL నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
🔥 భర్తీ చేయబోయే పోస్టులు :
- జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF-1 , JRF-2) అనే పోస్టులు భర్తీ కోసం అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
- DRDO – DRDL నుండి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 12 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
🔥 విద్యార్హత :
- పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో మొదటి శ్రేణిలో BE / B.Tech లేదా ME / M.Tech వంటి విద్యార్హతలు కలిగి ఉండాలి.
- పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టులలో GATE ఉత్తీర్ణులై ఉండాలి.
🔥 వయస్సు :
- ఈ పోస్టులకు అప్లికేషన్ పెట్టుకోడానికి గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు లోపు ఉన్నవారు అర్హులు.
🔥 వయస్సులో సడలింపు :
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయసులో ఐదేళ్లు సడలింపు ఉంటుంది.
- ఓబీసీ అభ్యర్థులకు వయస్సులో మూడేళ్లు సడలింపు ఉంటుంది.
🔥దరఖాస్తు విధానం :
- DRDO – DRDL పోస్టులకు అర్హత ఉన్న అభ్యర్థులు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
- ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తమతోపాటు అప్లికేషన్ తో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు అటెస్ట్ చేసిన జిరాక్స్ కాపీలతో వెళ్లాలి.
🔥 ఎంపిక విధానం :
- గేట్ స్కోర్ మరియు అర్హత పరీక్షలు వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.
🔥 అప్లికేషన్ ఫీజు :
- ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.
🔥 స్టైఫండ్ :
- ఎంపికైన అభ్యర్థులకు నెలకు 37,000/- స్టైఫండ్ తో పాటు HRA కూడా ఇస్తారు.
🔥 ఇంటర్వ్యూ తేదీ :
- JRF-1 డిసెంబర్ మూడు నాలుగు తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
- JRF-2 పోస్టులకు డిసెంబర్ 5 , 6 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
🔥 ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం :
- DLOMI, DRDO Township, Kanchanbagh, Hyderabad – 500058
👉 Click here for notification – Click here
👉 Official Website – Click here